Tuesday, October 13, 2020

భగవద్గీత : కొన్ని విశేషాలు.

భగవద్గీత: కొన్ని విశేషాలు. 🙏 ప్రవీణ్ తాడూరి , జిల్లా కార్యదర్శి, వి హెచ్ పి.
1) భగవద్గీత లో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి.
2) మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయునితో పలికిన మాటలు.
3) ధృతరాష్ట్రుడి కి సంబంధించి ఒకే శ్లోకం ఉంది.
4) సంజయునికి సంబంధించి 41 శ్లోకాలు ఉన్నాయి.
5) అర్జునుడికి సంబంధించి 84 శ్లోకాలు ఉన్నాయి.
6) శ్రీ కృష్ణ భగవానుడి కి సంబంధించి 574 శ్లోకాలు ఉన్నాయి.
7) పురాణాలు 18, ఉప పురాణాలు 18, మహాభారత పర్వాలు 18, భగవద్గీత అధ్యాయాలు కూడా 18..ఇది ఒక అద్భుతం.
8) మహాభారతం లోని భీష్మ పర్వములో యుద్ధకాండము లో ఈ భగవద్గీత శ్లోకాలు మనకు కనిపించే అంశము.
9) అన్నింటికన్నా ఎక్కువ శ్లోకాలు 18వ అధ్యాయములో ఉన్నాయి. మోక్ష సన్యాస యోగము అనే చివరి అధ్యాయములో 78 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో 71 శ్లోకాలు భగవాన్ శ్రీ కృష్ణులవారు పలికినవి.
10) అతి తక్కువ శ్లోకాలు 12వ మరియు 15వ అధ్యాయములో ఉన్నాయి. 20 మాత్రమే.
11) దృతరాష్ట్రుని శ్లోకం తో మొదలయిన భగవద్గీత, సంజయుని శ్లోకం తో ముగుస్తుంది.
12) కృష్ణుడి యొక్క అసలు పేరు గోవింద శౌరి🙏
13) కృష్ణుడి జన్మ వంశం పేరు వృషిని వంశం

ధర్మానికి సంబంధించి వివరణ కావాలి అంటే, నాకు మీ ప్రశ్న తో మెసేజ్ పెట్టండి. 🙏 జై శ్రీ గోవింద శౌరి..జై శ్రీ రామ్..మీ ప్రవీణ్ తాడూరి , జిల్లా కార్యదర్శి, వి హెచ్ పి

Source - Whatsapp Message

No comments:

Post a Comment