Monday, August 8, 2022

ఇంద్రియాలను నియంత్రించుకునే విధానం ఏమిటి ?

 🙏🕉🙏 ...... *"శ్రీ"*


                 💖💖💖

       💖💖 *"300"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖


*"ఇంద్రియాలను నియంత్రించుకునే విధానం ఏమిటి ?"*

******


*"ఇంద్రియాలను నియంత్రించుకోవాలంటే వివేకం కావాలి. మనకు ఏది అవసరమో, ఏది అనవసరమో గుర్తించాలి. అంటే మనబుద్ధి సక్రమంగా పనిచేయాలి. నిజానికి ఆత్మానుభవం బుద్ధిస్థాయికి మించిందే అయినా ఆ బుద్ధిని బుద్ధికుశలతతోనే దాటగలం. కనుక బుద్ధిని బాగుచేసుకోవటం చాలాముఖ్యం. బుద్ధి అంటే మంచి చెడుల వివేచన. అది కలిగిన రోజు చెడును వదిలి మంచిని మాత్రమే స్వీకరించగలుగుతాం. మనకి ఆత్మ గురించి ఏ జాగ్రత్తలు అవసరం లేదు. కానీ ఆ ఆత్మ తెలియాలంటే బుద్ధి విషయాలలో చాలా జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన సచ్ఛీలమంతా బుద్ధిపైనే ఆధారపడి ఉంది. ఇంద్రియాల ద్వారా ఏ చెడు జరగకూడదన్న సూచననే మన పెద్దలు చెడుఅనకు, చెడువినకు, చెడుకనకు, చెడుతినకు, చెడుఅంటుకోకు అనిచెప్పారు "!*


*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*

           🌼💖🌼💖🌼

                 🌼🕉🌼 

దైవాన్ని_కోరిక_ఎలా_కోరాలి

 🕉️🕉️🕉️#దైవాన్ని_కోరిక_ఎలా_కోరాలి 🕉️🕉️🕉️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🔱 👉నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి అంటే, ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది..

🔱 👉నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే, నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది..

🔱 👉నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే, నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..

🔱 👉నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే, నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ/పతి భాగస్వామి అవుతుంది..

🔱 👉నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి, దర్శనానికి రావాలి అంటే, నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..

🔱 👉భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే, నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం..

🔱 👉కుటుంబం అంతా సంతోషంగా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే, నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబంలో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి..

🔱 👉చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే, భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..

👉మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది..

🔱👉 ఓం నమో దుర్గాయ నమః 🚩🔱

సర్వలుకు సన్మంగళానిభవంతు

శుభంకలుగుగాక 🚩🚩 

మౌనం వ్రతం.....

 *మౌనం వ్రతం.....*

మానవుడు మాయలో బ్రతుకుతుంటాడు. మానవ జీవితం అంతా తమస్సు, రజస్సు, సత్వ గుణాలతో నడుస్తుంది. వీటి ప్రభావంతో ఏర్పడే కామ, క్రోథ, లోభ, మోహ, మద, మత్సరాలనే అరిషడ్వర్గాలు, మనిషి జీవిత గమనాన్ని అడ్డుకుంటుంటాయి. కోరికలు పెరగడం, అది తీరకపోతే కోపాన్ని పెంచుకోవడం, ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏవోవో కావాలని ఆశ పడటం, అన్నీ ఉన్నాయి అంటే దాని వల్ల వచ్చే గర్వం.. ఇలా మనిషి జీవితమంతా ఈ ఆరు గుణాల చుట్టూనే తిరుగుతుంటుంది. మానవ వాక్కు చేత ఇవన్నీ ప్రభావితమౌతాయి.

అయితే.. వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి. కోరికల గుర్రాల్ని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది. మాట్లాడకుండా మనసులోని భావాన్ని మాటల ద్వారా వ్యక్తీకరించకుండా ఉండటం మనిషికి చాలా కష్టం. సాధన మీదే అది సాధ్యపడుతుంది. అరిషడ్వర్గాలను జయించే ప్రయత్నంలో తపస్సు చేసుకునే మునీశ్వరులు మౌనం పాటించేది ఈ కారణం వల్లనే. మౌనంగా ఉండే కారణంగానే వాళ్లను మునులు అంటారు.

మనిషి మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల్ని నివారించవచ్చు. మరెన్నో సమస్యల్ని అధిగమించవచ్చు. చేసే పనిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చు. నేటికీ చాలా మంది దైవ భక్తి ఉన్న వారు, వారం చేస్తున్నప్పుడు మౌనవ్రతాన్ని అవలంబిస్తుంటారు. ఆరోగ్యపరంగా, మానసిక ప్రశాంతత పరంగా ఎంతో మేలు చేస్తుంది మౌనవ్రతం. ఆధ్యాత్మికంగా ఈ వ్రతంతో చేసేవారి వాక్కుకు శక్తి పెరుగుతుంది. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేని కారణంగా వాక్శుద్ధి అవుతుంది.

ఎంత కోపం వచ్చినా మౌనవ్రతంలో ఉన్న కారణంగా ఎదుటి వారిని తిట్టకుండా తమను తాము నిగ్రహించుకుంటారు. తద్వారా మానవ జీవితంలో ప్రధాన శత్రువైన కోపాన్ని అధిగమించినట్టే. తుపాకీ గుండు కంటే మాట్లాడే మాట చాలా శక్తి కలిగినది. మౌనవ్రతం కారణంగా అనవసర వ్యాగ్యుద్ధాలు, అశాంతి ఉండవు. ప్రపంచమంతా నిశ్చలంగా కనిపిస్తుంది. మాట విలువు తెలిసిన వాళ్లు, దాన్ని తక్కువగా వాడటానికి ఎక్కువ ఇష్టపడతారు. మనల్ని మనం సైలెంట్ గా ఉంచుకోవడం ద్వారా అవతలి వారు చెప్పేది వినడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.

వాక్శుద్ధి అనేది చాలా పవిత్రమైంది. నోటి వెంట తప్పుడు కూతలు రాని వాళ్లకు, ఎప్పుడూ మంత్ర సాధన చేసేవారికి ఈ వాక్శుద్ధి ఉంటుంది. అలాగే ఎక్కువ మౌనాన్ని ఆశ్రయించే వారికి కూడా వాక్శుద్ధి మంచిగా ఉంటుంది. ఈ సిద్ధి ఉన్నవాళ్లు అన్నది వెంటనే జరిగిపోతుంటుంది. మంచి అయినా చెడు అయినా, వీరు అనగానే ఇట్టే ఫలితం కళ్లముందు కనిపిస్తుంది. మాటను పొదుపుగా వాడితే, లాభమే తప్ప నష్టం లేదు. మనకు తెలియకుండానే రోజూ మాట్లాడుతూ, నోటికి చాలా పని కల్పిస్తుంటాం. ఎప్పుడూ పనిచేస్తూ ఉంటే మన శరీర భాగాలకు కాస్త రెస్ట్ ఇవ్వడం కోసమే, పూర్వీకుల ఇలాంటి వ్రతాల్ని కనిపెట్టారు. పరిమితమైన ఉపవాసం పొట్టకు మంచింది. పరిమితమైన వాక్కు మొత్తం శరీరానికి మంచిది.

వారంలో కేవలం ఒక్కరోజు మౌనవ్రతం చేస్తే పోయేదేమీ ఉండదు. మనలోని వాక్శక్తి ఆదా అవడంతో పాటు, అనవసరపు తగాదాల్ని అడ్డుకునే ఈ మౌనవ్రతం, మనిషికి చాలా అవసరం. వివాదాలకు హద్దులేని నేటి సమాజంలో అత్యవసరం...

* ఓం నమః శివాయ * 

నిబద్ధత అంటే ఏమిటి ?

 నిబద్ధత అంటే ఏమిటి ?  

🌈💫💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

🌈  ఒక దృఢసంకల్పానికో, మంచి మాటకో, సిద్ధాంతానికో కట్టుబడి ఉండటమే ‘నిబద్ధత’• 

 🌈 మనోవాక్కాయకర్మలతో నిరంతరం ఆ సత్సంకల్పాన్ని ఆచరించడం, నిమగ్నం కావడమే నిబద్ధత అనిపించుకుంటుంది.

ప్రతి మనిషీ ఏదో ఒక విషయంలోనో, కొన్ని విషయాల్లోనో నిబద్ధుడై ఉంటాడు. అప్పుడే ఆయా పనుల్లో విజయం సాధించగలుగుతాడు•

🌈 ఆధ్యాత్మిక సంపన్నులెవ్వరూ తాము ఏర్పరచుకున్న నియమ నిబంధనలను అతిక్రమించరు. విస్మరించరు. నిబద్ధులైనవారికి ఆత్మవిశ్వాసం ఎల్లవేళలా తోడుంటుంది.  వారికెప్పుడూ నిరాశా నిస్పృహలు కలగవు. పైగా అంతర్యామికి అధీనులై ఆత్మ సమర్పణ భావంతో, సర్వదా చైతన్యమూర్తులై ఉంటారు•

🌈 నారాయణుడే వారికి నమ్మకం. నారాయణ శరణాగతే వారి ఆశయం•

🌈  నిబద్ధత లేనివాడి మనసు చాంచల్యమనే బలహీనతకు బానిసైపోతుంది• 

🌈 అటువంటివాణ్ని కామక్రోధాది అరిషడ్వర్గాలు ఆవరించి అధఃపాతాళానికి తొక్కేస్తాయి. వాడు భూమికి భారమై చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు•

🌈 ఆధ్యాత్మిక నిబద్ధత లేని జీవితం కవచం లేకుండా యుద్ధానికి వెళ్లడంలాంటిది. 

🌈 ఒక సత్సంకల్పం, దాన్ని ఆచరించే ప్రణాళిక, ఆచరణలో ఏకాగ్రత, సాధన... మనిషిని అసలైన నిబద్ధుడిగా నిలబెడతాయి•

🌈  బాధలు అనే మదపుటేనుగును సైతం లొంగదీసుకునే అంకుశమే నిబద్ధత. 

🌈 సత్సంకల్పం మీద నమ్మకం లేనివాడు, దానికి కట్టుబడనివాడు సమస్యల్ని అధిగమించలేడు•

🌈  నిజాయతీపరుడు, నిబద్ధతతో జీవించగలిగితే ఆధ్యాత్మికంగా ఉన్నతదశకు చేరుకోగలుగుతాడు. పదిమందికీ దిశానిర్దేశం చేయగలుగుతాడు. ఏ ఓటమైనా అతడి ముందు చేతులు కట్టుకు నిలబడుతుంది. నిబద్ధత లేని జీవన విధానం జీనులేని గుర్రంలాంటిది. 

🌈 జీవితమన్నాక ఎన్నో ఒడుదొడుకులు వస్తుంటాయి. అవరోధాలు కలుగుతాయి. బాధలు ఎదురవుతాయి. అవన్నీ భగవంతుడు పంపిన దూతలనుకొని, వాటిని గౌరవించాలి, భరించాలి, సహించాలి. స్థితప్రజ్ఞుడు నిబద్ధతతో సుఖదుఃఖాలను, విజయాలను, విఘ్నాలను సమానంగానే చూస్తాడు, అనుభవిస్తాడు. సుఖాన్నిచ్చే వస్తువు దగ్గర ఉన్నా లేకపోయినా, తేడా అనేది తెలీదు నిబద్ధుడైనవాడికి.

🌈 అటువంటివాడు పరమాత్మకు అత్యంత ప్రియుడు, ఆత్మీయుడు. సత్కార్యం పట్ల శ్రద్ధ, ప్రేమ ఉన్నవాడిని ఏ మనో వికారమూ ప్రలోభపెట్టలేదు.

🌈 పురాణేతిహాసాల్లో చాలా పాత్రల్లో మనకు ఈ నిబద్ధత కనిపిస్తుంది.

👉 ధర్మానికి నిబద్ధుడు శ్రీరాముడు. 

👉 భ్రాతృ భక్తికి నిబద్ధులైనవారు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. 

👉 దాస్య భక్తికి కట్టుబడినవాడు హనుమ. 

👉 స్వామిభక్తికి లోనైనవాడు కర్ణుడు. 

👉 బ్రహ్మచర్య దీక్షకు జీవితాన్ని ధారపోసినవాడు భీష్ముడు. 

👉 సత్యానికి జీవితం అంకితం చేసిన మహనీయుడు హరిశ్చంద్రుడు. 

👉 దానగుణానికి ప్రసిద్ధి చెందినవారు శిబి, దధీచి, బలి. 

👉 సాధ్వీమణులంతా పతిసేవా పరాయణత్వంతో ఆదర్శమూర్తులైనారు. 

🌈 ప్రేమ, వాత్సల్యం, బంధానుబంధాలు, సత్సాంగత్యం, గురుభక్తి, అహింస, పరోపకార చింతన, నిస్వార్థం, నిరహంకారం, జ్ఞానతృష్ణ... నిబద్ధుడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు. 

🌈 అతడిలో ఏ దుర్లక్షణం ప్రవేశించినా కుండెడు తేనెలో విషపు చుక్క వేసినట్లే. ఇందుకు రావణుడే ప్రత్యక్ష తార్కాణం. 

🌈 నిరంతర సాధన, ఏకాగ్రత,  శ్రద్ధ, పట్టుదల సత్సంకల్ప సాధనకు పట్టుగొమ్మలు. అవే జాతి ప్రగతికి, దేశ భవితకు అసలైన సొమ్ములు.

Sunday, August 7, 2022

‘‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’ దయచేసి ఈ కథను చివరివరకు అందరూ చదవండి చదివించండి.

  ‘‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’  దయచేసి ఈ కథను చివరివరకు అందరూ చదవండి చదివించండి. 

వినోద్‌ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి. 

అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది, ఎన్నో సినిమాల్లో చూసింది. 

కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదనీ, భర్తకంటే ముందే పునిస్త్రీగా వెళ్ళిపోవాలనీ అందరు దేవుళ్ళనూ కోరుకుంది. 

అయితే తన ప్రార్థన ఫలించలేదు.

 భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుణ్ణి చేరుకున్నాడు.

‘‘అమ్మ మన ఇద్దరిదగ్గరా ఉంటుంది. అలా అని ఏడాదికి ఆరునెలలంటూ మనం పంచుకోవలసిన అవసరంలేదు. ఆమెకు ఇష్టమైనన్ని రోజులు ఎవరి ఇంట్లోనైనా ఉండొచ్చు’’ అన్నాడు విజయ్‌.

విజయ్‌ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది.

 ‘అయినా తనకెందుకు లేనిపోని భయాలు, అనుమానాలు? తన బిడ్డల గురించి తనకు తెలియదా?’ అనుకుంది.

విజయ్, తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంకు పాస్‌బుక్‌ తీశాడు. 

తండ్రి పోయినరోజు నుంచి వైకుంఠ సమారాధన వరకూ అయిన ఖర్చులు ఇద్దరూ కలసి లెక్కలు వేశారు. 

బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చుపెట్టిన మొత్తంకంటే ఎక్కువగానే ఉండటం చూసి సంతోషించారు.

భర్త అకౌంటులో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవడం సావిత్రిని బాధించింది. 

‘అయినా తండ్రి అంతిమయాత్రకూ కార్యాలకూ అయ్యే ఖర్చులు ఆమాత్రం భరించలేరా.. ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అనుకుంది.

తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది.

‘‘మేమిద్దరం ఇళ్ళు కట్టుకున్నాం. అందుకు బ్యాంకు లోనుతోపాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఇల్లు అమ్మితే పదిలక్షలదాకా వస్తుంది. మేము చెరో అయిదు లక్షలు తీసుకుంటాం. ఎటూ నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు’’ అన్నాడు విజయ్‌ తల్లితో.

‘‘మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది. కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన ఇల్లు కాదు. ఎంతో శ్రమతో, శ్రద్ధతో, ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు. ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి. మీ చదువులూ ఆటలూ మీ భార్యల సీమంతాలూ మీ పిల్లల బారసాలలూ... అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి. ఎంతోమంది బంధువులూ స్నేహితులూ ఈ ఇంటికి వచ్చి, మన ఆతిథ్యాన్ని స్వీకరించి, మనసారా దీవించి వెశ్ళారు. మనకెన్నో తీయని అనుభూతుల్నీ మీ నాన్నగారికి తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చిన ఈ ఇంటిని అమ్మడం నాకిష్టంలేదురా’’ అంది సావిత్రి.

‘‘మనిషే పోయాక ఇక ఇల్లెందుకమ్మా? 

మా ఇళ్ళకీ బంధువులూ మిత్రులూ వస్తారు. అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం. పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం. ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుల్తో మా సమస్యలు తీరితే నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది’’ అన్నాడు వినోద్‌.

‘‘లేదురా, ఆయనకు ఈ ఇల్లంటే ప్రాణం. కనీసం నేను ఉన్నంతవరకైనా ఇల్లు అమ్మకండి. కావాలంటే నా నగలన్నీ ఇస్తాను. అవి అమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి’’.

‘‘నీ నగలు ఎన్ని ఉన్నాయమ్మా? అన్నీ అమ్మినా యాభైవేలు రావు’’ అన్నాడు విజయ్‌ విసుగ్గా.

‘‘అమ్మా, ఇంటి డాక్యుమెంట్లు కనబడటంలేదు. బ్యాంకు లాకర్లో పెట్టారా నాన్న?’’ బీరువా వెతుకుతున్న వినోద్‌ అడిగాడు.

‘‘లాకర్లో కాదు. నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. నేనూ ఆ విషయం మరచిపోయాను. ఇప్పుడు నువ్వడిగితే గుర్తొచ్చింది’’.

‘‘తాకట్టు పెట్టారా? అంత అవసరం ఏం వచ్చింది?’’ కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు.

‘‘మీ చదువుల కోసం’’.

‘‘మా చదువుల కోసమా? మా చదువులు పూర్తయి అయిదేళ్ళు కావస్తూంది’’ అన్నాడు విజయ్‌ అసహనంగా. బ్యాంకులోను వల్ల ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో తన వాటా మరింత తగ్గిపోతుందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను.

‘‘కావచ్చు. 

ఆయన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసినా జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు. 

మీకు ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోతే లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేటు కాలేజీల్లో మిమ్మల్ని ఇంజినీరింగ్‌ చదివించారు. 

మరి అంత డబ్బు ఆయనకు ఎక్కణ్ణుంచి వచ్చిందనుకున్నారు?

 మీకు ఉద్యోగాలొచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారనీ మీ వంతు సాయం చేస్తారనీ అనుకున్నాం. 

కానీ మీకా ఆలోచన లేకపోయింది.

 మీముందు చేయిచాచడానికి ఆయన ఇష్టపడలేదు. 

ఆ అప్పు అలాగే నిలిచిపోయింది. 

అప్పటికీ తన పెన్షను నుంచి కొంత, పైపోర్షను బాడుగ నుంచి కొంత బ్యాంకు లోనుకు కడుతూనే ఉన్నారు’’.

‘‘ఇంకా ఎంత కట్టాలట?’’ 

విజయ్‌ అడిగాడు.

‘‘అయిదు లక్షలు కట్టాలి’’ బీరువా నుంచి తీసిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను టీపాయ్‌మీదకి గిరాటేసి అన్నాడు వినోద్‌.

‘‘హు, ఏడ్చినట్లే ఉంది. ఈమాత్రం దానికి ప్రపంచంలో తానొక్కడే ఇల్లు కట్టినట్లూ పిల్లల్ని చదివించినట్లూ ఫోజులు’’ అన్నాడు విజయ్‌.

పిల్లలు భర్తను తేలికచేసి మాట్లాడుతూంటే సావిత్రికి ఎంతో బాధేసింది.

‘‘లోను తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా. అయినా ఆ అప్పు మీరు తీర్చాలా?’’ అని తన అనుమానం వ్యక్తంచేసింది.

‘‘ఆయన లేకపోతేనేం? మేం బతికున్నాం కదా. ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకూ వారసులమే. అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థంకాదు. ఇక మమ్మల్ని వదిలెయ్‌’’ రెండుచేతులూ జోడించి విసుగ్గా అన్నాడు వినోద్‌. 

సావిత్రి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

 ‘తను చదువుకోలేదు. ఉద్యోగం చెయ్యలేదు. కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేంకాదు. భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు. అర్థంకాకపోతే వివరించేవాడు. వీళ్ళకు అంత ఓపిక లేదు. అందుకే ఇలా విసుక్కుంటున్నారు. వీళ్ళకోసం, వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది? ఎన్ని రోజులు ఉపవాసాలుంది? ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది? అవన్నీ వాళ్ళకు ఇప్పుడు గుర్తులేదు. గుర్తుచేసుకోరు కూడా’ అనుకుంది.

ముఖ్యంగా కోడళ్ళముందు కొడుకులు తనను అలా విసుక్కోవడం ఆమెను మరింత బాధించింది.

 ‘కోడళ్ళను కన్నకూతుళ్ళలా చూసుకున్నారు తనూ భర్తా. వాళ్ళు కల్పించుకుని భర్తల్ని వారించకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూంది. ఆర్థిక అవసరాలు అభిమానాల్ని ఇంతగా చంపేస్తాయా?’ అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.


ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది. 

ఏడు గంటలు చూపిస్తూంది. 

‘అబ్బ, ఇంతసేపు ఎలా నిద్రపోయాను?’ అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది.

 ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది ఆమెకు.

‘రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ నిద్రపోయేసరికి పన్నెండు దాటింది. తెల్లవారుజామునే పిల్లల ప్రయాణం. నిద్రలేమి వల్ల తల పగిలిపోతూంది. కాఫీ గొంతులోపడితేగానీ అది తగ్గదు’ అనుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళి పాలబ్యాగులో చెయ్యిపెట్టి చూసింది. అది ఖాళీగా ఉంది.

తల్లిని తనతో తీసుకెళుతున్నాననీ మరుసటిరోజు నుంచి పాలప్యాకెట్‌ అవసరంలేదనీ పాలవాడితో విజయ్‌ ముందురోజు చెప్పడం గుర్తుకొచ్చింది.

 ‘ఇంటిపై లోను ఉందని తెలిసి, ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకుని వెళ్ళడం మరచిపోయారు ఇద్దరూ’ అనుకుని నవ్వుకుంది.

షాపు నుంచి పాలప్యాకెట్‌ తెచ్చుకోవడానికి చిల్లరకోసం ఇల్లంతా వెదికింది. 

ఎక్కడా చిల్లరగానీ కరెన్సీ నోట్లుగానీ కనిపించలేదు. 

తలనొప్పి క్షణక్షణానికి అధికం కాసాగింది. 

ఏంచేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కొక్కేనికి తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది.

 ఆశగా వెళ్ళి జేబులో చెయ్యి పెట్టింది. 

కొన్ని పదిరూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి. 

ఆమెకు ప్రాణం లేచివచ్చింది.

‘నీకు నేనున్నాను’ అని భర్త తనతో అన్న భావన కలిగింది ఆమెకు.

 ‘ఎప్పుడూ వందరూపాయలకు సరిపడా పదిరూపాయల నోట్లు జేబులో ఉంచుకోవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది’ అనుకుంది.

 కాసేపు భర్త ప్రేమను తలచుకుని ఏడ్చింది.

 తర్వాత చెప్పులేసుకుని షాపుకు బయలుదేరబోతూంటే రామయ్య వచ్చాడు. 

అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండరు.

అతను చేతిలోని ఫ్లాస్కు ఆమె చేతికిస్తూ ‘‘పిల్లలు ఊళ్ళకు వెళ్ళిపోయారని విన్నాను. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయిగా మరి. మరో నాలుగురోజులు మీరు వంట జోలికి పోకండి. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ నేను తెచ్చిస్తాను. మంచి శాకాహార హోటల్‌నుంచే తెస్తానులెండి. పదిరోజులుగా మనిషి పోయిన బాధతో, వచ్చేపోయే జనంతో బాగా అలసిపోయి ఉంటారు. నాలుగురోజులు విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ ఎటూ మనుషుల్లో పడిపోవాలి. తప్పదు’’ అన్నాడు.

సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి, అతనికొకటి ఇచ్చి తనొకటి తీసుకుంది.

‘‘అమ్మా, నా కూతురి పెళ్ళికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను. ఆయన తన పి.ఎఫ్‌. నుంచి లోను తీసుకుని నాకిచ్చారు. ప్రతినెలా అయ్యగారి జీతంనుంచి ఆ లోన్‌కు అయ్యే కటింగ్‌ మొత్తం ఆయనకు నా జీతంనుంచి ఇచ్చేసేవాణ్ణి. ఆయన రిటైర్‌ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలనుకున్నానుగానీ సాధ్యంకాలేదు. ఆయన రిటైర్‌ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకు ఇవ్వాల్సిన పి.ఎఫ్‌. నుంచి పట్టుకున్నారు. నేను ఈ నెల రిటైర్‌ అవుతున్నాను. నాకొచ్చే డబ్బుల్లోంచి మిగిలిన బాకీ మీకిచ్చేస్తాను. అటువంటి గొప్పవ్యక్తి అప్పు ఎగ్గొడ్తే నాకు మంచి జరగదమ్మా. ఆయన దేవుడమ్మా. అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేం’’ అంటూ రామయ్య ఏడవసాగాడు. 

సావిత్రి కళ్ళనిండా నీరు నిండింది.

‘‘అమ్మా, మీ పెన్షన్‌ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను. ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పి రామయ్య శెలవు తీసుకున్నాడు. 

ఆమెకు మళ్ళీ భర్త తనతో ‘నేనున్నాను’ అన్న భావన కలిగింది.

రామయ్య వెళ్ళిపోయాక ‘రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు. కానీ పదివేలు అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపనపడుతున్నాడే. 

మరి పాతికేళ్ళు పిల్లల్ని పెంచి, పెద్దచేసి చదివించామే. 

వాళ్ళకు తండ్రి బాధ్యత పంచుకోవాలనిగానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచనగానీ ఎందుకు రావడంలేదు? 

ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు? 

పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికీ తల్లిదండ్రులకీ మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలూ ఉండవా?

ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు. 

మంచితనం, మానవత్వం, నిజాయతీ, క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు.

 ఆయన వాటిని పాటించి చూపించారు కూడా. 

తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలేవరకూ తనవద్దనే ఉంచుకుని చూసుకున్నారు. 

తన తల్లి చివరి మూడురోజులూ మంచంమీదే ఉండిపోతే విసుగూ అసహ్యం లేకుండా అన్నిరకాల సేవలూ చేశారు. 

అవన్నీ పిల్లలు గమనించారు కూడా. 

మరి ఈరోజు వాళ్ళు తమ తల్లిపట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అనుకుంది.

వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆమెకు. 

‘ఆ కాలంలో టీవీలూ ఫ్రిజ్జులూ లేవు. 

సంపాదించిన డబ్బు కుటుంబంకోసం, పిల్లల చదువులకోసం ఖర్చుపెట్టేవారు.

 దుబారా ఖర్చులు చేసేవారు కారు.

 రాబడి, ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులుచేసే అవసరం ఉండేదికాదు. 

తృప్తిగా మనశ్శాంతితో బతికేవారు.

 కానీ ఈనాటి పరిస్థితి వేరు.

 పెళ్ళైన వెంటనే టీవీ, ఫ్రిజ్, ఏసీ, కంప్యూటర్, కారు అన్నీ కొనేయాలి. 

వీటిలో చాలా వస్తువులు స్టేటస్‌ సింబల్‌గా మారిపొయ్యాయి.

 అవసరాలకూ విలాసాలకూ తేడా తెలుసుకోలేకపోతున్నారు. 

ఇంటికి నిదానంగా ఒక్కొక్కటీ అమర్చుకుందామన్న ఆలోచన, ఓపిక లేదు.

 పైగా ఫ్లాట్ల రేట్లు  పెరుగుతున్నాయనీ ఇన్‌కమ్‌టాక్స్‌ తగ్గుతుందనీ చేతిలో డబ్బులు లేకపోయినా ఇళ్ళు కూడా కొనేస్తున్నారు. 

కంపెనీలూ బ్యాంకులూ లోన్లు ధారాళంగా ఇస్తూండటంతో అన్ని లోన్లూ తీసుకోవడం, జీతంలో ఇన్‌స్టాల్‌మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవడం, దీంతో ఇబ్బందులు, విసుగు, అసహనం మొదలు. 

వీటన్నిటితోపాటు ఉద్యోగంలో ఒత్తిడులు, అభద్రతాభావం పెరుగుతున్నాయి. 

ఇన్ని ఒత్తిడులమధ్య పాపం తల్లిప్రేమ, ఆమె సేవలు వీళ్ళకు గుర్తురావడంలేదు. 

ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్ళకు ఎప్పుడు అలవాటవుతుందో’ అనుకుని బాధగా నిట్టూర్చింది.

            


వారంరోజులు గడచిపోయాయి.

 సావిత్రికి పిల్లల నుంచి ఫోన్‌కాల్స్‌ లేవు. 

ఫోన్‌ మోగితే ‘పిల్లలనుంచేమో’ అని ఆశగా ఫోను దగ్గరికి పరిగెడుతూంది. 

ఓరోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి.

‘‘నా పేరు శ్రావణ్‌. బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్ని’’ అంటూ తన వివరాలు చెప్పాడతను.

‘‘రండి, కూర్చోండి’’ అంటూ కుర్చీ చూపించింది.

‘‘రామనాథంగారు నేను క్లర్క్‌గా ఉన్నప్పటినుంచీ నాకు తెలుసు. ఆయన ఇల్లు కట్టడంకోసం, పిల్లల చదువులకోసం, వాళ్ళ పెళ్ళిళ్ళకోసం, ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు. అయితే ఆయన ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టకపోవడం అన్నది ఇంతవరకూ జరగలేదు. మొదటిసారిగా ఆయన మార్ట్‌గేజ్‌ లోన్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ బాకీ పడింది. నాకు అనుమానమొచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది. మా బ్యాంకు క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్‌ను కోల్పోయింది’’ అన్నాడు బాధగా.

‘‘నాకు ఫ్యామిలీ పెన్షన్‌ మొన్న శాంక్షన్‌ అయింది. ఈనెల పెన్షన్‌ తీసుకోగానే బ్యాంకుకు వచ్చి కట్టేస్తాను’’ అంది సావిత్రి నొచ్చుకుంటూ.

‘‘అవసరంలేదమ్మా. ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడులక్షలు బాకీ ఉంది. అయితే చాలా ఏళ్ళకిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్సు స్కీములో మీవారి లోను కూడా కవర్‌ అయ్యేందుకు ఆయనచేత సంతకాలు పెట్టించుకుని ప్రీమియం కట్టించుకున్నాం. రామనాథంగారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లిస్తుంది. మీరు నయాపైసా కూడా కట్టక్కరలేదు. నేను అప్లికేషన్‌ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపండి. ఉంటానండీ’’ అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.

సావిత్రి భర్త ఫొటో వైపు చూసింది. రామనాథం నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు.


సావిత్రి కొడుకులకు ఫోన్‌చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ‘ఇల్లు అమ్మకానికి పెట్టాననీ ఎవరైనా వస్తే కబురు చేస్తాననీ వచ్చి మాట్లాడుకొమ్మనీ’ చెప్పింది.

 కొడుకులు ఆమె ఊహించినదానికంటే ఎక్కువగానే సంతోషించారు. 

ఆ రోజు సాయంత్రం ఊళ్లోఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజరుతో మాట్లాడింది.

 త్వరలోనే తను ఆశ్రమంలో చేరతానని చెప్పింది.

సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజరు ‘‘రామనాథంగారు చనిపోయారా? నాకా విషయమే తెలియలేదే’’ అంటూ విచారం వెలిబుచ్చారు.

‘‘ఆయన మీకు తెలుసా?’’ ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.

‘‘తెలియకపోవడం ఏమిటమ్మా? ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంటుకు అర్జీ పెట్టినప్పుడు కలెక్టరాఫీసులో ఆ సీట్లో ఉన్న మీవారిని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్నెంతో అభినందించారు. కలెక్టరుగారికి చెప్పి ఈ స్థలం మాకిప్పించారు. డిపార్ట్‌మెంట్‌లో ఆయనకున్న మంచిపేరు వల్ల కలెక్టరుగారు వెంటనే ఒప్పుకున్నారు. ఇంతచేసిన ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు. అటువంటి వ్యక్తి భార్య అయిన మీరు ఓ అనాథలా మా ఆశ్రమంలో చేరడం నాకు బాధగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళతాను. మాతోపాటు ఉండిపొండి. మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను’’.

సావిత్రికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

 ‘భర్త మంచితనం గురించి తెలుసుగానీ అది ఇంతమంది మనసుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు’ అనుకుంది.

 ‘మరణించి కూడా బతికి ఉండటం’ అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది.

‘‘వద్దండీ. నావల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే పిల్లల్ని కూడా కాదనుకుని ఇక్కడికి వస్తున్నాను. పైగా ఇక్కడ ఉంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది. మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండాలి. నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను’’ అంటూ అతని దగ్గర శెలవు తీసుకుంది.

ఒకరిద్దరు సావిత్రికి ఫోన్‌చేసి ఇల్లు కొనడానికి తమ ఆసక్తిని వెలిబుచ్చారు. 

ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటాననీ ఆరోజు వచ్చి మాట్లాడమనీ వాళ్ళతో చెప్పింది సావిత్రి. 

మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు.

ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి ‘‘మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా?’’ అని అడిగాడు వినోద్‌.

అతను ‘‘అవును. నా పేరు రామారావు’’ అంటూ తన వివరాలు చెప్పసాగాడు.

తర్వాత ‘‘మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాం. ఏడాదిక్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాం. మీ ఇంటి మండువా మా గది కిటికీ నుంచి బాగా కనబడేది. మీ కుటుంబం మమతానురాగాలకూ తీపి అనుభవాలకూ ప్రతీకలా అనిపించేది నాకు. 

ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటిముందు ముగ్గులేస్తూంటే మీ తండ్రీకొడుకులు కబుర్లు చెబుతూ కంపెనీ ఇవ్వడం, భోగి పండుగరోజు ప్రాతఃకాలాన మీరు భోగిమంట వేస్తూంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలసి తాగడం, దీపావళిరోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం, ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటూంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవడం, మీ ఇంటికి తరచుగా బంధువులు, మిత్రులు రావడం, రాత్రిపూట అందరూ మండువాలో కూర్చుని పాటలు పాడటం మాకు కనిపించేది.

ఓసారి విజయ్‌కి ఆటల్లో చేయి విరిగితే ప్రమోషన్‌ పరీక్ష రాయడానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకెళ్ళి కట్టు కట్టించడం, నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెబుతూ జాగారం చెయ్యడం, తన తల్లి వేసుకోవాల్సిన మాత్రల్ని ఏ పూటకాపూట గుర్తుగా ఆమెకివ్వడం, ఆవిడ మంచానపడితే సేవలు చేయడం నా మనసును కదిలించేది. 

ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్లో పది ఇళ్ళు కట్టించి ఉండేవారు. 

కానీ ఆయన తీరే వేరు.

 ‘పైసంపాదన ఆశించని వ్యక్తి’ అని ఊళ్లో మంచిపేరు తెచ్చుకున్నారు.

 కళ్ళముందు నోట్లకట్టలు కనబడుతున్నా అవసరాలు ఇబ్బందిపెడుతున్నా చలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం.

ఇక మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే.

 మా నాన్న గెజిటెడ్‌ ఆఫీసరు.

 లంచాలు బాగా తినేవాడు.

 ప్రతిరోజూ తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు. 

మాకు చదువు తలకెక్కేది కాదు.

 ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు. 

ఇప్పుడు నా తమ్ముళ్ళతో నాకు మనస్పర్థలు పెరుగుతున్నాయి. 

 నాన్న ఉద్యోగం నాకొచ్చింది కాబట్టి పెద్ద వాడిగా అన్ని బాధ్యతలు  తీసుకోమంటారు బంధువులు.

 అలా తీసుకోవడం నాకు సంతోషమే కానీ 

ఈ విషయంలో నాకూ నా భార్యకూ మధ్య గొడవలు అవుతా ఉన్నాయి.

మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసింది. 

అందుకే మీ ఇల్లు కొని మా తమ్ముల్లను, మా అమ్మ ను ఇందులో చేర్చితే ఆ అదృష్టం మాకూ తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ.

 చదువుకునే రోజుల్నించీ ఈ ఇల్లు నా ‘డ్రీమ్‌ హౌస్‌’.

 ‘ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే’ అని బాధపడేవాణ్ణి. 

కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను.

 ఆస్తులకంటేరక్తసంబందాలు, ఆప్యాయతలు, మమకారాలే ముఖ్యమని నమ్మేవ్యక్తి ని నేను.  

 మా నాన్నగారి రుణం కొంత లో కొంత అయినా నెరవేర్చానన్న తృప్తి నాకు మిగులుతుంది " అన్నాడు రామారావు. 


రామారావు వెళ్ళిపోయాక విజయ్, వినోద్‌లు మౌనంగా కూర్చుండిపోయారు. 

రామారావు చెప్పిన విషయాలే పదేపదే గుర్తుకు రాసాగాయి.

 తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవలసిన జ్ఞాపకాల్ని పరాయివ్యక్తి వచ్చి చెపితే తప్ప గుర్తుచేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు. 

వాళ్ళ మనసులో తప్పుచేసిన భావన కలిగింది. 

పశ్చాత్తాపం మొదలైంది.

రాత్రి భోజనాల సమయంలో సావిత్రి - కొడుకు, కోడళ్ళతో వాళ్ళు ఊరు వదిలివెశ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది. 

రామయ్య, బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసరు, ఆశ్రమం మేనేజరు అన్న మాటల్ని చెప్పింది. 


అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది.

వినోద్‌కు తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్‌ ‘గుడ్‌నెస్‌ ఈజ్‌ ద ఓన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్‌ విచ్‌ నెవర్‌ ఫెయిల్స్‌ టు ఎర్న్‌ డివిడెండ్స్‌’ గుర్తొచ్చింది.

‘నిజం నాన్నా, మీ మంచితనం డివిడెండ్లను సంపాదించడమే కాదు, ఎంతోమంది హృదయాల్ని కూడా గెలుచుకుంది. మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప’ అనుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

విజయ్‌ తల్లితో ‘‘అమ్మా, మమ్మల్ని క్షమించు. నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండీ గుర్తించలేకపోయాం. గొప్పలకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లోపడి, బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాల్ని గుర్తుచేస్తే తప్ప గుర్తుకురాని పరిస్థితిలో ఉండిపోయాం. మనం ఇల్లు అమ్మవద్దు. కింది పోర్షను రామారావుగారికి అద్దెకిద్దాం. పై పోర్షను మాత్రం ఖాళీగా ఉంచుదాం. నువ్వు మాతో వచ్చేసెయ్‌. ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడకు వచ్చి ఓ వారంరోజులు హాయిగా గడుపుదాం. పాత రోజుల్ని గుర్తుచేసుకుని ఆనందిద్దాం’’ అన్నాడు.

‘‘అవునమ్మా, నిన్ను ఇన్నాళ్ళూ నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం. నువ్వు మాతో వచ్చెయ్‌. ఈ ఇంటి గురించీ నాన్నగారి మంచితనం, వ్యక్తిత్వం గురించీ మా పిల్లలకు కూడా చెబుదాం. ఈ ఇంటితోపాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్ళకు వారసత్వంగా లభించనీ’’ అన్నాడు.

సావిత్రి భర్త ఫొటోవైపు చూసింది.

 ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు.

 ‘అవును మరి, మానవత్వపు విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు ఆయన. వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సం తోషిస్తుంది’ అనుకుంది తృప్తిగా.


 మిత్రులారా సమాజంలో ఇలాంటి యధార్థ సంఘటనలు కోకొల్లలు. ఈ రోజు మీరు మంచి హోదా లో ఉండవచ్చు గాక . మీరు ఈ భూమి మీద కు రావటానికి జన్మను ఇచ్చింది ఎవరు? మీరు అనుభవిస్తున్న   ప్రస్తుత   హోదా మీకు రావటానికి కారణం ఎవరు? కేవలం ఆస్తులు మాత్రమే పంచుకుంటాం. వారి బాగోగులు మాకెందుకు అంటూ  జన్మనిచ్చి, కష్టపడి  పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన కనపడే ఆ దేవుళ్ళ ను మరిస్తే ఎలా?   

 ఈరోజు మీ తల్లిదండ్రుల ను ఎలా చూస్తున్నారో రేపు భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కధ చదివిన తర్వాత అయినా సరే కొంతమంది కొడుకుల మనఃస్తత్వం అయినా మారుతుంది అని ఆశిస్తున్నాను . 

 తమ స్వంతం   గురించి పట్టించుకోకుండా పిల్లల భవిష్యత్తే తమ భవిష్యత్తు గా భావించి వారిని మంచి ప్రయోజకులు గా చేసిన ప్రతి ఒక్క  తల్లితండ్రి కి ఈ కధ అంకితం  


సేకరణ. మానస సరోవరం 🙏

నేటి జీవిత సత్యం. మనుషులతో కాదు, మనస్తత్వాలతో బతకాలి. కలిసి మెలిసి బతకాలి. మనిషి, మనసు ఒకటి కాదా?

 నేటి జీవిత సత్యం. 


మనుషులతో కాదు, మనస్తత్వాలతో బతకాలి. కలిసి మెలిసి బతకాలి. మనిషి, మనసు ఒకటి కాదా? మనిషిలోనే మనసుంటుంది కదా. మనసుతోనే మనిషి జీవనం కదా. అవును. మనసుతోనే!

నన్ను అర్థం చేసుకో, నన్ను అర్థం చేసుకో అని చాలాసార్లు మనవాళ్లు మనతో అంటుంటారు. అర్థం చేసుకోవడం అవసరం. అర్థం చేసుకోకపోవడం వల్ల ఎన్నో చిక్కుముళ్లు ఏర్పడతాయి. అవి అపార్థాలుగా మారతాయి. వాటిని నెమ్మదిగా, నేర్పుగా విప్పుకోవాలి. అందరూ ఒకేలాగా ఉండరు... ఎవరికి వారు ప్రత్యేకం. రంగులో, రూపులో తేడా ఉన్నట్లే- భిన్నమైన మనస్తత్వాలూ కలిగి ఉంటారు. నొక్కితే పేలిపోయే తుపాకీ గుండులా ఉంటారు ఒకరు. నిదానంగా ఉంటారు మరొకరు. ఒకరు ప్రతి విషయంలో ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. ఒకరు అంటీ ముట్టనట్లు ఉంటారు... ఒకరు శాంతంగా ఉంటారు. ఒకరు మనకెందుకులే అన్నట్లు ఉంటారు. మరొకరు దేనికీ తొణక్క బెణక్క నిండుకుండలా ఉంటారు.

ఈ స్వభావాలు బయట మనుషులకే కాదు, మన కుటుంబంలోని వారికీ ఉంటాయి. అందుకే జాగ్రత్త వహించాలి.

శరీరానికి గాయమైతే మందో, మాకో ఇచ్చి బాగుచేసుకోవచ్చు. మనసు గాయపడితే బాగు చేయడం కష్టం. ఇంట్లో  గబుక్కున ఏదైనా అన్నా, ఇంకొకరు దాన్ని సర్దిచెబుతారు. ఈ విషయంలో పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అని లేదు. ఎవరు ఎప్పుడైనా, ఎవరినైనా, ఏదైనా అనేసే సందర్భాలు చూస్తుంటాం. అటువంటప్పుడు కొంత మంది నొచ్చుకుంటారు. అందుకే మనసెరిగి మసలుకోవాలి. నాన్నగారికి కోపమెక్కువ. అమ్మ శాంతంగా ఉంటుంది. అన్న ప్రతిదానికీ చిరాకు పడతాడు. అక్క ఉత్తిపుణ్యానికే ఆందోళన పడుతుంది. చెల్లి క్షణక్షణం భయంగా ఉంటుంది. ఇలా రకరకాలు... ప్రతి ఒక్కరి మనసు ఒక్కో పుస్తకం లాంటిది. చదవడానికి ప్రయత్నించాలి. ఓపిగ్గా వారిని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనల్ని వారూ అర్థం చేసుకుంటారు.

అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు మనం బాగా అర్థమవుతాం అంటాడు ఓ ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడు. కానీ, అపార్థం చేసుకోవడంలోనే జీవితాలు గడిచిపోతున్నాయి. అర్థాలు వెతుక్కోవడంలోనే కాలం కరిగిపోతుంది.

రామాయణ, మహాభారత కథల్లో ఎన్నో పాత్రలు ఆవేశ కావేషాలకు లోనై, అపార్థాలకు గురై విషాదంలో మునిగిపోయినట్లు చూశాం. చివరకు కథ సుఖాంతమై, సత్యమే గెలిచినట్లు రుజువైంది. మబ్బులు తొలగితేనే సూర్యుడు కనిపిస్తాడు. వెలుగు వస్తుంది. మనసులు నిర్మలమవుతాయి. మనుషులు కలిసిపోతారు. అపార్థాలకు కారణం మన మనసులోని అహం. దాన్నే నేను అంటారు. దీనికి సరైన విరుగుడు ‘ప్రేమ’.

దైవం మనల్ని ఏ కారణం లేకుండా ప్రేమిస్తున్నట్లే, మనం కూడా ప్రేమను అలవాటు చేసుకోవాలి. ప్రేమ వల్లనే కొత్త మనుషులు పుట్టుకొస్తారు. ‘నా జీవితం నా ఇష్టం. నాకు అదుపు లేదు. అడ్డు లేదు. ఆజ్ఞ లేదు. హద్దులు లేవు. నేను అనుకున్నదే జరగాలి. నా మాటే అందరూ వినాలి-’ అని అనుకుని విచ్చలవిడిగా ప్రవర్తించే వారికి ఈ భూమ్మీద చోటు లేదు. మనుషులు మంచివారు, పరిస్థితులే దేనికైనా కారణం. పరిస్థితులను మారిస్తే అపార్థాలు తొలగిపోతాయి.

ధర్మరాజులా మనం ఉండలేకపోవచ్చు. కాని, దుర్యోధనుడిలా ఉండకూడదు. శ్రీరాముడిలా ఉండటం అసాధ్యం అనిపిస్తుంది. కాని రావణాసురుణ్ని ఆదర్శంగా పెట్టుకోకూడదు. ఈ ప్రపంచం ఒక అద్భుతమైన ఉద్యానవనం. అందమైన, అరుదైన పువ్వుల్లాంటి మనుషుల ఆత్మసౌందర్యాన్ని, ప్రేమ పరిమళాన్ని ఆస్వాదించాలి. ప్రేమను ఇవ్వాలి. ప్రేమను పుచ్చుకోవాలి.


సేకరణ. మానస సరోవరం 👏

🙏క్రైస్తవ మిషనరీలు ధ్యేయం.. ‘విచ్ఛిన్న భారత్!’🙏

  🙏క్రైస్తవ మిషనరీలు ధ్యేయం.. ‘విచ్ఛిన్న భారత్!’🙏 


 కింగ్’ అంటే రాజు.. ‘కింగ్ ఆఫ్ కింగ్స్’ అంటే రారాజు.. అంటే జీసస్ క్రైస్టు. ‘బ్రేకింగ్’ అంటే విచ్ఛిన్నం. ‘కింగ్ ఆఫ్ కింగ్స్’ను ఆయుధంగా వాడుకొని ఇండియాను విచ్ఛిన్నం చేయాలన్న (బ్రేకింగ్ ఇండియా) కుట్ర మొదలైంది. ఢిల్లీలోని ఆర్చిబిషప్ జూన్ నెల 21న ఒక ప్రకటన విడుదల చేస్తూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఓడించాలని విజ్ఞప్తిచేశారు. ఆమధ్య గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అహమ్మదాబాద్ బిషప్ భారత జాతీయ శక్తులను ఓడించండని పిలుపునిచ్చారు. ఇలా ఎందుకు జరిగింది? భారత్‌లో రామరాజ్యం కాకుండా రోము రాజ్యం తీసుకొని రావాలని వాటికన్ పోప్ ఆదేశించారా? 

🌷🌷🌷🌷🌷

 ఇటీవల నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలలో ‘శిలువకు, త్రిశూలానికి మధ్య జరుగుతున్న యుద్ధం’ అని క్రైస్తవులు ప్రచారం చేశారు. భారత్‌ను దాదాపు 300 ఏళ్లు ఈస్టిండియా కంపెనీ, బ్రిటీషు వారు పరిపాలించారు. భారత రాజకీయాలను వాటికన్ చర్చి ప్రత్యక్షంగా శాసించటం మొదలుపెట్టింది. ఏసుప్రభువుకరుణామయుడు అనే విషయంలో ఎవరికీ అభిప్రాయభేదాలు లేవు. కాని ఇవ్వాళ క్రూసేడర్లు ఎవాంజలిజం పేరుతో రోము సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ క్రైస్తవ సామ్రాజ్యవాదానికి ఏసుప్రభువు కేవలం ముసుగు మాత్రమే. ముందుగా ఒక పాఠశాల పెట్టడం ఆ తర్వాత ఒక ఆస్పత్రి, పిమ్మట చర్చి నిర్మించడం మన పల్లెల్లో చాలాకాలంగా జరుగుతున్నదే. పాలపొడి వంటివి క్రైస్తవ అనాథ శరణాలయాలకు పంపటం, కుట్టుమిషన్లు ఇతర గృహోపకరణాలు ఉచితంగా ఇవ్వటం ఆపైన మతం మార్పిడులు మొదలుపెట్టడం- ఇది దాదాపు నూరు సంవత్సరాలుగా పాశ్చాత్య ప్రపంచం చేస్తున్నది. బిషప్ కాల్ట్‌వెల్ తమిళనాడులో పర్యటించి ఆర్యులు, ద్రవిడులు లేరనే ఒక భాషా సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నిజానికి భారతదేశానికి పంచద్రావిడులు పంచగౌడులు అనాదిగా ఉన్నారు. ద్రవిడులు భారతదేశంలో అంతర్భాగమే. రాజకీయ లబ్ధికోసం శ్రీలంకలోని సింహళీయులు ఆర్యులని, అక్కడి ద్రవిడులు అనార్యులనే సిద్ధాంతం ప్రతిపాదించారు. ఇది వేలుపిళ్లై ప్రభాకరన్ నాయకత్వంలో ‘స్వతంత్ర తమిళ ఈలం’ పేరుతో యుద్ధానికి దారితీసింది. 

🌷🌷🌷🌷🌷

 క్రైస్తవ వాటికన్ వర్గాలు ఇండియాను మాతం పేరుతో విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉన్నాయి. దీనిని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోలేకపోయింది. అందుకు కారణం- ముస్లిం, క్రైస్తవ మైనారిటీ వర్గాలను ఓటు బ్యాంకులుగా చేసుకుని రాజకీయాధికారాన్ని చేజిక్కించుకోవడం. మతాంతీకరణ ఏ మేరకు జరిగిందంటే- ఒంగోలుకు చేరువలో ఉన్న కరవది అనే చిన్న గ్రామంలో పదివేల జనాభా కూడా లేదు. కాని అక్కడ పది చర్చీలు ఎలా వచ్చాయి? వీరికి ఇన్ని నిధులు ఏయే దేశాల నుండి వస్తున్నాయి? హైదరాబాద్ వంటి నగరాల్లో క్రైస్తవ మిషనరీలు విద్యాసంస్థల పేరిట ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకున్నాయి. ‘మతం ఓ మత్తుమందు’ అనే కమ్యూనిస్టులు ఈ క్రైస్తవీకరణాన్ని ఏనాడూ అడ్డుకోలేదు. కేరళ వంటి రాష్ట్రాల్లో క్రైస్తవ రాజకీయ పక్షాల మద్దతుతో కొన్ని రాజకీయ పార్టీలు వాటి అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నాయి. 

🌷🌷🌷🌷🌷

 అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఢిల్లీ వచ్చినప్పుడు మర్యాద పూర్వకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. అప్పుడామె ఇండియాలో క్రైస్తవులను హిందువులు వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారట! రచయిత్రి అరుంధతీ రాయ్ వంటి వారు అమెరికాకు వెళ్లిన సందర్భంలో- భారత్‌లోని క్రైస్తవులు బాధలకు గురవుతున్నారని అన్నారు. నిజానికి ఫిరోజ్ గాంధీ పార్సీ మతస్థుడు. ఆయన భార్య ఇందిరా గాంధీ, కుమారుడు రాజీవ్ గాంధీ పార్సీ మతస్థులే. అయితే- సోనియా, రాహుల్ వాటికన్ ప్రేరణతో క్రైస్తవ మత దీక్షను స్వీకరించినట్లు ఆధారాలున్నాయి. అంటే ఇప్పటికీ ఇండియా వాటికన్‌కు వలస రాజ్యంగా ఉండాలనే ప్రయత్నం రాజకీయంగా కొనసాగిందని అర్థం. 

🌷🌷🌷🌷🌷🌷

 మన దేశంలో ముందుగా దళిత వర్గాల్లో క్రైస్తవీకరణం భారీ స్థాయిలో జరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్ని అగ్రవర్ణాల్లోకి కూడా క్రైస్తవ మత బోధకులు చొచ్చుకొనిపోయారు. భారత్‌లో హిందూ మతం అంతరించిందని కంచె ఐలయ్య పుస్తకం రాశారంటే పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో అవగతమవుతుంది. రాజకీయ లబ్ధి కోసం కర్నాటకలో ‘లింగాయత్’లకు మైనార్టీ హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించింది. హిందువులను విభజించేందుకు ఇలాంటి ప్రయత్నాలెన్నో జరుగుతున్నాయి. హిందువులే అయినప్పటికీ వివిధ కులాల వారు రాజకీయ ఆధిపత్యం కోసం, రాయితీల కోసం కలహించుకుంటున్నారు. మన దేశంలో హిందువులు బలహీనమైనప్పుడల్లా విదేశీయులు ఆక్రమించుకున్నారు. పరమ పవిత్రమైన అనంతపద్మనాభ స్వామి ఆలయ నిధులు కమ్యూనిస్టులు స్వాధీనం చేసుకుంటే, తిరుమల తిరుపతి దేవస్థానం సంపదంతా ఏపీ ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిపోయింది. తిరుమల స్వామివారి ఆభరణాలు విదేశాలకు తరలిపోయినట్లు వస్తున్న ఆరోపణలు నిజమేనా? 

🌷🌷🌷🌷🌷

 కేరళలో కమ్యూనిస్టు పాలకులు హిందువుల పండగలను అవహేళన చేస్తున్నారు. క్రైస్తవుల పండగలను ఘనంగా జరపాలని ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితులు మత ఘర్షణలకు దారితీస్తున్నాయి. కేరళలో క్రైస్తవీకరణ విస్తృతంగా జరిగిపోయిందని ప్ర ఖ్యాత రచయిత రాజీవ్ మల్హోత్రా రాసిన ‘బ్రేకింగ్ ఇండియా’ పుస్తకంలో సవివరంగా పేర్కొన్నారు. సాంస్కృతికంగా హిందుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాలూ జరిగాయి. ఉదాహరణకు తమిళనాడులో జరిగిన ఒక సదస్సులో హిందూ సాధువు తిరువళ్లువర్ జీసస్ క్రైస్ట్ బోధలను వింటున్న చిత్రం ప్రదర్శింపబడింది. శ్రీకృష్ణుడు జీసస్ భక్తుడని కూడా ప్రచారం చేశారు. కృష్ణ భక్తి క్రీస్తూ భక్తి నుండి పుట్టిందని వ్యాఖ్యానాలు చేశారు. బంగ్లాదేశ్ మయన్మార్ నుండి మన దేశంలోకి వలస వచ్చిన రోహింగ్యాలు ఇప్పుడు హిందువులను చంపుతుంటే- రెండు కోట్ల మంది రోహింగ్యాలకు భారత పౌరసత్వం ఇవ్వాలని ఏచూరి సీతారాం, మమతాబెనర్జీ వంటి సెక్యులరిస్టులు వాదిస్తున్నారు. భారత్‌లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి. అమెరికాలోని న్యూజెర్సీలో బొట్టుపెట్టుకున్న భారత స్ర్తిలపై శే్వత జాతీయులు దాడి జరిపారు. పలు దేవాలయాల్లో విధ్వంసం జరిగింది. అమెరికా ఆర్థిక వికాసానికి భారతీయులు విశేష సేవలు చేస్తున్నా- వారిని అక్కడ ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తారు. అమెరికాలో పూర్వం రెడ్ ఇండియా అనే జాతివారు ఉండేవారు. బ్రిటన్ నుండి వలసవచ్చిన వారు స్థానిక జాతులను నిర్మూలించి అమెరికాను ఆక్రమించుకొన్నారు. మెక్సికోలోను ఇదే జరిగింది. అక్కడ వేలాది సంవత్సరాలుగా భారతీయ సంస్కృతి ఉండేది. దానిని 16వ శతాబ్దంలో స్పానిష్ ఆర్మెడా ఆక్రమించుకుంది. స్థానిక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ఎనె్నన్నో చర్చిలు వెలిశాయి. 

🌷🌷🌷🌷🌷

 రాజమండ్రి పేరు చెప్పగానే వేద పండితుల ప్రాంతం అని మనకు గుర్తుకు వస్తుంది. అయితే- ఈరోజు అక్కడ వేదం నేర్పే పాఠశాలలు అరుదు. ఒకప్పుడు 0.5 శాతం ఉన్న క్రైస్తవ జనాభా 12 శాతం దాటింది అనధికారికంగా 30%. గుంటూరు జిల్లాలోని ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పెదమక్కెన, అత్తలూరు ప్రాంతాలల్లో క్రైస్తవీకరణం పూర్తిగా జరిగిపోయింది. ఇక్కడ వారు గురుమండలం- ఆలయం- బాల ఏసు ఉత్సవాలు వంటి పదజాలం వాడుతున్నారు. హిందువుల ఆలయాల్లో పూజలు ధూపదీప నైవేద్యాలు వంటివి అన్య మతస్థులు చేస్తున్నారు. వారిని అయ్యవార్లు అని కూడా పిలుస్తున్నారు. ఈ పరిణామం ఎలా జరిగింది? 

🌷🌷🌷🌷🌷🌷

 కళ్లముందు గ్రామాలకు గ్రామాలు హిందూ ధర్మీయుల నుండి దూరమవుతుంటే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల నేతలు ఓట్లవేటలో నిమగ్నమయ్యారు. ‘హిందూ మతోన్మాదం నశించాలి’ అంటూ వామపక్ష నేతలు నినాదలిస్తున్నారు. 1947లో మత ప్రాతిపదిక మీద భారత్ ముక్కలైన సందర్భంలో- ‘మీకు ప్రత్యేక దేశం లేదా ప్రత్యేక రిజర్వేషన్లు కావాలా?’ అని పార్సీలను కోరినప్పుడు ‘ప్రపంచంలో భారత్‌లో మాత్రమే మాకు హిందూ సమాజం పరిపూర్ణ రక్షణ కల్పించింది. మాకు వేరే అస్తిత్వం అక్కరలేదు’ అని చెప్పారు. అయినప్పటికీ హిందూ సమాజం క్రైస్తవం, కమ్యూనిజం, ఇస్లాంల నుండి నిరంతరం దాడులను ఎదుర్కొంటున్నది. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తాము ముస్లిం సమాజం కోసమే పరిపాలిస్తున్నట్టు భావిస్తున్నారు. కేరళ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో హిందూ సంస్థల నేతలను, కార్యకర్తలను హత్య చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక్క హిందూ సమాజం మీద మాత్రమే ఈ దారుణం ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఇందుకు చాలా చారిత్రక కారణాలున్నాయి. ‘సమాజంలో అకృత్యాలకు పెరిగినప్పుడు తాను అవతరిస్తాన’ని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను హిందువులు బలంగా నమ్మారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని హిందువులు ఎవరికివారు స్వంత పనులలో నిమగ్నమయ్యారు! భారత జాతి పతనానికి ఈ ‘అవతార విశ్వాసం’ ప్రధాన కారణం. మారుమూల గ్రామాల్లో సైతం క్రైస్తవీకరణం యథేచ్ఛగా జరిగిపోతున్నది. ‘హిందూయిజం చాలా గొప్ప మతం. దానిని అదే కాపాడుకోవాలి.. అన్యమతాల నుండి హిందువులను రక్షించేందుకు మనమెంత? మనశక్తి ఎంత? ఒక్క సారి ఆలోచించండి మిత్రులు భగవంతుడే హిందూత్వాన్ని కాపాడాల మనము ఏమి చేయలేమా 


 సనాతన ధర్మ రక్షణకు నడుం బిగించాలి ఎన్నికలే ఓటే మనకు ప్రదాన ఆయుదమా-??? 


 🕉జై శ్రీరామ్ జై జై శ్రీరామ్🕉 

వరుడి డిమాండ్‌పై వధువు కుటుంబం ఆశ్చర్యపోయింది.

 మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఒక వివాహ బంధాన్ని ఖాయపరుచుకునే సమయంలో వరుడి డిమాండ్‌పై వధువు కుటుంబం ఆశ్చర్యపోయింది.


పెళ్లికి ముందు అబ్బాయి చేసే ఈ ప్రత్యేకమైన డిమాండ్‌ల సంగతి తెలుసుకొని ముఖ్యంగా అమ్మాయిలు ఆశ్చర్యపోతున్నారు.

పెళ్లి కుమారుని డిమాండ్ల విషయమై నగరం మొత్తం చర్చనీయాంశంగా మారింది.

ఈ డిమాండ్లు వరకట్నానికి సంబంధించినవి కావు, కానీ వివాహాన్ని జరిపే విధానం మరియు అసందర్భ సంప్రదాయాల గురించి కావడం విశేషం..!!

డిమాండ్లు ఇలా ఉన్నాయి

1)ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండదు.

2)పెళ్లిలో వధువు లెహంగాకు బదులుగా చీరను ధరిస్తుంది.

3)అసభ్యకరమైన చెవి-బస్టింగ్ సంగీతానికి బదులుగా వివాహ వేదిక వద్ద తేలికపాటి వాయిద్య సంగీతం ప్లే చేయబడుతుంది.

4)దండ వేసే సమయంలో వధూవరులు మాత్రమే వేదికపై ఉంటారు.

5)వరమాల సమయంలో వధువు లేదా వరుడిని వేధించే వారు వివాహం నుండి బహిష్కరించబడతారు.

6)పురోహితుడు వివాహ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అతనిని ఎవరూ ఆపలేరు.

7)కెమెరామేన్ దూరం నుండి ఛాయాచిత్రాలు తీస్తాడు. అవసరం మేరకు, ఎవరికీ అంతరాయం కలిగించకుండా దగ్గర నుండి కొన్ని చిత్రాలు తీస్తాడు. పురోహితుడి ప్రక్రియకు పదే పదే అంతరాయం కలిగించడం మాత్రం చేయకూడదు.

ఇది తమ సాక్ష్యంలో దేవుళ్ళను పిలిపించి జరిపే కళ్యాణం, సినిమా షూటింగ్ కాదు.

8)వధూవరుల ద్వారా కెమెరామేన్ ఆదేశానుసారం, నేరుగా రివర్స్‌లో పోజులు పెట్టి చిత్రాలు తీయబడవు.

9)పగటిపూట కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రంలోగా వీడ్కోలు పూర్తి చేయాలి. తద్వారా మధ్యాహ్నం 12 నుంచి 1 గంటకు ఆహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి, అసిడిటీ తదితర సమస్యలతో అతిథి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

ఇది కాకుండా, అతిథులు తమ ఇంటికి చేరుకోవడానికి అర్ధరాత్రి వరకు సమయం తీసుకోకూడదు మరియు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి.

10)తాళి కట్టిన వెంటనే అందరి ముందు ఎవరైనా ముద్దు పెట్టుకోమని, కౌగిలించుకోవాలని అడిగితే, అట్టి వారిని వెంటనే పెళ్లి నుంచి బహిష్కరిస్తారు.

అబ్బాయి డిమాండ్లన్నింటిని అమ్మాయిలు ఆనందంగా అంగీకరించిన సంగతి తెలిసిందే..!!

సమాజాన్ని బాగుచేసే అందమైన సూచనలు.! అందరికి ఆదర్శం..!!

🙏వివాహం అనేది ఒక పవిత్ర కార్యక్రమం.. దానిని గౌరవిద్దాం.. మన సాంప్రదాయాన్ని కాపాడు ఎంకుందాం🙏

ప్రశ్న :--- మనం ఆనాపానసతి సాధన చేస్తున్నాం కదా ! కాయానుపస్సన, వేదనానుపస్సన, చిత్తానుపస్సన, ధమ్మానుపస్సన, విపస్సన వీటి గురించి కూడా వివరించండి. బుద్ధుడు వాటి గురించి ఏమి చెప్పారు?

Life Change Messages Every Day 6pm In Light Workers Group

🔺 పత్రీజీ సమాధానాలు🔺
🌹 చాప్టర్ --7:--- మరింత శక్తివంతమైన ధ్యానం 🌹

🍁 ప్రశ్న :--- మనం ఆనాపానసతి సాధన చేస్తున్నాం కదా ! కాయానుపస్సన, వేదనానుపస్సన, చిత్తానుపస్సన, ధమ్మానుపస్సన, విపస్సన వీటి గురించి కూడా వివరించండి. బుద్ధుడు వాటి గురించి ఏమి చెప్పారు?

🍀 పత్రీజీ :--- కాయం అంటే భౌతిక శరీరం లేదా ప్రాణమయకోశం అనుకోవచ్చు. వేదన అంటే భావోద్వేగాలు, చిత్త అంటే మనస్సు, ధమ్మ అంటే ధర్మం. ‘అను’ అంటే ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా (సాక్షిగా) 'పశ్శన' అంటే చూడటం, గ్రహించటం, శ్రద్ధ పెట్టటం.

🌸 ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని సాక్షీభూతంగా గమనించాలే కానీ అతిగా కానీ, అల్పంగా కానీ ప్రతి స్పందించకూడదు. శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత అవసరం లేదు. శరీరం గురించి ఆందోళన చెంద వద్దు. అదే కాయానుపస్సన.

🌿 ధ్యానంలో కూర్చున్న కాసేపటికి మన అంతరంలో ఏవేవో భావనలు, ఉద్వేగాలు వెల్లు వెత్తుతూ ఉంటాయి. వాటిని కేవలం సాక్షిగా గమనించాలే కానీ అందులో మునిగి పోకూడదు. అవి వాటి మానాన అవి వచ్చి పోతాయి. అదే వేదనానుపస్సన.

🌳 ధ్యానం చేయటం మొదలు పెట్టిన తర్వాత మన ఆలోచనల్లో ఎంతో మార్పు కనిపిస్తూ ఉంటుంది. వేటిని అతిగా పట్టించుకోకూడదు. మనస్సులో ఎన్నో విధాలైన మార్పులు, వాటి పర్యవసానాలు మనస్సును, అయోమయానికి గురి చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి అతిగా ప్రతి స్పందించకూడదు. సాక్షి తత్వాన్ని వీడకూడదు అదే చిత్తానుపస్సన.

🏵️ ధ్యానం మొదలు పెట్టిన వెంటనే హాలాహలం వస్తుంది. చివరాఖరికి అమృతం వస్తుంది. ఈలోగా హాలాహలం గురించి ఆలోచించి, విచారించి బాధపడకూడదు. వేటి గురించీ అతిగా పట్టించుకోకూడదు.

🌴శరీరంలో మార్పులు వస్తాయి, శరీరంలో కదలికలు వస్తాయి. శక్తి ప్రవాహ తీరు తెన్నులను గమనిస్తాం. వేటికీ అతిగా ప్రాముఖ్యతను ఇవ్వకూడదు అదే అనుపస్సన అంటే.

🔺 'వి' అంటే విశేషమైన ‘పస్సన' అంటే చూడటం. అంటే మూడవ కంటితో, దివ్య దృష్టితో దర్శించటం అని అర్థం. మూడవ నేత్రం తెరుచుకున్నప్పుడు, దివ్య చక్షువు ఉత్తేజితం అయినప్పుడు ఎంతో ఎరుకతో ఉండాలి. అదే 'విపస్సన'. మనం పదాలను సరిగ్గా అర్థం చేసుకుంటేనే వాటి యొక్క భావాన్ని, పరమార్థాన్ని గ్రహించగలం.

☘️ మొదట సూత్రాలను సిద్ధాంత పరంగా ఆకళింపు చేసుకోవాలి. అప్పుడే సాధనను సమర్థవంతంగా చేస్తూ సత్ఫలితాలను పొందగలరు. అందుకే మనమంతా ఆధ్యాత్మిక జ్ఞానంలో పదాలను సాంకేతికంగా, సంపూర్ణంగా అవగాహన చేసుకుని తీరాలి.

🌻శరీరం, మనస్సులను అధిగమించిన తర్వాత మూడవ కన్నుకు చేరుకుంటాం. ఒకవేళ మీరు శరీరం గురించి ఆలోచించకుండా ఉంటే మనస్సులోకి చేరుకుంటారు. ఒకవేళ మనస్సు ఆలోచనలు చేస్తూ ఉంటే మీరు మూడవ కంటి వరకూ చేరుకోలేరు.

🌼 శరీరం మొదటి ' I, మనస్సు రెండవ ' I, దివ్య చక్షువు మూడవ I ", శరీరానికి చర్మ చక్షువులు ఉన్నాయి. మనస్సుకు మనో చక్షువు ఉంది. ఈ మూడవ కన్ను దివ్య చక్షువు. అందుకే అది 'మూడవ కన్ను' అయ్యింది. శరీరం మొదటి కళ్ళను భౌతిక దృష్టిని కలిగి ఉంది. మనస్సు రెండవ కళ్ళను, మనో దృష్టిని కలిగి ఉంది. ఆత్మ మూడవ కంటిని దివ్య దృష్టిని కలిగింది. దీన్నే ఆజ్ఞా చక్రం, సుదర్శన చక్రం, గురు స్థానం అని అంటాం.

🌿 మనం శరీరాన్ని అధిగమించాలి అంటే దేహానికి అతిగా ప్రాధాన్యత ఇవ్వకూడదు. కనీసావసరాలే తీరుస్తూ ఉండాలి. మనస్సును అధిగమించాలి అంటే మనస్సులోని కోరికలు, ఆలోచనలు అన్నింటికీ తగినంత ప్రాధాన్యత మాత్రమే ఇవ్వాలి. అప్పుడే విపస్సన స్థితికి చేరుకుంటాం. ఇక్కడ మన సంపూర్ణ ఏకాగ్రతను కేంద్రీకరించాలి. తద్వారా పూర్వ జన్మలు, ఆధ్యాత్మిక సంభావ్యతలు, ఇతర లోకాలు, గురువులు, మార్గదర్శకులను దర్శిస్తాం.

🌸 అందరూ ఆత్మ స్వరూపులే. అందరికీ అద్భుతమైన దివ్య చక్షువు ఉంది. అయితే ఉత్తేజితం కాలేదు కనుక ఉపయోగించుకోలేరు. అందరికీ రెండు కాళ్ళు ఉన్నాయి. అంత మాత్రం చేత అందరూ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కుతున్నారా? ఎంతో మంది తమ ఇంట్లో ఉన్న మెట్లనే ఎక్కరు. అంతటి పనికిమాలిన కాళ్ళను కలిగి ఉన్నారు వాళ్ళు.

🌳 మరి అదే విధంగా అందరికీ పరమ శివుడికి లానే మూడవ కన్ను ఉంది. కానీ వాళ్ళంతా పరమ శివుళ్ళు కాలేరు. ఎంత విచిత్రం ! ఎంత హాస్యాస్పదం !!

🔺 రెండు కాళ్ళూ ఉన్నాయి. ఎవరెస్ట్ ఎక్కరు. సంకల్పం ఉంటే ఏ కాలైనా ఎవరెస్ట్ ఎక్కగలదు. మరి అదే విధంగా అందరికీ మూడవ కన్ను ఉంది. ఒక వేళ దాన్ని ఉత్తేజితం చేసుకోవాలి అనుకుంటే చేసుకోగలరు. వద్దు అనుకుంటే మూర్ఖులుగా ఉండిపోతారు. శరీరం పై శ్రద్ధా సక్తులు... మనస్సు పై శ్రద్ధా సక్తులు... పర్యవసానమే మూడవ కన్ను లేకపోవటం, దివ్య దృష్టి లోపించటం !

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌷 పత్రీజీ సమాధానాలు పుస్తకం మరియు ఇతర పత్రీజీ పుస్తకాల సెట్ కావాల్సిన వాళ్ళు 9032596493 కి what's app msg చేయగలరు.


🪔🪔అంతర్యామి 🪔🪔 🌺🌺దైవలీల 🌺🌺

 🪔🪔అంతర్యామి 🪔🪔
🌺🌺దైవలీల 🌺🌺
🍁కనిపించే ప్రపంచమంతా భగవన్మయం. 
🍁ఈ ప్రపంచాన్ని సృజించి అందులో తానుగా, తనలో సృష్టిగా దృశ్య ప్రపంచాన్ని ఇముడ్చుకొని భగవంతుడు సృష్టికి ఆధారభూతంగా అలరారుతున్నాడు.
🍁ఏ అవకరమైనా దైవ నిర్దేశితమే. ఆయన సృజనను త్రికరణాలతో ఆమోదించడమే విజ్ఞత. ఆయన ఆజ్ఞకు భిన్నంగా సృష్టిలో ఏదీ రూపుదిద్దుకోలేదని గ్రహించాలి. ఏదో ఒక ప్రయోజనం కోసమే జీవుడికి సంపద గానీ, దురదృష్టం కానీ అందివచ్చిందని, సంపద సృష్టిలో జీవుడి ప్రయోజకత్వం గానీ దరిద్రంలో అతడి అసమర్థత గానీ లేవని సాధకుడు గ్రహించాలి.
🍁ఏ ఒక్కరిపైనా దైవానికి ప్రేమ గానీ, ద్వేషం కానీ ఉండవు. 
🍁ధర్మ పక్షపాతిగా ఆయన శ్రీకృష్ణావతారంలో పాండవుల పక్షాన నిలిచి వారి శ్రేయస్సును కాంక్షించాడు.
🌺దైవం కరుణామయుడు. 
🍁తన సృష్టిని ఆయన ఎన్నడూ ఛిన్నాభిన్నం చేయడు. ఆయన కరుణా స్వభావంతోనే సమస్త ప్రాణులకు భూమ్యాకాశ సముద్రాల్లో ఆహారం లభిస్తోంది. ఆయన స్తోత్రప్రియుడు. మనకు అన్నీ ఇచ్చిన పరమాత్మను స్తుతించడంలో విజ్ఞత ఉంది. తనను ఎవరైనా ప్రశంసిస్తే మనిషికి సంతోషం కలుగుతుంది. మనిషికి ఈ స్తోత్రప్రియత్వం భగవంతుడి లక్షణం నుంచే సంక్రమించిందని గుర్తించాలి.
🌺మంచి చెడులు భగవంతుడి సృష్టి. 
🍁విరుద్ధ లక్షణాలు గల మంచీచెడుల మధ్య సంఘర్షణ సహజం! జగత్తును సృజన చేసి ప్రాణుల జీవన నాటక అభినయాన్ని చూసి వినోదించడం ఆయన లీలలో భాగమేగానీ ఆయనకు ఏ ఒక్కరి పైనా ప్రత్యేక శ్రద్ధ ఉండదు. పరమాత్మ ప్రణాళికలో భాగంగానే సృష్టి-స్థితి-లయం జరుగుతాయి.
🍁 సృష్టి ఎంత సహజమో లయం కూడా అంతే సహజం. అవి నివారింప వీలుకాని విషయాలని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్పష్టం చేశాడు.
🍁 దుష్టులైన రాక్షసులను అవ్యాజ కరుణతో సంహారానంతరం తనలో ఐక్యం చేసుకున్న ఉదంతాలు పురాణేతిహాసాల్లో అనేకం కనిపిస్తాయి.
🌺ఎల్లప్పుడూ ఆనందంగా సాత్వికాంశతో జీవించడం పరమాత్మను ఆరాధించడమే. 
🌺ఆనందమే దైవం. ఆనందమయ సాత్విక జీవనమే దైవారాధన!
🍁దయ, దానగుణం, ఉపకార బుద్ధి వంటి విశేష గుణాల సాధన భగవదారాధనలో అంతర్భాగంగా సాధకుడు గ్రహించాలి.
🍁కొన్ని సంకల్పాలు బలమైన కోరికలుగా మారి అవి తీరక ఉవ్విళ్లూరిస్తూ జీవుణ్ని వేధిస్తాయి. పరితాపం పెంచుతాయి. అనుకోని కొన్ని లాభాలు వరాలై మన ముంగిట వాలతాయి.
🍁బలహీనులపై బలవంతుల దాష్టీకం సృష్టి సహజమే అయినా అహేతుకంగా నిర్దయగా వ్యవహరించే వారి తీరు దైవాన్ని తిరస్కరించడమే అవుతుంది. దుష్టులు కొందరు ఏ రూపంలో అభివృద్ధి చెందినట్లు కనిపించినా ఏదో నాటికి వారి పతనం తథ్యమని చరిత్ర పలుమార్లు ఎలుగెత్తింది.
🍁దానం, కరుణ వంటి సద్గుణాలు అందించే మధురభావ సంతృప్తి అనితర సాధ్యం. స్వార్థం, నిర్దయ వంటి అవలక్షణాలతో మనిషి ఎన్నడూ ఆనందంగా జీవించలేడు.
🍁భౌతిక వస్తుసేకరణ తప్పు కాదు. కానీ వాటి వల్ల ఆనందం లభ్యమవుతుందన్నది ఓ భ్రమ మాత్రమే అంటారు జ్ఞానులు.
🍁 ఆ సత్యాన్ని సాధకుడూ అనుభవంతో తెలుసుకుంటాడు. తోటివారి ధర్మయుత ఐశ్వర్యం అనసూయాపరులకు మోదాన్ని కలిగిస్తుంది. జనామోదమే దైవామోదమని సాధకుడు అనుభవంలో తెలుసుకుంటాడు.
🍁భగవద్భక్తితో సాధించలేని ఏ లౌకిక విజయమూ ఉండదని పురాణేతిహాసాలు నివేదిస్తాయి. 
🌺భక్తులకు ఆ మహాకార్యాలు పరమాత్మ సందేశాలని మానవుడు గ్రహించాలి.🙏 

చితి, చింత

🙏🏽🙌🏿 లక్ష్మిశ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం రేణిగుంటరోడ్డు.తిరుపతి
వ్యవస్థాపకులు .ధర్మఛారౄ
'తిరుపతి' శ్రీనివాసరావు
కర్మయోగి..ప్రధాన నిర్వహకులు
9390216263..9550804092 🙏🏽🙌🏿🌹🙊🙉🙈 🌹🙌🏿 చితి చెంత
👉🏼 వెనక్కి వెళ్లిన మన గతాన్ని మార్చుకోలేకపోవొచ్చు కానీ, ముందుకు వెళ్లిన మన భవిష్యత్తుని మార్చుకోవచ్చు.
మనిషి జీవితంలో ఒడి దొడుకుల వల్ల ఎప్పడూ ఏదో ఒక చింత మనుసును కలిచి వేస్తూ ఉంటుంది. చింత లేనివారు చాలా అరుదుగా ఉంటారు.
చితి, చింత ఈ రెండు మనిషిని కాల్చివేస్తాయి. చితి కేవలం నిర్జీవమైన శరీరాన్ని దహిస్తుంది కానీ, చింత సజీవమైన దేహాన్ని దహించివేస్తుంది.అందుకే చింత రహితంగా జీవించడానికి ప్రయత్నించాలి.
ఓ తల్లి చూసిన పురిటినొప్పులకంటే పెద్ద యుద్ధమేదీ లేదు ఈ లోకంలో !
భరించడమొక్కటీ అమ్మ దగ్గర నేర్చుకుంటే...
నువ్వు బ్రతకడమెలాగో అర్ధమైపోతుంది !
"చిరునవ్వు ", "నిశ్శబ్దం" ఇవి రెండు శక్తివంతమైనవి. మొదటిది చాల సమస్యలను పరిష్కరిస్తుంది, రెండవది చాల సమస్యలను నివారిస్తుంది.
జీవితంలో ప్రవర్తన ఎల్లప్పుడూ తెలివి కంటే గొప్పది. ఎందుకంటె, కొన్ని పరిస్థితులలో మన తెలివితేటలు పనిచేయకపోవొచ్చు కానీ, మన ప్రవర్తన పరిస్థితులను చక్కదిద్దుతుంది.☝
👉🏼 సమాజంలో మొరిగే కుక్కలు చాలానే ఉన్నాయ్.
నీవు ఎలా బ్రతికిన అవి మొరుగుతూనే ఉంటాయ్.
ఆర్థికంగా మంచిగా బ్రతికితే అందలం ఎక్కిస్తారు. పడిపోయావంటే గుసగుసలు పెడుతారు.
ఐతే మన వ్యక్తిత్వం
కుక్కకి .. యజమానిలా ఉండాలి తప్పితే పని వాడిలా కాదు. ..
మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయ్. వాటన్నిటిని నీవు పట్టించుకోకుండా ముందుకెళ్లడమే నీ కర్తవ్యం.
పట్టించుకున్నావా పతనం మౌతావు.తేలిగ్గా తీసుకున్నావా విజయుడవవౌతావు.
పరిస్థితులు గమనించండి..
అవి ఎలాంటివి అయినా అంగీకరించి,
చిరునవ్వు చిందిస్తూ అక్కడి నుండి ముందుకు సాగండి..
మీ చిరునవ్వు నిజమైనది అయినా కృత్రిమమైనది అయినా ఎవరూ పట్టించుకోరు..?
అక్కడ ఉన్నది మోసకారి నక్కలే కదా...!
ఎవరు ఎంత అందమైన వేషం వేసినా,
కాలం వారి నిజ స్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేట్టు చేస్తుంది..☝

"అసలునేను, దొంగనేను" ఏమిటి ? రెండు నేనులు లెవ్వంటారు కదా !?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*


                 💖💖💖

       💖💖 *"298"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

    

*"అసలునేను, దొంగనేను" ఏమిటి ? రెండు నేనులు లెవ్వంటారు కదా !?"*

*****


*"నిజానికి ఉన్నది ఒక్కనేనే. అయితే సాధకునికి అనుభవం రాని వరకు ఈ భావనలు వదలవు. మనలో శాంతిగా ఉన్న ఆత్మభావనే అసలైన 'నేను'. ఇంద్రియానుభవంతో మనకి కలిగే శరీరభావనే 'దొంగనేను'. మనకి ఆ లోపలవున్న అసలునేను తెలియకపోయినా బయట కనిపించే దొంగనేను తెలుస్తూనే ఉంది. మనకి తెలిసిన బయటినేనుతో చేసే ఆధ్యాత్మిక సాధనతోనే, తెలియని లోపలినేను అనుభవంలోకి వస్తుంది. నిద్రలో సద్దుమణిగిన ఇంద్రియాలు, నిత్యజీవితంలో తిరిగి విజృంభించటం వల్లనే ఆ శాంతి దూరం అవుతుంది. స్విచ్ ఆపిన టీవీ అప్పటికి తన కార్యకలాపాలను ఆపినా మళ్ళీ స్విచ్ వేస్తే తిరిగి తన పనులన్నింటినీ యధాతథంగా కొనసాగిస్తుంది. మన నిద్రకూడా అలాంటిదే. నిద్రలో ఇంద్రియాలు లేవు కనుక నేను అనే భావనలేదు. కానీ అక్కడే మనం శాంతిగా ఆత్మస్వరూపంలో ఉన్నాం !"*


*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*

          🌼💖🌼💖🌼

                🌼🕉🌼 

జీవి శరీరము నశిస్తుంది గాని ఆత్మ ఎల్లప్పుడూ చిదాభాసమై వుంటుంది.

 దేని దగ్గరకు జీవుని మనస్సు పదేపదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరించబడుతుందో అదే "ఆత్మ". సంకల్ప, వికల్పాలను చేసేది జీవుని మనస్సే. అలాగే ఉపాసించేది కూడా మనస్సే. కాబట్టీ ముందుగా మనస్సును శుద్ధి చేసుకొని పరబ్రహ్మమును ఉపాసించాలి. ఏ జీవుడు బ్రహ్మమును ఇలా సాధనచేస్తాడో అతనిని సర్వభూతములు కీర్తిస్తాయి.


జీవుని ముందు రెండు మార్గాలుంటాయి. ఒకటి శ్రేయస్సు, రెండవది ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మోక్షము లేక శాశ్యతానందము. ప్రేయస్సు అంటే బంధము లేక అనిత్యమైన ఇంద్రియానందము. వీటినే విద్య, అవిద్య మార్గాలనికూడా అంటారు. జ్ఞానులు శ్రేయస్సును అవలంబించి శాశ్వతసుఖాన్ని పొందుతారు. అజ్ఞానులు ప్రేయస్సును కోరుకొని క్షణికమైన సుఖాలను అనుభవిస్తూ మొహలాలసులై జననమరణ చట్రంలో ఇరుక్కుంటారు.


ఆత్మవస్తువు గురించి వినడమే ఆశ్చర్యము. విన్నవారు దానిని తెలుసుకొనుట కష్టం. దానిగురించి చెప్పే గురువు దొరకటం ఇంకా కష్టం. ఒకవేళ దొరికిన అతడు చెప్పింది అర్ధం చేసుకోవడం బహుకష్టం. ఆత్మజ్ఞానం తర్కంద్వారా అర్ధంకాదు. అనుభూతి పొందిన గురుని ఉపదేశం వల్లనే అది సిద్ధిస్తుంది. 


కర్మలను నిష్కామంతో ఆచరించి, తద్వారా చిత్తశుద్ధిపొంది, జ్ఞానంతో సత్యశోధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుట సులువైన మార్గము. ఆ పరమాత్మ వస్తువు కంటికి కనబడదు. ప్రతి జీవిలో నిఘాడంగా అది నెలకొనివుంది. దానిని జ్ఞాననేత్రం(ఆత్మనిష్ఠ)తో గ్రహించవచ్చు. 


ఈ ఆత్మజ్ఞానంతో సత్యమైన, సనాతనమైన, నిత్యమైన, శాశ్వతమైన, సర్వవ్యాపకమైన, పురాణమైన "ఆత్మను" గ్రహించవచ్చు. ఆత్మ, అణువుకన్నా అణువైనది మరియు మహత్తుకన్నా మహీయమైనది. అది ప్రతిజీవి శరీరంలో నెలకొనివుటుంది. అక్కడే వుంటూ అన్నిచోట్లకు వెళ్లగలదు. జీవుని సుఖదుఃఖములతో ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. జీవి శరీరము నశిస్తుంది గాని ఆత్మ ఎల్లప్పుడూ చిదాభాసమై వుంటుంది. 

దైవానుగ్రహం అనేది మనం చేసే సాధన మీద ఆధారపడి వుంటుంది.

 *🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*


*_🌴దైవానుగ్రహం అనేది మనం చేసే సాధన మీద ఆధారపడి వుంటుంది. సాధన అంటే పూజలు, యజ్ఞాలు, హోమాలు, తపస్సులు అనే కాదు.! అడవులలో, గృహలలో కూర్చోవడమూ కాదు!! సాధన ఎక్కడికో వెళ్లి చేయాల్సిన పనిలేదు!. ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా మనసు కొంచం మాధవునిపై పెట్టుకుంటే చాలు. చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు భగవంతుని స్మరణ చేసుకోవచ్చు. అయన గూర్చి పాటలను పాడుకోవచ్చు. ఖాళీ సమయాల్లో లేదా పని మీద బయటకు వెళ్లినపుడు ఎవరైనా యాచకులు లేదా దీనులు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు  కనబడితే  వాళ్లకి ఎంతో కొంత సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి. పెళ్లి రోజు, పుట్టిన రోజులంటూ పార్టీలు కోసం డబ్బు వృధా చేసే బదులు ఏ అనాధాశ్రమంలో లేదా ఇంకేదైనా సేవా కార్యక్రమాలకో వినియోగించడం చాలా ఉత్తమం. దీని వలన దేవునికి గొప్ప సేవ చేసినవాళ్లమవుతాం. దేవుడు కూడా ఎంతగానో సంతృప్తి చెందుతాడు. సాధన చిన్నదా పెద్దదా అని భగవంతుడు చూడడు. ఏ భావనతో చేశామా అన్నది చూస్తాడు. దానికి తగ్గట్టుగా అనుగ్రహించడం జరుగుతుంది.🌴_*

ఆత్మానుభవానికి, ఇంద్రియాల పనులకు సమన్వయం ఎంతవరకు ఉంది ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*
       💖💖 *"299"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"ఆత్మానుభవానికి, ఇంద్రియాల పనులకు సమన్వయం ఎంతవరకు ఉంది ?"*
******
*"ఆత్మానుభవం జరగాలన్నా, దైవదర్శనం కావాలన్నా మనం ఇంద్రియాల ద్వారా జరిగే పనులను నియంత్రించాలి. ఆధ్యాత్మికత వైపు ఇష్టం బలపడితే మన మనసు తెలియకుండానే ఇంద్రియ వ్యాపారం తగ్గించు కుంటుంది. ఆ స్థితి కలిగే వరకు మనమే ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాల పనులను నియంత్రించుకోవాలి. మన ప్రతి అనుభవానికి ఇంద్రియాలు కారణం. ఇంద్రియాలు లేని సుఖాన్ని, దుఃఖాన్ని మనం ఊహించలేం. శాంతిగా ఉన్న 'లోపలి నేను' గురించి మనకి ఏ దిగులూ లేదు. ఆ శాంతిని మనం అనుభవించకుండా చేస్తున్న ఇంద్రియాలే సమస్యగా ఉన్నాయి. కాబట్టి ఇంద్రియాలను జాగ్రత్తగా వాడుకోవాలి. దుఃఖం కలుగుతుంది 'బయటి నేను'కే కనుక పరిష్కారం కూడా దాని విషయంలోనే అవసరం. ఇంద్రియాలు ఏ అనుభవాన్ని అందించని నిద్రలో, అసలు నేను తాలూకూ శాంతిని మనం అనుభవిస్తున్నాం. ఈ శాంతి మనకు నిరంతరం అందాలంటే ఇంద్రియాల పనులను ఆపాలి. జీవనంలో ఇంద్రియాలను పూర్తిగా ఆపటం ఎవరికి సాధ్యంకాదు. కనుక వాటి కార్యకలాపాలను వీలైనంత తగ్గిస్తే, మనలోని శాంతి క్రమేణా వ్యక్తమవుతుంది. అంటే అనవసర విషయాల్లో ఇంద్రియాల వ్యాపారం, వ్యాపకం తగ్గిస్తే సరిపోతుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
            🌼💖🌼💖🌼
                  🌼🕉🌼 

మనస్సు...

 *🕉️నమో భగవతే శ్రీ రమణాయ*🙏🙏

*భగవాన్ శ్రీ రమణ మహర్షి*

"మనస్సు  చాలా కాలంగా  ఇతరుల పొలాల్లో దొంగతనంగా మేయటానికి అలవాటుపడిన ఆవు లాంటిది, అది తన స్ధావరానికి (గోశాలకు) అంత తేలికగా పరిమితం కాదు . పశువుల కాపరి దానికి  మృదువైన గడ్డి మరియు మంచి మేతతో  ప్రలోభపెట్టినా  మొదటి సారి అది నిరాకరిస్తుంది. తర్వాత మెల్లగా అది కొంచెం కొంచెంగా తీసుకుంటుంది, కానీ అది తన అంతరంగంలో మటుకు  దూరంగా వెళ్లి పక్క పొలాల్లో మేయాలనే స్వభావ ధోరణి ఒత్తిడికి లొంగిపోతుంది. యజమాని ద్వారా పదేపదే ఊరించబడిన తర్వాత  ఆ ఆవు అలవాటు పడి క్రమంగా గోశాల కే పరిమితమవుతుంది. వదిలి వేసినా పారిపోని స్ధితికి వస్తుంది.

*అంటే ఒక్కసారి తన అంతర్గత ఆనందాన్ని కనుగొంటే అది బయటికి పరుగులు తీయదు."*

🙏🌷🙏 *శుభం భూయాత్*🙏🌷🙏 

ఆశ...!!!

 *ఆశ...!!!*

   ఆశను మించిన దుఃఖము మరొకటి లేదు అని మీకు తెలుసా...!!

   ధనము తరువాత మానవుడిని నాశనం చేసేది ఆశ, ఆశను మించిన దుఃఖము మరొకటి లేదు, ఆశను వదిలితే కలిగే సుఖము దేనికీ సమానము కాదు, ఆశ అనేది మనిషితో పాటు పుడుతుంది...


     మనిషి చచ్చే దాకా అతడిలో ఉన్న ఆశ చావదు, కనుక ఆశ ప్రాణాలను తీయగలిగిన ప్రాణాంతక వ్యాధి...

    కోరికలు అనేవి ఒకటి వెంట ఒకటి పుడుతూనే ఉంటాయి, కోరికలు అనుభవిస్తే తీరేవి కాదు...

అగ్నిలో నెయ్యి వేస్తే అగ్ని ఆరిపోతుందా.. అలాగే అనుభవించే కొద్దీ కొత్త కొత్త కోరికలు పుట్టుకు వస్తుంటాయి... 

కోరికల ఆశను అదుపులో పెట్టుకుంటే అంతులేని సుఖం కలుగుతుంది, మానవుడు ఇంద్రియములను నిగ్రహించుకోవాలి...

ఇంద్రియములను వాటి ఇష్టము వచ్చినట్లు పోనిస్తే అవి చేయకూడని పనులు చేసి దుఃఖము కలిగిస్తాయి... 

అలా కాకుండా కోరికలను నిరోధిస్తే మానవునికి సుఖము కలుగుతుంది, మరణం తరువాత సద్గతులు కలుగుతాయి...


ఎప్పుడూ ధనము సంపాదించడం లోనూ ఇంద్రియ సుఖములు అనుభవించడంలోనూ మునిగి తేలే వాడిని మృత్యువు ఒక్క సారిగా మీద పడి అడవిలో పెద్దపులి మేక మీద పడి కబళించినట్లు కబళిస్తుంది,

     మానవుడు సంపాదించిన ధనము, అతడు చేసిన ధర్మములు, యజ్ఞములు, యాగములు, అతడిని మృత్యువు నుండి కాపాడ లేవు...


పుట్టిన వాడు చావక తప్పదు, కేవలం మోక్ష సాధనతోనే ఈ జననమరణ చక్రము నుండి విముక్తి పొందగలడు...

     మానవుడి జీవితంలో ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ అతడి ఆయువు క్షీణిస్తుంది...

    అతడు మృతృయువుకు దగ్గర ఔతుంటాడు, కనుక రేపటి పని ఈ రోజు, తరువాత చెప్పిన పని ఇప్పుడే చెయ్యాలి, కాలయాపన, అలసత్వము, సోమరితనము పనికి రాదు.


కాలముకు వశుడైన మానవుడికి ఏమరిపాటు సహజము, కాలం గడిచే కొద్దీ ఆయుష్షు తరిగి పోతుందని గ్రహించిన నాడు ఈ సంసారం మీద విరక్తి కలుతుంది... 

ఆ విరక్తి మార్గము ముక్తికి సోపానము, ప్రాపంచిక సుఖముల మీద కోరిక ఆశ లేక పోతే అతడు మనస్సును జయించగలడు. 

దాని వలన ముక్తి లభించి జననమరణ చక్రము నుండి విముక్తి పొందగలడు... 

శీలమంటే పారదర్శకత

శీలమంటే పారదర్శకత

నిద్రలో తానున్నానని తనకు తెలియకపోయినా తానున్నాడు.

యెందుకంటే మెలకువ రాగానే నేను హాయిగా నిద్రపోయాను అంటాడు.

'హాయి'ని అనుభవించేవాడు అక్కడ ఒకడు ఉండే ఉండాలి.

నిజానికి ఆ 'హాయే' తాను.
మెలకువలో ఉండి, హాయిని కోరేవాడు కాదు తాను.

ఆ 'హాయే' ఆత్మ, భగవంతుడు....ఇత్యాది పేర్లతో పిలువబడుతున్నాడు.

ఆ 'హాయి'గా ఉన్న తానే...
ఆ ఏకంగా ఉన్న తానే....
చెదరి... కదలి...మనసుగా మారి...
మెలకువలోకి...కలలోకి జారి...
ఈ ప్రత్యేకమైన తానుగా 
అనగా పరిమితమైన తానుగా...
జగత్తుగా విస్తరిల్లాడు.... 

ఏకంగా ఉన్న తానే అనేకం ఐన సంగతిని మరిచి...
ఆ అనేకంలో ఏదో ఒక నామరూపాలు కలిగిన దేహాన్ని మాత్రమే తానని అభిమానించి...
దానితో మమేకం అయ్యి... 
అది మాత్రమే తానని వ్యవహరిస్తూ...
జీవిస్తూ...
నానా అవస్థలు పడుతున్నాడు...
ఇదంతా మరపు వలన వచ్చిన అవస్థలే...

మరపుతో ఉన్న అవస్థలే - జాగ్రత్-స్వప్న-సుషుప్తులు.

ఎరుకతో ఉన్న అవస్థే - తురీయం.

* * *

నిద్రలో ఉన్న హాయిని,
మెలకువలో ఉన్న ఎరుకను
అనుసంధానం చేసే ప్రక్రియే - ధ్యానం.

* * *

స్వస్వరూపమైన ఆ 'హాయి'ని తిరిగి పొందటానికి 
జీవుడు గురువును ఆశ్రయిస్తాడు...

గురువు అంటే తనకు విడిగా ఉన్న ఓ వ్యక్తి అని కాదు...
తనలోనే, తనకు అభిన్నంగా  ఉన్న ఓ 'ప్రజ్ఞ' అది.

యెప్పటికీ అలా తాను మరపులో ఉండకుండా
మళ్లీ తానెవరో గుర్తుకు తెచ్చే ఆ ప్రజ్ఞయే 'గురువు'.

కొందరికి ఆ గురువు పైకి ఓ వ్యక్తిలాగే కనబడవచ్చు...

కొందరికి ఆ గురువు పైకి కనబడకపోవచ్చు...

ప్రజ్ఞయే సాకారంగా ఉంటే - గురువు.
ప్రజ్ఞయే నిరాకారంగా ఉంటే - ఈశ్వరుడు.

గుర్తుకు తెచ్చేవాడు గురువు.
వస్తువు ఇచ్చేవాడు కాదు.

నీదే, నీవే అయిన ఆత్మవస్తువును 
గురువూ ఇవ్వలేడు, దేవుడూ ఇవ్వలేడు.
నిన్ను నీలోలోపలికి(ధ్యానంలోకి) త్రోయడం తప్ప.

* * *
అనంతమైన వస్తువు - సద్వస్తువు.
అది 'నేను'గా ఉంటుందేగాని 'నేను' అని అనదు, అనుకోదు.

పరిమితమైన ప్రతి వస్తువూ జడమే.
జడవస్తువు 'నేను' అని అనదు, అనుకోదు.

* * *

సద్వస్తువు 'నేను' అనదు - అన్యము లేక.
జడశరీరము 'నేను' అనదు - ఉనికి లేక.

ఈ మధ్యలో, ఈ రెంటి స్పర్శతో, దేహపరిమాణంలో
'నేను' అని ఒకటి పుడుతోంది.

* * *

విమానం జడం - పైలట్ లేకుండా ఎగురదు.
పైలట్ చైతన్యం - విమానం లేకుండా ఎగురలేడు.
ఈ రెంటి కలయిక వలననే విమానం ఎగురుతుంది.

శివ-శక్తుల కలయికే ఈ సృష్టి చలనానికి మూలం.

* * *
కాబట్టి జీవుడు -
పూర్తిగా జడమూ కాదు,
పూర్తిగా చైతన్యమూ కాదు.

జడ-చైతన్యముల కలయికే జీవుడు...
అదే చిజ్జడగ్రంథి...
అదే బంధము...
అదే జీవుడు... 
అదే సూక్ష్మశరీరము...
అదే అహంకారము...
అదే సంసారము...
అదే మనస్సు...

* * *
మా మేనమామగారి అబ్బాయి ఆనంద్ అడిగాడు-

మహనీయులు భారతదేశంలోనే యెందుకు పుడుతుంటారు? విదేశాల్లో అటువంటి పుట్టుకలు యెందుకు జరగడం లేదు? అని.

* * *

ఓ పదహారేళ్ల కుర్రవాడు(రమణుడు) దేవునికోసమని ఇల్లు వదిలి
అరుణాచలం చేరి, ధనం, వస్త్రం పరిత్యజించి
కేవలం  "గోచీతో నిలబడడం" అనే అద్భుతమైన ఘట్టం
నాకు రోజులో ఒక్కసారైనా గుర్తుకువస్తుంటుంది.

ఆ పదహారేళ్ల కుర్రవాడే - భగవాన్ శ్రీరమణ మహర్షి.

చదివింది ఫిఫ్త్ ఫామ్. 
కానీ పండితులకు, పీఠాధిపతులకు సైతం అవగతం కాని తాత్త్విక విషయాలెన్నింటినో బోధించారు.

ఎలా వచ్చింది ఆ కుర్రాడికి ఆ శక్తి? ఆ జ్ఞానం?

ఓ పువ్వు పుట్టినట్టు, ఓ మెరుపు మెరిసినట్టు
జ్ఞాని అలా పుడతాడు సహజంగా.

జ్ఞానికావడానికి-
కోచింగ్ సెంటర్లు లేవు,
text books లేవు,
రిజర్వేషన్లు లేవు,
రెకమెండేషన్లూ లేవు.

ఈ పవిత్ర భారతభూమిలో అటువంటి జ్ఞానవృక్షాలు సహజంగా ఎదగడానికి అవసరమైన "సారం" ఏదో ఉంది.

ప్రతి దశాబ్దంలోనూ అటువంటి మహనీయులు అవతరించడం చూస్తూనే ఉన్నాం.

అది మన భారతీయ ధార్మిక జీవన విధానమే
 ఆ "సారం".

అలా మహనీయుడు పుట్టని దశాబ్ధం ఉన్నదంటే
ఈ భూమికి "చేవ" చచ్చినట్టు.

యుగాలపర్యంతం వస్తున్న ఆ చేవను
అలాగే మనం భవిష్యత్తరాలవారికి మనం అందివ్వాలంటే ఏకైక మార్గం - ధర్మాచరణం.

ధర్మాచరణ యొక్క దివ్యఫలమే భగవదనుగ్రహంగా,
అవతారమూర్తిగా ప్రకటనమౌతుంది ప్రపంచంలో.

ధర్మాచరణ అంటే శీలం.
శీలం అంటే పారదర్శకత (Transparency)

పారదర్శకత అంటే-
నీవు నీ లోపల ఏదో
బయట కూడా అదిగానే ఉండడం.

* * * 

అనవసర జ్ఞాపకాలు....

 అనవసర జ్ఞాపకాలు.....
🍂 మనసుకి స్పందన, ప్రతిక్రియ అనే రెండు లక్షణాలు ఉన్నాయి. కాలులో ముల్లు గుచ్చుకుంటే అబ్బా అనటం స్పందన. అది నాకే గుచ్చుకోవాలా అని అనుకోవటం, మళ్ళీ గుచ్చుకోకుండా జాగ్రత్త పడటం ప్రతిక్రియ. ఎవరైనా తిట్టినప్పుడు బాధ కలగటం స్పందన. వాళ్ళు ఎదురు పడగానే కలిగే క్రోధం ప్రతిక్రియ. 
🍂 మన ప్రతిక్రియలకు జ్ఞాపకాలే కారణం. అనవసర జ్ఞాపకాలు తగ్గటమే మన మనసుకు బలం. మనసుకు బలాన్నివ్వటమే దివ్యత్వం. దానికి నిరంతర ఈశ్వరుని నామ జపమే సులభ సాధన. దీని వల్ల జ్ఞాపకాలు పూర్తిగా పోవు. కానీ నీరశించిపోతాయి.
🍂 ఆలోచనలు పూర్తిగా ఆపటం సాధ్యం కాదు. అనవసర ఆలోచనలు తగ్గించటమే మన ముందున్న సాధన...
ఓం నమః శివాయ 

Saturday, August 6, 2022

🌹ఆధ్యాత్మికత🌹

  🌹ఆధ్యాత్మికత🌹 

 ఆధ్యాత్మిక జీవితం అంటే అన్ని పనులు వదిలేసి దైవ చింతనలో మునిగిపోవటం కాదు . గుళ్ళకి వెళ్లి ,తీర్థ యాత్రలు చేసి ,పురాణ ప్రవచనాలు విని , జపతపాలు చేసి మళ్ళీ మామూలుగా అన్ని రకాల ద్వంద భావాలతో ,రాగ ద్వేషాలతో జీవనం సాగించడం ఆధ్యాత్మికత కానే కాదు . 

 వయో వృద్దులు ఒక్కరే చేసేది కాదు . 

 ఆధ్యాత్మికత ఇహానికి ,పరానికి రెంటికీ పని కొచ్చే సూత్రం . 

 నిజాన్ని నమ్మటం ,నిజమైన స్వ ధర్మాన్ని తెలుసుకొని త్రికరణ శుద్దిగా పాటించడం , వయస్సుకి ,స్థితికి అనువైన నాలుగు ఆశ్రమాల నియమాలను అమలు చేయడం ఆధ్యాత్మికత . 

 పుట్టిన పసివాడు తల్లిపాలు త్రాగటం ,20 గంటలు నిదుర పోవటం ఆధ్యాత్మికత . 

 బాల్య వయస్సు లో మంచి ఆహారం ,ఆట పాటలతో ఆహ్లాదంగా గడపటం ఆధ్యాత్మికత . 

 విద్యార్ధి దశలో - శరీర శుభ్రత , వ్యాయామం ,మంచి పోషక ఆహారం తినుట , 

 స్వచ్చమైన గాలిని ప్రాణాయామ పద్దతి లో శ్వాసించుట , 

 తల్లితండ్రులను అతిధి అభ్యాగతులను పూజించుట , 

 గురువుని దైవం వలే నమ్మి విద్య నేర్చు కొనుట ఆధ్యాత్మికత . 

 తోటి మనిషికి , ప్రకృతికి హాని చేయక చేతనైనంత సాయం చేయడం , 

 వస్తూత్పత్తి చేసే వారిని అనగా పంటలు పండించే రైతు ,పరిశ్రమలలో పనిచేసే కార్మికుడు , 

 అలాగే మనలను రక్షించే వారిని,అనగా , సైనికులను , పోలీసులను , గౌరవించి ఆదరించడం ; 

 విజ్ఞానాన్ని పంచే గురువులను ,పరిశొధనలు చేసి కొత్త విషయాలు ఆవిష్కరించే శాస్త్రజ్ఞుల ను అనుసరించడం -ఆధ్యాత్మికత . 

 ప్రతి భాద్యత ,వృత్తి, ప్రవృత్తి అన్నీ కర్తృత్వ భావన లేకుండా భగవత్ కైంకర్యంగా చేయడమే ఆధ్యాత్మికత . 

 మనషి చిన్నప్పటి నుండి ఎలా ఆధ్యాత్మిక జీవనం సాగించాలో గీత చెబుతుంది 

గురుకర్తవ్యం

 గురుకర్తవ్యం

గురు శిష్య సంప్రదాయం పేరిట ఇటీవలి కాలంలో సాగుతున్న పరస్పర వంచన, దోపిడీలను చూచి ఎందరో స్వచ్ఛమైన యోగులు ఈ పద్ధతిని తీవ్రంగా ఖండించారు. కానీ కొత్త గురువులు ఎప్పటికప్పుడు వెలుస్తూనే ఉన్నారు. తమ తమ ప్రయోజనాలను ఆశించిన శిష్యకోటి వారి చుట్టూ పోగవుతూనే ఉన్నారు. ఒక వర్గం వారి మనుగడ మరొక వర్గం మీద ఆధారపడుతుంటుంది.

ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఇలాంటి ఆధ్యాత్మిక పరిశ్రమలు వెదజల్లే కాలుష్యమంతా ఇంతా కాదు. అందుకనే జిడ్డు కృష్ణమూర్తి గారు ఈ పరస్పర దోపిడీని, వంచననూ నిశితంగా విమర్శించేవారు. తాను ఎవరికీ గురువును కాననీ, తనకు అనుచరులంటూ ఎవరూ లేరంటుండేవారు. తాను చెప్పేది అర్థం చేసుకుని అలాంటి అవగాహనతో జీవించేవారిని చూచి సంతోషించేవారు.

అరుణాచల రమణుడు కూడా ఈ 'గురు'పదాన్ని అవతలికి విసిరేశాడు. పాల్ బ్రంటన్ ఆయనతో, “మిమ్మల్ని నేను గురువుగా భావించడాన్ని మీరెందుకు అడ్డుకుంటున్నారు?” అని ప్రశ్నించగా, “నీకు గురువు ఉండాలనే ఈ తీవ్రమైన కాంక్ష ఎక్కడిది? నిన్ను ముందుకు నడిపించేది నీలోనే ఉన్నదని నేను చెప్తుంటే నాకు గురువు ఉండాలనే నీ పట్టదల ఏమిటి?” అని ఎదురు ప్రశ్నవేశారు.

నిజంగా మీ మేలు కోరేవాడెవడూ, తాను మీ గురువునని చెప్పుకోడు. మిమ్మల్ని వాడుకోడు, వంచించడు, మైత్రీ భావంతో మిమ్మల్ని తరింపజేస్తాడు.

గురునామం స్వీకరించినా, స్వీకరించకపోయినా, మిమ్మల్ని ఉద్ధరించాలని గాఢంగా కోరుకున్న శ్రీ నిసర్గదగ్గ మహరాజ్ గురు కర్తవ్యాన్ని ఎలా నిర్వచించాడో చూడండి.

పృచ్ఛకుడు : మీరూ, మీ పూర్వపు గురువులూ పరంపరానుగతంగా దత్తాత్రేయుని అవతారంగా మేము భావించవచ్చునా?

నిసర్గదత్త : మీరు ఏది నమ్మదలుచుకుంటే అది నమ్మండి. మీ నమ్మకాన్ని అనుసరించి మీరు కర్మనాచరిస్తే, అందుకు తగిన ఫలితాలు మీకు దక్కుతాయి. కానవీటి వేటికీ నేనేమాత్రం ప్రాధాన్యమివ్వను. 

నేను ఇప్పుడు ఏమై ఉన్నానో అది నేను నాకది చాలు. వేరొకరు ఎంత గొప్పవారైనప్పటికీ, వారితో నన్ను పోల్చుకోవాలనిగాని, వారిలో ఐక్యమవ్వాలని గానీ నాకు లేదు. అలాగే ఏవో పురాణ గాథలను వాస్తవాలుగా భావించే స్థితిలో లేను. నా వరకు నాకు ఈ కనిపించే అజ్ఞానం, దీని నుండి విముక్తిని గురించే నా శ్రద్ధ అంతాను.

తమ శిష్యుల్లోని మనస్సులలోనూ, హృదయాలలోనూ ఉండే అజ్ఞానాన్ని విచ్ఛేదం చేయడమే గురువుయొక్క అసలు కర్తవ్యం. శిష్యుడు ఇదంతా ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత రుజువు చేసుకోడానికై ఆచరించవలసిన కర్మ యావత్తూ అతడు స్వయంగా ఆచరించు కోవలసిందే కానీ, ఒకరి తరఫున మరొకరెవరూ చేసిపెట్టగలిగిలేరు. శిష్యుడు గనక సరిగా ఆచరించలేకపోతే, అతడికి విషయం సుబోధకం కాలేదన్నమాట.

పృ : పూర్తిగా నిరాశ జనింపజేసే శిష్యులు కూడా మీకు తారిసిల్లుతూంటారను కుంటాను.

ని : సంపూర్తిగా నిరాశ కలిగించే శిష్యుడంటూ ఉండడు. ఆటంకాలను అధిగమించే వీలున్నది. జీవితం సరిచేయలేనటువంటిది, మరణం ఎలాగూ అంతం చేస్తుంది. కానీ గురువుకు అపజయమంటూ లేదు.

పృ : మీకీ భరోసా ఎలా కలిగింది?

ని : మరేంలేదు. గురువున్నూ, మనిషి అంతరంగంలోని వాస్తవమూ - రెండూ కూడా మనసుకు విముక్తి కలిగించి మనిషిని కడతేర్చడానికనే పాటుపడుతున్నాయి. వాటికి అపజయమనేది ఉండే వీలులేదు. ఏ బండరాళ్ళయితే వాటికి అవరోధాలుగా పరిణమిస్తాయో, వాటి ఆధారంగానే అవి తమకవసరమైన వారధి నిర్మించుకో గలుగుతాయి.

మానవుడిలో ఉండేదంతా చైతన్యమొక్కటే అనుకోరాదు. గురువుతోనూ, అంతరంగం తోనూ మరింతగా సహకరించే ‘లెవెల్స్' (మట్టం) ఎన్నో ఉన్నాయి. గురువు ఈ 'లెవెల్స్ నన్నిటినీ బాగా ఎరిగున్నవాడు కాబట్టి, అతడికుండే శక్తి ఓర్పూ అపారమైనవి కాబట్టి, గురువుకు ఓటమి లేదు.

నిజమైన గురువు నిన్ను ఎన్నటికీ పలుచన చేయడు. నీ నుండి నిన్ను వేరు చేయడు. నిరంతరం నీలోని సంపూర్ణతను నీకు గుర్తుచేస్తూ, నీలోన నీవు తరచి చూచుకునేట్లు ప్రోత్సహిస్తుంటాడు. వెలుపలి నుండి నువ్వు కోరదగింది ఏదీలేదనీ, ఆఖరికి గురువైన తాను కూడా అనవసరమేననీ, విసుగూ విరామం లేకుండా గుర్తుచేస్తుంటాడు.

కానీ తనంతట తానే గురువుగా ప్రకటించుకున్నవాడికి తనని గురించిన చింతే ఉంటుంది కానీ, శిష్యుల శ్రేయస్సు యెడల ఉండదు.

పృ : గురువుల్ని మార్చడం తప్పులేదంటారా?

ని : మార్చితే తప్పేమిటి? గురువులు మైలురాళ్ళ వంటివారు. ఒక దరి నుండి మరొక దరికి వెళ్ళడం సహజమే. ప్రతి ఒక్క గురువూ కూడా మైలురాయిలాగా దిక్కునూ దూరాన్నీ సూచిస్తుంటాడు. 

ఇక నిత్యమూ శాశ్వతమూ అయిన సద్గురు వంటావా, అతడు సాక్షాత్తూ నువ్వు ప్రయాణిస్తున్న ఆ మార్గమే. నీ మార్గమే నీ లక్ష్యమని, ఎల్లవేళలా దానినే నువ్వు అంటి పెట్టుకుని ఉండడం సంభవిస్తే ఇక సమస్యేలేదు. నువ్వు ఆ మార్గంమీద చేసే ప్రయాణం ఏ లక్ష్యాన్ని చేరడానికి కాదు సుమా, కేవలం ఆ సౌందర్యాన్ని అనుభవించడానికి, ఆ జ్ఞానాన్ని కనుగొనడానికి మాత్రమే ఈ ప్రయాణం. అప్పు డీ జీవితం భారమనిపించదు ఎంతో సహజంగా సరళంగా ఒక మహదానందంగా రూపొందుతుంది.

# యోగులుఅవధూతలు

# YoguluAvadhutalu 

# అమృతధారఖడ్గధార

కర్మయోగం - భక్తియోగం - జ్ఞానయోగం - ధ్యానయోగం ఏమిటి ? వ్యాఖ్యానం : సూక్ష్మంగా

 కర్మయోగం - భక్తియోగం - జ్ఞానయోగం -

ధ్యానయోగం ఏమిటి ?

వ్యాఖ్యానం : సూక్ష్మంగా

కొందరు కర్మయోగం గొప్పదని, కొందరు భక్తియోగం గొప్పదని, కొందరు జ్ఞానయోగం గొప్పదని కొందరు ధ్యానయోగం గొప్పదని పిడివాదాలు చేస్తూ ఉంటారు. నిజంగా ఈ యోగాలు దేనికది ప్రత్యేకమైనది కాదు. ఒకదాని కొకటి సమన్వయం చేసుకుంటూ అన్నింటిని ఆచరించవలసిందే. భగవద్గీత అన్ని యోగాలకు తగిన స్థానమిచ్చి ఆదరించింది. సాధారణంగా మనం చేసే పనులలో, అన్ని లౌకిక కార్యాలలో కూడా ఈ 4 యోగాలు కలసి ఉండాల్సిందే. అలాంటిది పరమపురుషార్థమైన మోక్షప్రాప్తికి వీటన్నింటి అవసరం లేకుండా ఎలా ఉంటుంది?

ఉదాహరణకు వంట విషయాన్నే తీసుకోండి, వంట అనేది మీరు ప్రతిరోజూ చేసే ముఖ్యమైన పని. ఈ పనిలో కూడా 4 యోగాలు కలిసే ఉండాలి. ఏ యోగం లోపించినా వంట చెడిపోతుంది.

(i) వంట చేయాలంటే బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు అన్నీ సమకూర్చుకోవాలి. కూరగాయలు తరిగి ఉంచుకోవాలి. పొయ్యి వెలిగించాలి. పాత్రలు శుభ్రం చేసుకోవాలి. ఇదంతా కర్మయోగం.

(ii) బియ్యానికి తగినన్ని నీళ్ళు, పప్పుకు తగినంత ఉప్పు, వంటకు తగినంత మంట, వంట చేసే విధానము - ఈ పరిజ్ఞానం ఉండాలి. ఇదంతా జ్ఞానయోగం.

(iii) పాత్రను పొయ్యి మీద పడేసి వీధిలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే; పాలు పొయ్యి మీద పెట్టి బయట కూరగాయల బేరం చేస్తుంటే - వంటంతా చెడిపోతుంది, స్టౌ ఆరిపోతుంది. కనుక చేసే పనిమీద నిఘా ఉంచాలి. ధ్యాస ఉండాలి. ఇదే ధ్యానయోగం.

(iv) తిట్టుకుంటూ తిమ్ముకుంటూ, లోకులను ఆడిపోసుకుంటూ చేసిన వంట తిన్నవారికి వంటబట్టదు. అది విషంగా మారిపోతుంది. అందువల్ల ఎంతో ప్రీతితో, ఇష్టంతో వంట చెయ్యాలి. తాను చేసిన వంటను ఇంటిలోని వారందరూ ఆరగించి ఆనందించాలి, తృప్తి చెందాలి అని భావిస్తూ, భగవంతుని స్మరిస్తూ, పవిత్రమైన ఆలోచనలతో వంట చెయ్యాలి. ఇదే భక్తియోగం.

ఈ నాలుగు యోగాలూ వంటచేసే వారికే అవసరమవుతుంటే పరమాత్మ ప్రాప్తికై చేసే సాధనలో ఈ నాలుగు యోగాల అవసరం లేకుండా ఎలా ఉంటుంది? 4 యోగాలూ అవసరమే.

(i) కర్మయోగం:- నిష్కామంగా, ఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తుంటే మనస్సు కోరికలనే కల్మషాలు అంటక నిర్మలము, శుద్ధము అవుతుంది. మనస్సు నిర్మలము, శుద్ధము అయితేనే భగవంతునిపై నిలపటానికి ఆ మనస్సుకు అర్హత కలుగుతుంది.

(ii) భక్తియోగం:- మనస్సు భగవంతునిపై నిలిస్తే నిరంతరము భగవంతుని స్మరించటము, భగవంతుని మహిమను తెలుసుకోవటము; నిజంగా భగవంతుడు మనకు చేస్తున్న మేలును తెలుసుకొని కృతజ్ఞతా పూర్వకమైన భక్తిని కలిగి ఉండటము జరుగుతుంది.

(iii) జ్ఞానయోగం:- ఇలా భక్తి భావన వృద్ధి అయ్యేకొద్దీ అసలు భగవంతుని తత్త్వం ఏమిటి? భగవంతుడంటే ఎవరు? నేను ఎవరిని? భగవంతునికి నాకు మధ్యనున్న సంబంధమేమిటి? అసలు ఈ జన్మకు సార్థకత ఏమిటి? ఆ భగవంతుని చేరుకొని ఆయనతో ఐక్యత నెలా సాధించాలి? అనే జ్ఞానాన్ని - ఆత్మజ్ఞానాన్ని పొందటం జరుగుతుంది.

(iv) ధ్యానయోగం:- ఆత్మజ్ఞానాన్ని పొందిన తరువాత ఆ జ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకొనుటకు ధ్యానమగ్నులై, విచారణా శీలురై, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల కన్న వేరుగా ఉండి, జడమైన వీటికి చైతన్యాన్ని ప్రసాదించే ఆత్మనైన నేను సర్వత్రా ఉన్న సచ్చిదానంద స్వరూప పరమాత్మనే అనే అనుభూతిని పొంది పరమాత్మగా ఉండిపోవాలి. ఇదే ధ్యానయోగం. ఇదే జీవ బ్రహ్మైక్యత; ఇదే జీవన్ముక్తి; ఇదే మోక్షం.

ఇలా మోక్షాన్ని పొందాలంటే నాలుగు యోగాలు అవసరమే. ఈ నాలుగు యోగాల సమన్వయమే భగవద్గీత.

కర్మ - ఖర్మ, 🤘తలరాతని తప్పించుకోలేమా? అసలు తలరాత అంటే ఏమిటీ?

 🍁 *కర్మ - ఖర్మ* 🍁

✍️ మురళీ మోహన్ 

🤘తలరాతని తప్పించుకోలేమా? 

అసలు తలరాత అంటే ఏమిటీ?

ఆయుష్షు తీరో, జవసత్వాలుడిగో నశించిపోయిన భౌతిక శరీరాలు వారసత్వం భరించలేక మరోశరీరానికి కర్మల్ని బదిలీచేస్తాయి. శరీరాలు నశించిన కర్మశేషాలు నశించవు.  వెన్నంటే వస్తాయి, వెంటాడుతునే ఉంటాయి. ఆ కర్మశేషాలనుభవించడానికి మరల మరల జన్మించడం. 

మనకి ఆ కర్మశేషాలు గుర్తుండక పోవచ్చు కానీ, మరిచిపోయినంత మాత్రాన మనవి కాకుండా పోవు. ఇదే విధి లేదా తలరాత లేదా లలాటలిఖితం. 

కర్మలకు మరణం లేదు. మనిషి మరణించినా కర్మలు మరోజన్మకు పయనిస్తాయి. గతజన్మ కర్మలు కంటికి కనిపించవు. కానీ, ఈ జన్మలో అనుభూతమౌతాయి. పూర్వజన్మల కర్మబీజ ఫలాలే విధిరాతలు. గతజన్మల కర్మలశేషఫలంకు అంటే విధికి , నేటి కర్మల ఫలితంకు అనుసంధానింపబడి సాగుతుంది ఈజన్మ జీవనయానం.

సాధారణంగా కష్టకాలంలో లేదా దుఃఖ సమయంలో గాని, అనుకునేరీతిలో జీవనం సాగనప్పుడు, అనుకోని అవాంతరాలప్పుడు అనిపిస్తుంటుంది - ఇదంతా మన తలరాత అని. మనచేతిలో ఏదీలేదు, తలరాత ఎలా వుందో అలా జరుగుతుంది, తప్పించుకోలేమని భావిస్తాం. ఇదో నిరాశావాదం.  ప్రారబ్ధమే మనిషిని నడిపిస్తే, అంతా విధిరాత ప్రకారమే జరిగితే ఇక మనిషి చేయాల్సింది ఏమీ లేదా? విధి చేతిలో మనం కీలుబొమ్మలమైతే ఇక మనం చేయగలిగింది ఏముందీ?  ఇది నా తలరాత అని అనుకున్నంతకాలం ఆవేదన తప్పదు, నిరాశ వీడదు.

జన్మించిన ప్రతీజీవి విధికి తలవొగ్గక తప్పదు. కానీ, ప్రతిఒక్కరికి విధిని ఎదిరించేశక్తి వుంది.  విధి బలీయమైనదే కావొచ్చు... కానీ, దానిని మార్చుకోవచ్చు... వజ్ర సంకల్పంతో, నిరంతర సాధనతో, అకుంఠిత భక్తితో.  ఇందుకు ఉదాహరణంగా కొన్ని గాధలు గుర్తుచేసుకుందాం -

విధిరీత్యా అల్పాయుష్కుడైన సత్యవంతుని వివాహమాడి, తన ఆత్మ విశ్వాసంతో,  వజ్ర సంకల్పంతో యముణ్ణి ఎదిరించి తన భర్తను బ్రతికించుకున్న సావిత్రి - సత్యవంతుల కధ మనందరికీ విధితమే. 

పదహారు ఏళ్ళు మాత్రమే ఆయుష్షు ఉన్న మార్కండేయుడు తన అకుంఠితభక్తితో యముణ్ణి జయించి, శివుని ఆశిస్సులతో చిరంజీవత్వాన్ని పొందలేదా?

చదువునందు రాణించలేక, తను చెప్పింది అవగాహన చేసుకోలేకపోతున్న శిష్యుని హస్త సాముద్రికాన్ని పరిశీలించి, నాయనా! నీకు విద్యారేఖ లేదు, చదువుకునే యోగం లేదు, కాబట్టి నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లి, తగిన వృత్తిని స్వీకరించడం మంచిదని చెప్పిన గురువుగారి మాటలకు మనస్సు భారమై, ఇంటికి బయలుదేరి, మార్గమధ్యంలో దప్పికై, ఓ రాతిగిలక బావి దగ్గర ఆగి, దాహం తీర్చుకుంటూ, తాడు ఒరిపిడికి అరిగిన ఆ రాతిగిలకను చూసి, బలహీనమైన తాడువల్ల రాయే అరగగా, నేను సాధనతో విద్యను ఆర్జించలేనా అన్న దృఢ నిశ్చయంకు వచ్చి, పదునైన రాతిముక్కతో చేతిపై విద్యారేఖను గీరుకోని, తిరిగి గురువు చెంతకు వెళ్ళి, నిరంతర సాధనతో అనతికాలంలోనే విద్యను అభ్యసించి, సంస్కృత వ్యాకరణం వ్రాసిన పాణిని దృఢ సంకల్పం తన రాతను మార్చలేదా?

అందరం ఒకటి గుర్తుంచుకోవాలి -  మనం ఏ కర్మ చేసినా దాని ఫలం అనుభవించటం నిశ్చయం. విధిరాతలు స్వయంకృతం.  స్వీయకర్మలే మన విధిరాతలు. అంటే మన విధిరాత విధాతలం మనమే. గతజన్మల  కర్మశేషాలే నేటి విధిరాతలయినట్లు, నేటి కర్మలే మరుజన్మ విధిరాతలు. కర్మలు చేయడం అనివార్యం. ఆ కర్మలలో కొన్ని ప్రారబ్దాలుగా మూటకట్టుకోవడం నిజం. అవి అనుభవించడానికి జన్మించడం తప్పదు. ఇలా పుట్టడం ... గిట్టడం ... తప్పదా ఈ చక్రపరిభ్రమణం ... రాదా ముక్తి?

వస్తుంది ... ఎప్పుడు? గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు... ' *స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః*' 

ఈశ్వరార్పణ బుద్ధితో, భగవత్ కైంకర్యబుద్ధితో కర్మలు చేస్తే జ్ఞాన మోక్ష సిద్ధులు ప్రాప్తమౌతాయి. 

*బ్రహ్మణ్యాధాయ కర్మాణి  సంగం త్యక్త్వా కరోతి యః  లిప్యతే న స పాపేన పద్మపత్ర మివామ్బసా* 

ఎవరు కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి, ఆసక్తి లేకుండా తన కర్మలు  ఆచరిస్తారో, అటువంటి వారు నీటిచే అంటబడని  తామరాకు వలె పాప ఫలితంచే ప్రభావితులు కారు. 

ప్రతీ ఒకరు చింత చింతన వీడి సానుకూల దృక్పధం ఏర్పరుచుకోవాలి.

ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం కలిగి ఉండాలి.  

సానుకూల భావం సాధనా సోపానం. 

సంకల్పం దృఢమైతే సాఫల్యం సమక్షంలోనే.👍

జీవిత సత్యం.జాగృతిగా ఉన్న మనిషి - అర్థం చేసుకునే మనిషి - చేతలు చేస్తాడు." జాగృతి లేకుండా అపస్మారకం గా, యాంత్రికంగా, మరబొమ్మ లా ఉండే మనిషి ప్రతిక్రియ చేస్తాడు.

జీవిత సత్యం.

ఒకసారి బుద్ధుడు ఒక ఊర్లోంచి వెళ్తుంటే,జనం వచ్చి అతని అవమానించారు. దూషించారు. దుమ్మెత్తిపోశారు. వారు ఎన్ని తిరస్కారమైన, అవమానకరమైన పదాలు వాడాలో అన్ని వాడారు. వారికి తెలిసిన నాలుగుపదాల తిట్లనీ ఉపయోగించారు. బుద్ధుడు అక్కడ నిలబడి, మౌనంగా, శ్రద్ధగా అంతా విని అప్పుడు అన్నాడు."మీరు నా దగ్గరకు వచ్చినందుకు కృతజ్ఞుడిని. కానీ నేను తొందరపాటులో ఉన్నాను.నేను ప్రక్క ఊరికి చేరాలి. అక్కడ నా కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు మీకోసం ఇంకా ఎక్కువ సమయం కేటాయించలేను.కానీ రేపు నేను వెనక్కి ఇటుగానే వస్తాను. అప్పుడు నాకు ఎక్కువ సమయం ఉంటుంది. మీరు మళ్ళీ కూడివచ్చి - ఇంకేదైనా మీరు చెప్పాలనుకున్నది, ఈ రోజు ఇంకా చెప్పలేనిది మిగిలి ఉంటే - రేపు వచ్చి నాకు చెప్పవచ్చు. కానీ ఈ రోజు నన్ను క్షమించండ."

ఆ జనాలు వారి చెవుల్ని,వారి కళ్ళనీ వారు నమ్మలేక పోయారు.ఈ వ్యక్తి బొత్తిగా కలతపడకుండా ఉన్నాడు. అందులో ఒకరు అడిగారు మేము చెప్పింది, అన్నది నువ్వు వినలేదా?మేము నిన్ను ఎలా పడితే అలా తిట్టాం. నువ్వు దానికి ఏ మాత్రమూ జవాబు ఇవ్వలేదు!"

బుద్ధుడు అన్నాడు "ఒకవేళ మీరు జవాబు కోరినట్లయితే అప్పుడు మీరు చాలా ఆలస్యంగా వచ్చినట్లు అన్నమాట. మీరు పదేళ్ల క్రితం వచ్చినట్లయితే అప్పుడు నేను మీకు జవాబు ఇచ్చి ఉండేవాడిని. కానీ ఈ పదేళ్లుగా నేను ఇతరుల చేత ఆడించబడటం మానేసాను. నేను మరి ఇంక ఏమాత్రమూ బానిసను కాను. నేను నాకు యజమానని. నేను నా అంతరాత్మ చెప్పినట్లుగా చేస్తాను తప్ప ఇంకొకరి ఇష్టప్రకారం ఏమీ చేయను. నేను నా లోపలి అవసరం మేరకు చేతలు చేస్తాను. మీరు నన్ను దూషించలనుకోవడం, మీరు నన్ను తిట్టడం - ఇది పరిపూర్ణంగా మంచిదే. తృప్తి పడండి. మీ పని మీరు చాలా బాగా లోపరహితంగా, పరిపక్వతతో చేశారు. కానీ నాకు సంబంధించినంతవరకూ, నేను మీ అవమానాల్ని స్వీకరించలేదు. నేను ఆ దూషణలని తీసుకోనంత వరకూ అవి అర్ధరహితం."

ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు దానిని స్వీకరించేవారు అవ్వాలి. అతను ఏం చెప్పినా మీరు అంగీకరించాలి. అప్పుడు మాత్రమే మీరు ప్రతిక్రియ చేస్తారు. కానీ మీరు ఒకవేళ దాన్ని ఒప్పుకోకపోతే, ఒకవేళ మీరు కేవలం,సంబంధం లేనట్లుగా ఉంటే,ఒకవేళ మీరు సుదూరంగా ఉంటే,ఒకవేళ మీరు పట్టనట్లు ఉంటే, అతడు ఏం చేయగలడు?

బుద్ధుడు అన్నాడు "ఎవరైనా ఒక మండుతున్న కాగడాన్ని నదిలోకి విసిరి వేయవచ్చు. అది నది చేరేదాకా వెలుగుతూ మండుతూనే ఉంటుంది. అది నదిలో పడ్డ తక్షణం అంత మంటా పోతుంది. నది దాన్ని చల్లబరుస్తుంది. నేను ఓ నదిలా అయ్యాను. మీరు నాపై దూషణలని విసిరారు.అవి మీరు విసిరేటప్పుడు నిప్పులా ఉన్నాయి .కానీ అవి నన్ను చేరిన మరుక్షణం, నా చల్లదనంలో, వాటి మంటని కోల్పోయాయి. అవి మరింక ఏమాత్రమూ నొప్పించవు. మీరు ముళ్ళని విసిరారు. నా నిశ్శబ్దతలో పడి అవి పూలు అయ్యాయి. నేను నా సహజమైన స్వభావం నుంచి పనులు చేస్తాను."

ఇదే స్వతహాగా ఉండటం.

అయత్నకృతం . "జాగృతిగా ఉన్న మనిషి - అర్థం చేసుకునే మనిషి - చేతలు చేస్తాడు." జాగృతి లేకుండా అపస్మారకం గా, యాంత్రికంగా, మరబొమ్మ లా ఉండే మనిషి ప్రతిక్రియ చేస్తాడు.

సేకరణ. మానస సరోవరం 👏

అవమానమనేది మోయలేని భారం.

 అవమానమనేది మోయలేని భారం.*

మనసును దహించి వేస్తుంది.అన్నపానీయాలను ముట్టనీయదు.

నిత్యాగ్ని గుండంగా జ్వలిస్తుంది మనసు.

ఆ మహోష్ణతాపానికి తాను మాడిపోవడమో, ఎదుటివారు మసికావడమో జరుగుతుంటుంది. సహన గుణం పూర్తిగా క్షీణించి కోపతాపాలకు, ప్రతీకార వాంఛలకు గురవుతుంది మనసు. జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. ఎవరైనా సన్మానాలను, పొగడ్తలను మరచిపోతారేమోగానీ- అవమానాలను మరచిపోలేరు ఇది మానవ సహజ గుణం.

వీటిని అధిగమిస్తేనే ప్రగతి! రారాజు మయసభలో పొందిన అవమానం కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారితీసింది.

పసిబిడ్డ పోషణార్థం మిత్రుడైన ద్రుపదరాజును గోవులు అడిగాడు ద్రోణాచార్యుడు.

అవమానించాడు ద్రుపదుడు.

తలొంచుకున్నాడు ద్రోణుడు. పొందిన అవమానభారం ద్రోణుడి హృదయాన్ని కల్లోలపరచింది. అర్జునుని ధనుర్విద్యా విశారదుడిగా చేసి మహాస్త్రంగా ప్రయోగించాడు. పాండవ మధ్యముడు ద్రుపదుణ్ని ఓడించి, రథానికి కట్టివేసి గురువు పాదాల ముందుంచాడు. అప్పటికి కాని శాంతించలేదు ద్రోణుడి హృదయం!

అవమాన భారంతో రగిలిపోయిన చాణక్యుడు నందవంశాన్ని నిర్మూలించాడు.

పురాణాల్లో, చరిత్రల్లో కోకొల్లలుగా దర్శనమిస్తాయి ఇటువంటి ఉదాహరణలు. 

అవమానానికి పగలు ప్రతీకారాలు జ్వలింపజేసుకుంటూపోతే సహన గుణానికున్న ఔన్నత్యం ఉనికిని కోల్పోతుంది.

మనలోని సహన గుణం ఎదుటివారిలోనూ పరివర్తన తెస్తుంది. కారణాలేవైనా అవమానాలను కూడా భరిస్తూ, సహిస్తూ సాగిపోవడమే ఉత్తమమైన విధానం!

ప్రకృతి అందచందాలకు నిలయం.కార్చిచ్చు దహిస్తుంది జలవిలయం తుడిచిపెడుతుంది. కానీ తిరిగి చిగురేయడం, పచ్చదనంతో కళకళలాడటం వృక్ష నైజం.

బంగారాన్ని అందించే పుడమితల్లి కంపనాలకు గురవుతూనే ఉంటుంది.

గౌరవ మర్యాదలకు ఆనందించే మనసు అవమానాల్ని తట్టుకోగలగాలి. తిరిగి స్వీయ వైభవాన్ని పొందాలి. అదే సమస్థితి.

కొండమీది చిన్న గుడిలో ధ్యానం చేసుకుంటూ శిష్యుడితోపాటు నివసిస్తున్నాడు ఓ సాధువు. కొండ దిగువున పల్లెవాసులందరికీ ఆయనంటే గురి.

నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా ఏదో ఒక ఆకో, ఫలమో ఇవ్వమనేవారు. వైద్యుడి దగ్గరకు వెళ్ళమని చెప్పినా వినేవారు కాదు…!

అగ్నిగుండం నుంచి ఓ చిటికెడు బూడిద ఇచ్చేవాడు. కాలగమనంలో వ్యాధులు తగ్గిపోయేవి. క్రమంగా జనంతాకిడి పెరిగింది.

ఆ సాధువును భగవత్ స్వరూపంగా భావించేవారు. ఆయన అనుగ్రహ భాషణం చాలు, సకలమూ చక్కబడుతుందన్న నమ్మకం పెరిగిపోయింది.

ఇలా ఉండగా ఓసారి తీవ్రమైన కరవు ఏర్పడింది పొలాలన్నీ బీళ్ళుగా మారాయి. చుక్క నీరు లేదు. పసిపిల్లలకు పాలు కూడా కరవయ్యాయి. పశువులు బక్కచిక్కాయి. పల్లెవాసులకు వలస మార్గమే దిక్కైంది ఈ కరవుకు కొండపై ఉన్న సాధువే కారణమన్న వదంతులు వ్యాపించాయి.

రోజులు గడిచేకొద్దీ ఈ భావం ప్రజల్లో బలంగా నాటుకొంది.*

*సాధువును అనరాని మాటలంటూ, ఛీత్కరిస్తూ, రాళ్ళతో కొడుతూ తరిమేశారు. సాధువు కాషాయంబరాలు పీలికలయ్యాయి. రాళ్ళదెబ్బలకు రక్తం కారసాగింది దుర్భర స్థితి!

దూరంగా మరో ప్రాంతానికి వెళ్ళి తిరిగి ధ్యానం చేసుకోసాగాడు. సాధువు వెంటే ఉన్న శిష్యుడు- 'స్వామీ ఏమిటీ దారుణం? ఇంత అవమానం పొంది కూడా అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారు?' అని అడిగాడు.

సాధువు నవ్వి- 'చూడు నాయనా! పల్లెవాసులు నన్ను మహాపురుషుడిలా గౌరవించినప్పుడు పొంగిపోనూ లేదు. ఛీత్కరిస్తూ తరిమేసినప్పుడు బాధపడనూ లేదు. రెండింటినీ ఒకే చిత్తంతో స్వీకరించాను. కాలమే వారికి జ్ఞానోదయం గావిస్తుంది. ఏదో జరిగిందని వ్యాకుల చిత్తంతో నేను బాధపడాల్సిన అవసరమే లేదు... అంటూ ధ్యానముద్ర వహించాడు- నిశ్చలచిత్తంతో.!

ఒక లక్ష్యసాధనకై శ్రమిస్తున్నప్పుడు ఫలితాలు అనుకూలంగా లేవని, దానినొక అవమానంగా భావిస్తూ కుంగిపోవడం అవివేకమే.!

నేడు మనం చూస్తున్న వివిధ రంగాల్లోని చాలామంది ప్రముఖులు ప్రతికూల పవనాలను అధిగమించి విజయకేతనాలు ఎగరేసినవారే. ఉన్నత స్థితికి చేరినవారే.

స్థిరచిత్తంతో అవమానాలను సైతం ఎదుర్కొంటూ లక్ష్యసాధనలో సాగిపోయేవారే ఉన్నతులు.  వారే జీవితంలో విజేతలు.

సేకరణ. మానస సరోవరం 👏

🌷మహాసిద్ధి🌷

 🌷మహాసిద్ధి🌷
అనేకమంది సాధకులు సిద్ధులకై ప్రయత్నిస్తుంటారేగాని,
ఆత్మసిద్ధికై ఎవడూ ప్రయత్నించడు.
లేదా నిజంగానే ఆత్మసిద్ధికై సాధన మొదలు పెట్టినప్పటికీ, మధ్యలో సిద్ధులు కలిగి, ఆ వైపుకు ఆకర్షింపబడి గమ్యాన్ని చేరకపోవడమూ ఉంది.
సిద్ధులన్నీ స్వప్నసిద్ధులే.
ఈ మహాస్వప్నం నుండి మేలుకోవడమే మహాసిద్ధి.
కలలోనే ఉంటూనే ఇది కల అని తెలుసుకునే జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానము.
మెలకువలో ఉంటూనే మెలకువగా(ఇది కూడా ఓ కలే అని) ఉండడమే ఆధ్యాత్మిక జ్ఞానము.
మేలుకో-మేలుకో అని కఠోపనిషత్తు ఘోషించడానికి కారణమిదే.
నీవు దేనినయితే మెలకువ అంటున్నావో అది మెలకువ కాదు అని అర్థం.
మెలకువలో నుంచి మేలుకోవడమే మోక్షం.
కలలు, మెలకువలు కలయని ఎరిగిన
"మెలకువ" తానే అనిలాచలా!
అన్నారు గురుదేవులు.
"మెలకువ" అంటే నిత్య ఎరుక.(అచలమైన ఎరుక)
జాగ్రత్-స్వప్న-సుషుప్తులు మూడింటిలోనూ
"నేనున్నాను" అన్న నిత్య ఎరుకలో ఉండడమే మహాసిద్ధి.
అటువంటి మహాసిద్ధిని పొందటానికి 
కేవలం గ్రంథపఠనం, క్షేత్రదర్శనం చాలవు.
ఈ అజ్ఞానమనే గాఢనిద్ర నుండి,
ఆ నిద్రలో కనే ఈ స్వప్న ప్రపంచం నుండి 
నిన్ను గట్టిగా తట్టి లేపగలిగేది సద్గురు సాంగత్యం ఒక్కటే.
లే... కదులు...గురుపాదాల వైపుకు....
* * *
మగవాడు తాను మగవాడినని సదా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడా? లేదు కదా?
'అహం బ్రహ్మాస్మి' అంటూ లేదా 
'శివోహం' అంటూ కొందరు సదా జపం చేస్తుంటారు....
కొందరు నేతి-నేతి(నేనిదికాదు-నేనిదికాదు)అంటూ
సాధన చేస్తుంటారు.
అంటే వీరు అంతగా దేహాత్మభావంతో మమేకం అయిఉండబట్టే, వారికి అటువంటి సాధనలు అవసరమై ఉండొచ్చు.
అటువంటివారికి ఆ మాత్రం సాధన చేయడం సహాయమేగాని
నిజానికి తానెప్పుడూ 'అదే' కదా!
రాజకుమారుడు రాజే అవుతాడు.
సాలెవాని కుమారుడు సాలెవాడే అవుతాడు.
వాటికై ఎవరూ ప్రత్యేక సాధనలు చేయరు కదా!
బంగారం ఆభరణంగా మారుకున్నాక
బంగారం కాకుండా అయిపోతుందా?
ఆభరణం బంగారం కావడానికి సాధన చేయాలా?
* * *
సాధకుని పరిపక్వతను అనుసరించి
ఆ జ్ఞప్తినిపొందటంలో కాలభేదం ఉంటుందేగాని
"తానెప్పుడూ అదే" అనేది తిరుగులేని సత్యం.
పరిపక్వత అనేది కేవలం సద్గురు సన్నిధిలో మాత్రమే దొరికే అపురూపమైన స్థితి.
* * *
సాధన వలన తానే ఐన వస్తువు తాను కావడం
అంతేగాని తానుకానిది తానవ్వడం కాదు.
'నేను ఈ శరీరమాత్రుణ్ణి' అనే అబద్ధపు భావన నుంచి
'నేను ఆత్మస్వరూపుణ్ణి' అనే సత్యానుభవానికి 
చేసే ప్రయాణమే "ఉపాసన".
ఎవరైనా సాధన అవసరమా? అని అడిగితే
తప్పనిసరిగా వారికి అవసరమే అంటాను.
యెందుకంటే ప్రశ్నించారంటేనే దాని అర్థం వారికి ఆత్మానుభవం కలుగలేదనే.
'నేను ఆత్మానుభవాన్ని పొందానంటారా....?' అని అడిగారు నా మిత్రుడు ఓ రోజు.
'పొందలేదు' అని చెప్పా ఖండితంగా...
యెందుకంటే పొందినవాడు అలా యెవరినీ అడగడు.
ఆత్మానుభవంలో 
సంశయానికి, అయోమయానికి తావుండదు.
అంతేకాదు, అటువంటి మహనీయుడు  తానై యెవడినీ పిలిచి బోధించడు.
యెందుకంటే వానికి అజ్ఞాని అనేవాడు తోచడు.
వాని దృష్టిలో "జ్ఞానం" తప్ప మరో వస్తువు కనబడదు.
ఇతరులు తనను నిరూపించడం గాని
తాను ఇతరులకు నిరూపించుకోవడంగాని
రెండవస్తలూ ఉండవు.
అలా ఎట్టి సంశయమూ లేని స్వస్థితిని పొందటానికి చేసే అనేక సాధనలలో ముఖ్యమైనది - అహం మూలాన్వేషణ.
అనగా "నేను" అనే భావన యెక్కడ పుడుతోందో 
అక్కడకు తానెళ్లి స్థిరపడడం. (అంటే ఆచలంలో లేదా ఆకాశంలో చలనం ఎక్కడ ప్రారంభమవుతోందో అక్కడ స్థిరంగా ఉండడం)
దీనినే ఆత్మనిష్ఠ అంటారు.
ఆత్మనిష్ఠ కన్నా గొప్ప సాధనగానీ, 
గొప్ప సిద్ధిగానీ మరేదీ లేదు.
* * *

లాల్‌సింగ్ చడ్డీ ఎందుకు బాయ్‌కాట్ చేయాలి..?

 లాల్‌సింగ్ చడ్డీ ఎందుకు బాయ్‌కాట్ చేయాలి..?

===========================

ఎందుకంటే..

మీర్‌ఖాన్ భారత్‌పై విషం చిమ్ముతూ.. భారతీయతను దూషించి, ద్వేషించే ఒక దేశద్రోహి.. లవ్‌జిహాదీ.. మతోన్మాదమృగం..! అంతేకాదు తన సినిమాల్లో హిందువుల దేవీ దేవతలను ఘోరంగా అవమానించాడు. అనేక టీవీ ఇంటర్వ్యూల్లో దేశాన్ని అవమానపరచాడు. దేశంలో అసహనం పెరుగిపోతోందంటూ.. పరోక్షంగా.. హిందువులపై అసహనవాదులని ముద్ర వేశాడు. తన టీవీ ప్రాయోజిత కార్యక్రమాల్లో శివలింగానికి పాలు పోయడం వృధా అని ఏకంగా హిందువుల ముందు వాకృచ్చాడు తుచ్ఛుడు. శతృదేశాల అధ్యక్షులతో సమావేశమై వారితో విందులు వినోదాల్లో పాల్గొన్నాడు మ్లేచ్ఛుడు.

మచ్చుకు వాడి సినిమాల్లోని కొన్ని సీన్లు చూడండి క్రింది వీడియోలో.

ఒక సీన్లో.. ఇక్కడ ఉచ్చలు పోయరాదు అని గోడపై వ్రాసి ఉన్న చోట.. కృష్ణుడు, మహదేవ్, దుర్గ ల ఫోటోలు ఉన్న సూట్‌కేస్ క్రింద పెట్టి.. అక్కడే ఉచ్చ పోశాడు. అంతేకాదు.. ఆ సీన్లో.. సూట్‌కేస్‌పై ఉన్న హిందూ దేవీదేవతల బొమ్మలను జూం చేసి చూపిస్తాడు భ్రష్టుడు. ఇది వాడి మతోన్మాద మానసికతకు చిహ్నం కాదా..? 

ఇంకొక సీన్లో మందిరంలో ఉంచిన భగవంతుని పాదుకలను ధరించాడు. ఈ కాష్ఠుడి అహంకారానికి ఇది చిహ్నం కాదా..?

మరొక సీన్లో మహదేవ్‌ను మూత్రశాలలో ఘోరావమానానికి గురి చేశాడు మరియు వీధుల్లో పరిగెత్తిస్తాడు. ఇది వీడి ఉన్మాదమతాధిక్యానికి ఉదాహరణ కాదా..?  

అలాంటి త్రాష్ఠుడు.. భారత్‌లో నివసించడం సురక్షితం కాదని తన భార్య అంటోందని కూశాడు. 

అటువంటి భ్రష్టుడి సినిమా ఏ హిందువూ చూడకూడదు.. వీడి సినిమా చూసే కంటే.. ఆ డబ్బులను మన చుట్టుపక్కల నివసించే పేదవారికి సహాయంగా ఇవ్వండి. లేదా ఆ సొమ్ములతో మన ఇంట్లో పనిచేసే సహాయకులకు బియ్యం, పప్పులు, నూనె వంటివి కొని ఇవ్వండి. లేదా మన దేవాలయాల్లో ఏవైనా పూజ, అర్చన చేయించుకొని ఆ ఆలయ పూజారికి దక్షిణగా ఇవ్వండి. అంతేగానీ ఈ నికృష్ఠుడి సినిమాకి మాత్రం వెచ్చించకండి. అంతేకాదు.. ఈ అష్టావకృడి సినిమా చూడమని ప్రోత్సహించే టాలీవుడ్ నటుల సినిమాలకు కూడా ఇదే గతి పట్టించండి.


నోట్:

1. క్రింద ఉన్న హ్యాష్ ట్యాగ్ లను అదే రీతిన వైరల్ చేయండి.. ఏమాత్రం మార్చొద్దు దయచేసి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా హ్యాష్‌ట్యాగ్ పెడితే.. ఆ హ్యాష్‌ట్యాగ్‌లకు విలువ ఉండదు.

2. ఈ పోస్టును కూడా లైక్ చేసి.. వీలైనంతమందికి, వీలైనన్ని గ్రూపుల్లో.. ఫేస్‌బుక్‌లోనూ, వాట్సాప్ లోనూ షేర్ చేసి వైరల్ చేయండి. నాకేవిధమైన గుర్తింపు/క్రెడిట్ ఇవ్వక్కర్లేదు.

#BoycottLalSinghChadha
#Boycott_Laal_Singh_Chaddha

boycott-lal-singh-chadha(hindi)


'లాల్ సింగ్ చడ్డా' మూవీని ఎందుకు బహిష్కరించాలి మౌనికా సుంకర పదునైన వివరణ.⚖️ Possible Watch The Video


Anti Hindu Bollywood(hindi)

🚩🌷స్త్రీని గౌరవించి, పూజించడమే మన సంప్రదాయం🌷🚩

 🚩🌷స్త్రీని గౌరవించి, పూజించడమే మన సంప్రదాయం🌷🚩 


 ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోను మహిళల్ని అణచివేయడం గమనించవచ్చు. వారు సంఘ పరంగా అనేక వివక్షల్ని ఎదుర్కొంటారు. ఇక ఆధ్యాత్మికంగా స్త్రీలకు ఎన్నో విధి నిషేధాలు ఉన్నాయి. కాని, భారతదేశంలో, అందునా ఆర్య సంస్కృతిలో మాత్రం స్త్రీకి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. నిజమైన సంప్రదాయాన్ని పాటించే వారెవరూ స్త్రీని కించపరిచే విధంగా ప్రవర్తించలేరు. అదే భారతీయ సంస్కృతి విశిష్టత. ఆధ్యాత్మిక పరంగా చూసినా కూడా స్త్రీది విశిష్ట స్థానమే. మిగతా దేవుళ్ళు, దేవతలు ఎందరు ఉన్నా ఆదిపరాశక్తిదే అగ్రస్థానం. మొదటి పూజ కూడా ఆ జగన్మాతకే. కుటుంబంలో మరలా తల్లిదే అగ్రస్థానం. ముందుగా ఉన్నాడో లేడో తెలియని దేవుణ్ణి తలుచుకుని, మిగతా వారిని నిర్లక్ష్యం చేయమని ఆర్య జీవన విధానం నేర్పదు. కంటికి ఎదురుగా కనిపించే తల్లిదండ్రుల్నే ప్రత్యక్ష దైవాలుగా భావించమని చెబుతుంది వేదం. వారిలో తల్లికే మొదటి పూజ. 'మాతృ దేవోభవ' - ముందు తల్లికి నమస్కరించిన తరువాత తండ్రికి 'పితృ దేవోభవ'. యజ్ఞ యాగాదులలో, పూజలు, క్రతువులలో పాల్గొనడానికి వివాహితుడు కాని వారికి, భార్యా వియోగం అయిన వారికి అర్హత లేదు. భార్యతో కలిసి ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తేనే పూర్తి ఫలం దక్కుతుంది. అదీ స్త్రీకి ఉన్న ప్రాధాన్యత. 


 ఇవన్నీ ఒక ఎత్తయితే, మనకు ఏ సంబంధం లేని పరాయి స్త్రీని కూడా మాతృ సమానురాలిగా, సోదర సమానురాలిగా చూడమని చెబుతుంది వేదం. పృధ్వీరాజ్‌ ఛౌహాన్‌, శివాజీ వంటి వీరులు కూడా తాము జయించిన రాజ్యంలోని పాలకుల భార్యలను సోదరి సమానంగా భావించి, సకల లాంఛనాలతో వారి రాజ్యాలకు సాగనంపారు. అదీ ఆర్య సంస్కృతి ఆచరణ అంటే.. 


 యత్ర నార్యస్తు పూజ్యంతే 


 రమంతే తత్ర దేవతా|| 



 ''స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటారనేది'' ఆర్యోక్తి. మహిళకి భారతదేశంలో ఇచ్చిన ప్రాధాన్యత అలాంటిది. కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరి ఉండనొల్లదు అనే భావన కూడా మహిళకు ఆర్య సాంప్రదాయంలో ఉన్న విశిష్టతను తెలియజేస్తుంది. ప్రస్తుతం మనం జరుపుకుంటున్న దేవీ నవరాత్రులు కూడా మహిళా శక్తి గొప్పదనాన్ని, మహిమను చాటిచెబుతాయి. స్త్రీని శక్తి స్వరూపిణిగా, పరాశక్తిగా, సృష్టి స్థితి లయలకు కారకులైనవారికి కూడా తల్లిగా పురాణాలు కీర్తిస్తున్నాయి. విశ్వానికి అంతటికీ ఆధారభూతమైన, కారణమైన ఆ మహాశక్తి పురుష రూపంలో ఉండే అవకాశం లేదని రుషుల భావన. ఇంతటి మహావిశ్వాన్ని సృజించి, పెంచి, పోషించి, మరలా తనలోనే లయింపజేసుకొనే అన్ని శక్తుల మూల కారణం స్త్రీ స్వరూపమే. జగమంతటిలో ఉన్న ఇన్ని ప్రాణులకు అవసరమైనవన్నీ ఇచ్చి, చిన్న చీమ నుండి పెద్ద ఏనుగు వరకు ప్రతి పూటా అన్నిటికీ ఆశ్రయమిచ్చి, ప్రాణం నిలవడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసి, తన చల్లని ఒడిలో లాలించి, పాలించి, తల్లి ప్రేమను పంచే ఆ మహాశక్తి ముమ్మాటికీ అమ్మ మాత్రమే అయి ఉంటుంది. ఎందుకంటే అంతటి ప్రేమను పంచి, అనురాగాన్ని కురిపించగలగడం తల్లికి మాత్రమే సాధ్యం. తండ్రి కేవలం బాధ్యత వహిస్తాడు. కాని, తల్లి తన జీవితాన్ని అర్పిస్తుంది. అందుకే విజయదశమికి అమ్మవారిని భావన చేస్తాము. 


 స్త్రీని గౌరవించని, ఆమెకు ప్రాధాన్యమివ్వని ఏ నాగరికత అయినా, సమాజం అయినా మనుగడ సాగించలేదు. ఆమె సహకారం లేకుండా ఏ క్లిష్టమైన పనీ సాధ్యపడదు. ప్రతి ఇంటిలోను ఇంటిని చక్కబెట్టే ఇల్లాలిగా, పిల్లల్ని సంస్కారవంతులుగా, ఉన్నత సమాజ పౌరులుగా మార్చే గురుతరమైన బాధ్యత స్త్రీదే. ఏ ఇంటిలో స్త్రీ మానసిక, శారీరక వ్యధ అనుభవిస్తుందో ఆ కుటుంబం నుండి వచ్చే సంతానం నేరస్తులుగా మారే ప్రమాదం అంత ఎక్కువగా ఉందనేది సామాజిక నిపుణుల పరిశీలనలో తేలిన వాస్తవం. అది ముమ్మాటికీ నిజం కూడా. 


 పత్రికల్లోను, తెర మీద కనబడే రంగుల వలయాల్లో బొమ్మల్ని చూసి, గోల చేస్తూ, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ, నీచమైన ఆనందం పొందే నేటి తరానికి ఈ విలువల ప్రాధాన్యం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆడపిల్ల అంటే వ్యాపార వస్తువు కాదు, మగవారి కోర్కెలు తీర్చే బానిసా కాదు. బస్సుల్లో, రైళ్ళల్లో, రోడ్లమీద, కాలేజీల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ కంటికి కాస్త నదురుగా కనబడే ప్రతి ఆడపిల్లను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉండేవారికి ఈ దేవీ నవరాత్రులలో స్త్రీశక్తి ప్రాధాన్యతను తెలపాలి. ఆడపిల్ల కనపడిందంటే చాలు, ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి, తామేదో గొప్ప వీరప్రేమికుల స్థాయిలో పోజలు కొట్టే వారికి, నిజమైన ప్రేమ రుచి చూడాలంటే అదే అమ్మాయిని మాతృ సమానంగా, సోదరి సమానంగా చూస్తే చాలు. అప్పుడే ఆమె నిజమైన ప్రేమను కురిపిస్తుంది. ఆడదంటే అబల కాదు, అవసరం వచ్చినపుడు ఆమే పరాశక్తిగా మారి దుష్ట సంహారం చేసి, లోక రక్షణ చేస్తుందనే సందేశాన్ని సకల లోకానికి తెలపడమే ఈ దేవీ నవరాత్రుల ముఖ్య ఉద్దేశం. ఈ సందేశం కేవలం భారతదేశానికే కాక, సకల ప్రపంచానికి కనువిప్పు కావాలని ఆశిద్దాం. 

Friday, August 5, 2022

రోజు నవ్వడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

*రోజు నవ్వడం వల్ల కలిగే అద్భుతమైన_ప్రయోజనాలు_*.💥💥

నవ్వు – నవ్వు మనకి చిన్నప్పటి నుంచీ సహజంగానే వచ్చింది. మనం చిన్నప్పుడు నవ్వడం మనకి ఎవరూ నేర్పలేదు. మనం చిన్నప్పుడు ప్రతీదానికి నవ్వుతాం. ఆఖరుకి నిద్రలో కూడా నవ్వుతాం. అది అమాయకమైన నిజమైన నవ్వు. ఆ చూస్తే చాలు చుట్టూ ఉన్నవాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు. అప్పుడు ఆ నవ్వుకి ఎలాంటి షరతులు, పరిధులు లేవు. మనం ఎదుగుతున్న కొద్దీ మిగతా హావభావాలు నేర్చుకుంటాము. నవ్వుని కొన్ని సందర్భాలలో మాత్రమే వాడుతూ ఉంటాము. ఫోటో కోసమో, వేరే వాళ్ళని పలకరించడానికో నవ్వుతాము. చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళు తక్కువ నవ్వుతారు. చిన్నపిల్లలు రోజుకి దాదాపు 400 సార్లు నవ్వుతారు. పెద్దలలో కేవలం 30% మాత్రమే రోజుకి 30 సార్లు నవ్వుతారు.

*నవ్వడం_వల్ల_ఎలాంటి_ఉపయోగాలు_ఉన్నాయో_ఇప్పుడు_చూద్దాం.*

1. నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యానికి హానికరం. మనం నవ్వినప్పుడు, మన శరీరం న్యూరోపెప్టైడ్స్‌ను విడుదల చేస్తుంది. ఈ చిన్న అణువులు ఒత్తిడి ఉపశమనం మరియు ప్రశాంతతను ప్రేరేపించే దిశగా పనిచేస్తాయి. కాబట్టి, మీరు ఒత్తిడికి గురైనప్పుడల్లా చిరునవ్వు నవ్వండి. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాక, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచి మీరు చెయ్యాలనుకున్న పనులు చేసేలా చేస్తుంది.

2. ఒక వ్యక్తి ఒత్తిడికి గురైనప్పుడు, హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు పెరుగుతుంది. వ్యక్తి నవ్వినప్పుడు, ఎండార్ఫిన్ అనే ఫీల్-గుడ్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

3. నవ్వు మన సంబంధాలను మెరుగుపరుస్తుంది. మనం సహజంగా ఎక్కువ నవ్వే వ్యక్తుల వైపు ఆకర్షితులవుతాము. నవ్వినప్పుడు మరింత ఇష్టపడతాము.

4. నవ్వడం మనలను మరింత స్నేహపూర్వకంగా మరియు ఇతరులకు చేరువ చేస్తుంది.

5. మనం నవ్వినప్పుడు, మన శరీరం సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ ఆందోళన మరియు నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది.

6. ఒక బ్రిటీష్ పరిశోధన ప్రకారం, ఒక నవ్వు 2000 చాక్లెట్ తినడం ద్వారా వల్ల మెడదుకి వచ్చిన ఆనందాన్ని ఇస్తుంది. ఈ పరిశోధన కూడా ఒక చిరునవ్వు 16,000 రూపాయలు డబ్బు తీసుకున్నప్పుడు మెదడు ఎంత ఆనందంగా ఉంటుందో దానితో సమానం అని తేలింది. కాబట్టి, మీరు ఏమీ చేయకుండా 16,000 పౌండ్ల డబ్బు లేదా 15 లక్షల రూపాయలు అందుకోవాలని ఉందా? అయితే నవ్వండి. మీ ఒక్క చిరునవ్వు విలువ 15 లక్షల రూపాయలు. అద్భుతం కదా ?

7. మనం నవ్వినప్పుడు, మన శరీరం డోపమైన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ ఈ క్రింది విధంగా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

8. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

9. శ్రద్ధ మరియు ఏకాగ్రతను పెంచుతుంది

10. సృజనాత్మకతను పెంచుతుంది

11. ఎముకల బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది

12. నొప్పి మరియు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది

13. పగటిపూట మనల్ని అప్రమత్తంగా మరియు మేల్కొని ఉంచుతుంది

14. నవ్వు జీవితకాలాన్ని పెంచుతుంది. నవ్వే వ్యక్తుల జీవిత కాలం 7.2 సంవత్సరాలు ఎక్కువ ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది. కాబట్టి, మరింత నవ్వి, ఎక్కువ కాలం జీవించండి.

15. నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. మనం ఎక్కువగా నవ్వినప్పుడు, శరీరంలో తెల్ల రక్త కణాలు మరియు సహజ కిల్లర్ కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ కణాలు అంటువ్యాధుల నుండి మనలను రక్షిస్తాయి.

16. నవ్వు మీరు పని చేసే ప్రదేశాన్ని మార్చేస్తుంది. నవ్వుతూ పనిచెయ్యడం వల్ల మీ సామర్థ్యం పెరుగుతుంది

17. నవ్వడం అనేది ఒక వ్యక్తి యొక్క అందాన్ని సహజంగా పెంచుతుంది . నవ్వు మీ వయసుకన్నా మూడు సంవత్సరాలు చిన్నవారిగా కనిపించేలా చేస్తుందని ఒక పరిశోధనలో తేలింది.

18. నవ్వడం అనేది మానసిక స్థితిని పెంచే వ్యాయామం.

19. నవ్వడం అంటువ్యాధి లాంటిది. మీరు నవ్వినప్పుడు, మిమ్మల్ని చూసే వ్యక్తులు అప్రయత్నంగా నవ్వుతారు మరియు వారు కూడా నవ్వుతూ ప్రయోజనాలను పొందుతారు. కాబట్టి నవ్వడం ద్వారా, మీరు ఇతరులు సంతోషంగా మరియు తక్కువ ఒత్తిడితో ఉండటానికి సహాయం చేస్తారు. నవ్వడం అనేది ఇతరులను సానుకూలంగా ప్రభావితం చేసే గొప్ప మార్గం.

20. నవ్వడం ఒక వ్యక్తిని మరింత ఆకర్షణీయంగా అందంగా చేస్తుంది.

21. ఒక వ్యక్తి నవ్వినప్పుడు గుండె చక్ర యాక్టివేట్ అయ్యి ప్రశాంతతను ఇస్తుందని ఎనర్జీ హీలింగ్ చెప్తుంది. .

22. నవ్వడం శారీరకంగా, మానసికంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా మన జీవితం యొక్క నాణ్యతను మెరుగుపరుస్తుంది.

ఇవి నవ్వు వల్ల కొన్ని ప్రయోజనాలు. మనలో చాలా మంది మనం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే చిరునవ్వు అవసరం అని అనుకుంటారు. ఫేక్ నవ్వు మంచిది కాదు అనుకుంటారు. ఫేక్ నవ్వు కూడా నిజమైన నవ్వు అంత ప్రయోజనకరం అని ఒక పరిశోధనలో తేలింది. మీరు నవ్వినప్పుడు, మీరు సంతోషంగా ఉంటారు. కాబట్టి, నవ్వడానికి ఒక కారణం కోసం వేచి ఉండకండి. మీరు విచారంగా, కోపంగా, చేదుగా, క్రోధంగా, అలసిపోయినప్పుడు, విసుగు చెంది ఉన్నప్పుడు ఎప్పుడైనా నవ్వండి. ఈ చిన్న పని మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

డబ్బు ఖర్చు చేయకుండా మీరు చేయగలిగే సులభమైన వ్యాయామాలలో నవ్వడం ఒకటి.


*మీ_రోజువారీ_జీవితంలో_చిరునవ్వును_చేర్చడానికి_కొన్ని_మార్గాలు_ఇప్పుడు_చూద్దాం*.

1. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు నవ్వుతూ చెయ్యండి . ఇది వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలను పెంచుతుంది.

2. మీరు యోగా చేస్తున్నప్పుడు, వంగిన అవయవాన్ని చూసి నవ్వండి. ఈ స్మైల్ మీ శరీరాన్ని నయం చేస్తుంది మరియు అవగాహనను కొనసాగించడంలో మీకు సహాయపడుతుంది.

3. మీరు ఏదైనా బోరింగ్ పని చేస్తున్నప్పుడు, దాని గురించి నవ్వుకోవడానికి మార్గాలను వెతకండి.

4. మీరు ఇన్నర్ స్మైల్ మెడిటేషన్ ప్రాక్టీస్ చెయ్యవచ్చు. ఇది ఒక ప్రసిద్ధ Taoist practice. ఇది చేసే వ్యక్తి శరీరంలోని ప్రతి అవయవాన్ని చూసి లోపల నవ్వుతాడు. ఈ మెడిటేషన్ ను సులువుగా సాధన చెయ్యడానికి సూచనలు ఇప్పుడు చూద్దాం.

5. సౌకర్యవంతమైన స్థితిలో – కుర్చీలో లేదా నేలపై – వెన్నెముక నిటారుగా కూర్చోండి

6. కళ్ళు మూసుకోండి

7. ఒక నిమిషం డీప్ బ్రీత్ తీసుకోండి మరియు మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలను నెమ్మది అవుతాయి.

8. మెల్లగా నవ్వండి.

9. మీ తల నుండి మొదలుకొని మీ శరీరంలోని ప్రతి అవయవాన్ని చూసి నవ్వడం ప్రారంభించండి.

10. మీ ముఖంలోని ప్రతి అవయవాన్ని చూసి నవ్వండి.

11. మీ శరీరంలోని ప్రతి అవయవం చూసి నవ్వండి.

12. మీ చేతులను చూసి నవ్వండి.

13. మీ కింది దేహాన్ని చూసి నవ్వండి .

14. మీ కాళ్ళని చూసి నవ్వండి

15. మీ శరీరాన్నంతా చూసి నవ్వండి .

16. మీకు ఇబ్బందిగా లేనంత వరకూ నవ్వుతూనే ఉండండి

17. కృతజ్ఞతతో ఒక చిన్న ప్రార్థనతో ఈ సాధనను ముగించండి.

18. అద్దంలో చూసేటప్పుడు మిమ్మల్ని చూసి నవ్వండి

ప్రతి పరిస్థితిలో ఎల్లప్పుడూ నవ్వండి. నవ్వడానికి ఎటువంటి కారణాలు లేదా లక్ష్యాలు  అవసరం లేదు. చిరునవ్వుతో మీ జీవితాన్ని మార్చుకోండి.

Keep స్మిలింగ్.


సేకరణ. మానస సరోవరం 👏