Friday, October 9, 2020

జీవిత సత్యం

జీవిత సత్యం
""""""""""""

👉 జీవితంలో దేనికోసం ఎదురు చూడకు.
ఎదురు చూడడం అంటే జీవితాన్ని,
విలువైన సమయాన్ని వృధా చేయడమే.

👉సంతోషం రెండు కష్టాల మధ్య వచ్చే ఉపశమనం కాదు.

అది కష్టపడి సంపాదించుకునే హృదయ సంస్కారం.

👉 కలలని పరుగులెత్తిస్తే లాభం లేదు,
వాస్తవాలను కలపాలి.

👉శాంతి అంటే రెండు యుద్ధాల మధ్య సంధి కాలం కాదు,

యుద్ధం లేకపోవడమే శాంతి.

👉 ఆనందం ఉన్న చోట వినోదాలు అక్కర్లేదు. వినోదాలు ఉన్న చోట ఆత్మానందానికి తావు లేదు.

👉 సౌకర్యాలు పెరిగాయి, సదుపాయాలు పెరిగాయి, సౌఖ్యాలు పెరిగాయి. సంతోషమే సన్నగిల్లి పోయింది.

👉 ఒకరు మనపై జాలి పడడం మనకు గౌరవం కాదు. సానుభూతులు, సహాయాలతో జీవితం నిండదు.

మనం మనంగా ఉన్నప్పుడే పదిమందిలో గౌరవం.

👉 ఇతరులతో నిన్ను పోల్చుకోవాలని చూడవద్దు.
పోలిక విషం లాంటిది.
వృద్ధిపై బుద్ధి పోనివ్వకుండా అడ్డుకునే దుర్మార్గపు లక్షణం పోలికలో ఉంటుంది.

👉 ప్రపంచం మారదు, మారాల్సింది నువ్వే.

ప్రేమించడం వేరు,
ఒక వస్తువు కావాలనుకోవడం వేరు.

కావాలనుకున్న ప్రేమ స్వార్థం అవుతుంది,
అది బాధను మిగులుస్తుంది.

Source - Whatsapp Message

No comments:

Post a Comment