,అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ
శరణాగతి అనేది భక్తి త త్త్వానికి పరాకాష్ట. అంటే ఆ పరమాత్మకి పూర్తిగా లొంగిపోవటం.ఇధి రెండు విధాలుగా వుంటుంది.ఒకటి భగవంతుడు నా వాడు.లేదా నేను భగవంతుడికి చెందినవాడను అని.భావం ఏది అయిన శరణాగతి లో మునిగిన వానికి నేను ,నాది అనే భావం వుండదు.శరీరం పట్ల ,ప్రాణం పట్ల ,మనసు పట్ల నాది అనే భావన వుండదు.పరమాత్మకి శరణాగతుడైన భక్తుడు తనకోసం కోరుకునేది ఏది వుండదు.భగవంతుని సన్నిదానం తప్ప.అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అన్న భక్తుడికి ఆ భగవంతుడు అన్నీ తానుయై ,అన్నీ బాగోగులు ఆయనే చూసుకుంటాడు.శరణాగతి పొందాలంటే ముందు భక్తుడు ఎలాంటి వేర్వేరు భావాలు మనస్సు లోకి రాకుండా ఆయన్నే అంటే ఆ పరమాత్మనే శరణు వేడాలి.
భగవంతునికి శరణాగతుడైన వాడు యెప్పుడు నిశ్చింత గా నిర్భయం గా వుంటాడు.మరణ భయం కానీ,దుఖం కానీ,ద్వేషం కానీ యేమి ఉండవు.ఎందుకంటే శరణాగతుడు ఎప్పుడు భగవంతుని చరణాలను ఆశ్రయించే ఉంటాడు.జరేగేది జరిపించేది అంతా భగవంతుడు కనుక ఫలితం కూడా నాది కాదు పరమాత్మదే అనే భావన వలన ఎల్లప్పుడూ నిశ్చింత గా సుఖ దుఖఃలకు అతీతం గా ఉంటాడు.భగవంతుడే సర్వస్వం అనుకోవటం వలన యెటువంటి బౌతికమైన కోరికలను మనస్సుకోరుకోదు ఒక్క భగవంతుని సన్నిహిత్యం తప్ప.ఎటువంటి సందేహాలు ,సంశయాలు ఉండవు ఒక ముక్తి అనే భావన తప్ప.పూర్తిగా భగవంతుని భక్తి లో మునిగిపోయేవారికి ఎలాంటి పరీక్షలు యేమి చెయ్యలేవు ఎందుకంటే ఆ పరమాత్మకి దత్తం అయిన తరువాత భక్తుణ్ని పరీక్షించేందుకు ఏమి మిగిలి ఉండదు.
భగవంతుణ్ని చేరుకోవటానికి చాలా మార్గాలు వున్నాయి జ్ణాననమార్గం,యోగా మార్గం,భక్తిమార్గం ఇలా. అన్ని ఆ పరమాత్మ ని చేరుకొని ముక్తి పొందే మార్గాలే .కానీ అన్నీ మార్గాలలో భక్తి మార్గం చాలా సులభం.ఈ మార్గం లో భగవంతుణ్ని చేరుకోవటం సులువు ఎందుకంటే అంతా ఆయనే చూసుకుంటారు కాబట్టి.భక్తుడికి ముక్తిని ప్రసాదించే భాద్యత ను కూడా భగవంతుడే తీసుకుంటాడు.
రామకృష్ణ పరమహంస గారు అన్నిటింటి లోనూ అందరిలోనూ అమ్మ నే అనగా కాళీ అమ్మవారినే చూసేవారు.ఆ అమ్మ భక్తి పారవశ్యం లో సదా మునిగి తేలుతూ ఈ ప్రపంచాన్నే మరచిపోయేవారు.ఆయన భక్తి కి మెచ్చి అమ్మ స్వయంగా వచ్చి మాటలాడేది ఆటలాడేది .అలాగే అన్నమయ్య తన భక్తి పారవశ్యం తో ఎన్నో పాటలు వ్రాసి పాడి ఆ ఏడుకొండలవాడినే మెప్పించి తన వాడిగా చేసుకొని తరించాడు.గోదా దేవి భక్తిలో తనని తాను మరచి భగవంతుడు తనవాడు అనుకొని తను ముందుగా పూలమాల దరించి బాగుందోలేదో చూసి అప్పుడు భగవంతుడికి సమర్పించేది. గోదా అమ్మవారి భక్తి కి భగవంతుడు పరవశించి అమ్మవారిని పరిణయమాడారు . గజేంద్రుడు తన అనన్యమైన భక్తి తో ఆ విష్ణు మూర్తిని పిలిచిన వెంటనే పరుగెత్తుకొని వచ్చేటట్టు చేసుకున్నాడు.రామాయణం లో గుహుడు,శబరి రాముడి భక్తిలో మునిగి ఆ రాముణ్ణి చరణాలకి శరణాగతులై చరిత్రలో చిరస్తాయిగా నిలిచి పోయారు.ఇలా చెప్పుకుంటే వెళితే భగవంతుని భక్తి లో మునిగి ముక్తిని పొందిన మహనీయులు ఎందరో వున్నారు .
భక్తి మార్గంలో మనసుని సర్వదా ఇష్టదైవం లేదా గురువు మీదికి పోనిచ్చి, ఆ ప్రార్థన పూజ సేవలలో మనసుని వుంచడంవల్ల, కొంతకాలానికి ఆ మూర్తియందే మనస్సు లగ్నమై నిలబడిపోతుంది.ఇష్ట దైవ పటం గాని,విగ్రహం కానీ మనస్సు లో నిలుపుకొని ఎల్లవేళల ధ్యానిస్తుంటే కొన్ని రోజులకి అదే సాధన గా మారి మనస్సు నిలబడి పోతుంది.క్రమేణా మనసులోకి ఇంకా ఎటువంటి ఆలోచనలు రావు. సదా గురువు లేదా భగవంతుని పైనే మనస్సు స్తిరంగా వుంటుంది.దీనికి కావలిసిందల్లా ఆ పరమాత్మ లేదా గురువు పైన అచంచలమైన విశ్వాసం మాత్రమే .
భగవాన్ రమణులను భక్తులు శరణాగతి గురించి అడిగి నప్పుడు ఏమి చెప్పేవారంటే “భగవంతుడు ఉన్నాడని,ఆయన నీకు సర్వం చేసిపెడతాడని గట్టిగా నమ్మినప్పుడే నీవు శరణాగతిని పొందగలవు.నీకు అంటువంటి బలమైన నమ్మకం కలగనప్పుడు భగవంతుడిని అతని దారికి అతన్ని వదిలేసి నీవు ఎవరో తెలుసుకో”. శరణాగతి అంటే భగవంతునకు లేదా గురువునకు పూర్తిగా తనని తను అర్పించుకోవటం,ఇక తనకు ప్రత్యేకించి ఎటువంటి కోర్కెలు లేకపోవటం.ప్రతి చిన్న విషయం లో కూడా ఆ మహా శక్తి కి వశమై విధేయత తో వుండటమే శరణాగతి అని భగవాన్ తరచూ చెపుతూ ఉండేవారు.
మనలని మనం తెలుసుకోవటం అంత సులభం కాదయే. అందుకే అంతా గురువు మీద భారం వేస్తే ఆయనే చూసుకుంటాడు.ఈ విషయం లో భగవాన్ కరుణ అపారమైంది.తనని శరణుజొచ్చిన వారికి అభయం ఇచ్చి చెప్పేవారు “మీ భారం అంతా నా పై ఉంచండి.ఇది ఇట్లా జరగాలి ,అట్లా జరగాలి అని,ఆందోళన చెందకుండా,శాంతంగా ఉండండి.నేనిది చేయనా? నేనది చేయనా? అని అడుగవద్దు.భారమంతా నేను వహించాను కనుక నా ఇష్టానుసారం అన్నీ నేను చూసుకుంటాను.మీరు నాకు అవకాశం ఇవ్వండి.ఇంతే చాలు.ఇక మీద ఏ బాధ,బాధ్యత వుండదు”.
అనేక సందర్భాలలో భగవాన్ తమ భక్తులను మొదటి తరగతి ప్రయాణికులు అనేవారు.ఎందుకంటే “మొదటి తరగతి ప్రయాణికులు తాము దిగవలసిన చోటును ముందుగానే గార్డ్ కి చెప్పి హాయిగా నిద్రపోతారు.తాము దిగవలసిన చోటు రాగానే గార్డ్ వచ్చి లేపుతారు.అలానే ఇక్కడికి వచ్చిన భక్తుల సంగతి అంతే సంపూర్ణ శరణాగతి చెందాలి
Source - Whatsapp Message

No comments:
Post a Comment