★★★★★★★★★★★★★
1...నేనింకా పరిపూర్ణనంగా లేను ...అని దేనితోనో,,ఎవరితోనో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువ చేసుకుని .ఆ భావనను తలకెత్తుకుని ,,ఇంకా దేన్నో వెదుకుతూనో,,ప్రయత్నిస్తూనే ఉండడం..
★★★★★★★★★★★★★★★★
2...మనలోని,, ఇతరులలోని,,
నెగెటివ్ క్వాలిటీస్ మీద మనం దృష్టి కేంద్రీకరించినట్లైతే మనం నిరంతరం ఎదో ఒకటి,,ఎవరినో ఒకరిని,,
జడ్జ్ చేస్తూనే ఉంటాం..
★★★★★★★★★★★★★★★★
3...మనల్ని మనం సందేహించుకోవడం
అనే కలుపు మొక్కను మన జీవితం
మీద పెత్తనం చేలాయించకుండా ఉండాలంటే,,, ముందు దాన్ని పూకటివేళ్ళతోసహా పెకిలించి పారేయ్యాలి..
★★★★★★★★★★★★★★★★
4...పరిస్తితులెప్పుడూ మనం అనుకున్నట్టు ఉండాలన్న చెత్తరూలు ఎక్కడా లేదు....అలా నమ్మడం అనేది
మనమీద మనకు సందేహాన్ని తెచ్చిపెడుతుంది...
★★★★★★★★★★★★★★★★
5...మానసిక వ్యధ,,,మనోచింతన,,
లేదా దేనిగురించైనా చింతించడమనేది ఏ రకమైన మార్పులు తెచ్చిపెట్టదు...శరీర మానసిక
ఆరోగ్యాన్ని కోల్పోవడం తప్ప...
★★★★★★★★★★★★★★★★
6....మనం ఎక్కువగా నకారాత్మక భావనలతో కాపురం చేస్తే,,,నిరంతరం
కారణాన్ని బయటవెదుకుతూ ,,
ఫిర్యాదులు చేస్తూనే ఉంటాం..
దీని వల్లా మనల్ని మనం ఆనందం లేనిచోటుకు చేరవేసుకుంటాం...
★★★★★★★★★★★★★★★★
7...మనం బయట దేన్నీ నియంత్రించలేం...అలా ప్రయత్నించినా
ఫెయిల్ అవుతాం...అలా ప్రయత్నించాలనుకోవడం అనేది మనల్ని మనం మోసం చేసుకోవడమే...
★★★★★★★★★★★★★★★★
No comments:
Post a Comment