Tuesday, October 27, 2020

అర్ధము లేని భయాలతో .., ఆందోళనలతో..,

అర్ధము లేని భయాలతో .., ఆందోళనలతో..,

ఏమీ చేయలేమనే నిరాశతో
అనేక అవసరమైన పనులను
చేయకుండా....
అదృష్టాన్ని నిందిస్తూ,

పరిస్థితులను దూషిస్తూ,

పనికిమాలిన సంభాషణలతో జీవితాన్ని గడుపుతారు కొందరు.

సోమరితనము, నిరాశ ,
నిస్పృహ,
పిరికితనము మొదలైన గుణాలు వారి వ్యక్తిత్వంలో కలిసిపోయి ...
ఇంక ఎమీ చేయలేమని భావిస్తూ జీవిస్తారు.

కానీ తమలోనే దాగి ఉన్న పరిష్కారాన్ని ,
మానసిక ఉత్తేజాన్ని తెలుసుకోలేరు.

ఆ అమృత ప్రవాహాన్ని గుర్తించినప్పుడు,

వారు తప్పక విజయం పొందుతారు.

ఎవరూ పుడుతూనే గొప్ప వారిగా జన్మించరు.

గొప్ప గొప్ప విషయాలను సాదించిన వారు కూడా...
నిరంతర ప్రయత్నము,

ఎన్నో ఓటముల అనంతరము, విజయాలు పొందారని గుర్తించాలి.

ఎవరూ ఏ పనినైనా మొదలు పెట్టిన వెంటనే పూర్తి చేయలేక పోవచ్చు ...
కానీ
ఏకాగ్రతతో చేయాలనే తపనతో చేస్తే సాదించగలరు

నమ్మకాన్ని బలంగా
మనలో నింపుకొని మనకు ఎదురయ్యే ఓటమిని విశ్లేషిస్తూ ...

కొత్త పదకాలతో ముందుకు
నడిచే యోచనను అనుక్షణము ఆచరించిన..
విజయం తధ్యం

ఇది అయ్యేది కాదుఅని చెప్తున్నా సరే
ఇంకొక్కసారి ప్రయత్నించు అవ్వచ్చేమో అని ధైర్యాన్నిచ్చేది, వెనకడుగు వెయ్యకుండా వెన్ను చూపకుండా మనసుని,
మెదడుని ప్రోత్సహించేది,
వెయ్యిఏనుగుల బలాన్నిచ్చేది
నీకు నీ మీద ఉండే నమ్మకం..
నువ్వు తప్పకుండా విజయం
సాధించాలన్న నీ ఆశ,నీ ప్రయత్నం ఆపరాదు అన్నది
నీ ధృడవిశ్వాసం...మాత్రమే 👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment