లైఫ్‌లో ప్రతీదీ ఎవరూ చెప్పరు. కొన్ని విషయాలు ఇతరుల్ని గమనిస్తూనే మనం నేర్చుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఏదైనా చెప్పినా.. "అది ఆల్రెడీ నాకు తెలుసు" అని అంటే.. తెలిసీ ఫాలో అవకపోతుంటే ఖచ్చితంగా మనల్ని దేవుడు కూడా బాగు చెయ్యలేడు. లైఫ్‌ని గొప్పగా, ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి కొన్ని ఫాలో అవ్వాలి. నా వరకూ రకరకాల వ్యక్తుల్ని గమనించడం ద్వారా, నా అనుభవంలోనూ తెలుసుకున్నవి కొన్ని ఉన్నాయి, వాటిలో చాలా వరకూ నేను స్వయంగా ఫాలో అవుతున్నవే. ఎవరైనా క్వాలిటీ లైఫ్ కావాలనుకుంటే ఫాలో అవండి.
1. మంచి సర్కిల్. మొదట నీ చుట్టూ ఉన్న మనుషులు ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాళ్లు అయి ఉండాలి. Facebook లాంటి చోట్ల రకరకాల బలహీనతలతోనూ, విద్వేషాలు రెచ్చగొట్టే వారూ, అనవసరమైన విషయాల గురించి కాలక్షేపం చేసేవారూ కన్పిస్తుంటారు. నిన్ను నువ్వు ఇతరుల ఆలోచనల చేత పొల్యూట్ అవకుండా కాపాడుకోవాలంటే ఫస్ట్ అలాంటి వాళ్లని unfollow అవ్వు. వీలైతే వారానికోసారి అయినా మనస్సు విప్పి జీవితం గురించీ, సొసైటీ గురించి మెచ్యూర్డ్‌గా ఆలోచించే వారు ఒకరిద్దరితో ఫోన్ ద్వారానో, నేరుగా కలిసో మాట్లాడుతూ ఉండు.
2. ప్రతీ క్షణం నీ ఆలోచనని గమనించుకో. ఈ క్షణానికి నీ ఆవేశం కరెక్టే అన్పిస్తుంది. కానీ అది అవసరం కాకపోవచ్చు. మీరు గమనించి ఉంటారు, అప్పుడప్పుడు నేను చెత్త విషయాల గురించి ఆవేశపడి పోస్టులు పెట్టి.. ఓ అరగంటలోపే వాటిని డిలీట్ చేస్తుంటాను. నా మనస్సుకి నచ్చని వైబ్రేషన్లు అవి. దేని గురించైనా మాట్లాడడానికి ఎంత ఆవేశం చూపిస్తావో, కామ్‌గా ఉండడానికీ అంతే విజ్ఞత చూపించు. సొసైటీనీ, మనుషుల్నీ అర్థం చేసుకుంటే ఎవరి మీదా కంప్లయింట్లు చేయం. ఇదంతా ఓ ప్రవాహం. ఎవరి రోల్ వాళ్లు ప్లే చేస్తూ ఉంటారు. నిజంగా నువ్వు రంగంలోకి దిగి ఏదైనా చెయ్యగలిగితే అది చేయి తప్పించి ఊరికే కూర్చుని ఆవేశపడకు.
3. ముఖ్యంగా మన ఆలోచనలు అబ్జర్వ్ చేసుకుంటే మన వేవ్‌లెంగ్త్ మెరుగుపడుతుంది. ఓ పరిస్థితినీ, సమస్యనీ, జీవితాన్నీ ఒకటి రెండు కోణాల్లో కాకుండా దాని షేప్ మొత్తాన్నీ క్షణాల్లో అర్థం చేసుకోగలం. ఆలోచనల్లో స్పష్టత సాధ్యపడుతుంది. అప్పుడు మనస్సు చాలా స్వచ్ఛంగా మారుతుంది.
4. టైమ్‌కి తిను, టైమ్‌కి పడుకో. భౌతికంగా చూస్తే నీ శరీరానికి తగిన పోషణ, విశ్రాంతి అవసరం. ఆ రెండూ సరిగా లేకపోతే నీ బ్రెయిన్ కూడా సరిగా పనిచెయ్యదు. ఎక్కువగా నెగిటివ్‌గా ఆలోచిస్తుంది. జీవితం పట్ల ఫ్రస్టేషన్ వస్తుంది. సో ఫస్ట్ నీ బయలాజికల్ క్లాక్‌ని కరెక్ట్ చేసుకో. మందూ, సిగిరెట్ మంచిది కాదని తెలుసు కదా, అప్పుడప్పుడు తీసుకుంటే ఏమవుతుందిలే అని ఎందుకు కంటిన్యూ చేస్తావు? నీ గురించి నువ్వు కేర్ తీసుకోపోతే ఎవరు పట్టించుకుంటారు? ఇలా తాగుతూ, తిరుగుతూ కూర్చుంటే నష్టపోయేది ఎవరి లైఫ్? కాస్త ఆలోచించు.
5. తిని కూర్చుంటే.. చెత్త చెత్త ఆలోచనలు చేస్తూ బ్రెయిన్ ఒక్కటే పనిచేస్తుంటే ఇంతింత లావు పొట్టలు పెరుగుతాయి, కాళ్లూ చేతులూ సరిగా పనిచెయ్యవు. ఒంట్లో ఓపిక ఉండదు. సో మంచి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, కొద్దో గొప్పో ఫిజికల్ ఏక్టివిటీ ఉండడమూ అంతే అవసరం. ఇంతకాలం బద్ధకించింది చాలు. కనీసం ఈరోజు నుండైనా మొదలుపెట్టు.
6. ఎదుటి వ్యక్తిని చూసి ఈర్ష్యపడకు. దానివల్ల వాడు ఎదగకుండా ఆగడు, నీ కడుపుమంటా చల్లారదు! ఈర్ష్యపడడం బదులు వాడిలో ఏదైనా మంచి క్వాలిటీ ఉంటే నేర్చుకో. నీ జీవితానికీ పనికొస్తుంది. అందరి నుండి అన్ని మంచి క్వాలిటీస్ నేర్చుకుని తమలోని చెత్త క్వాలిటీలను వదిలేసే వాళ్లు ఖచ్చితంగా గొప్ప లైఫ్ లీడ్ చేస్తారు.
7. మనుషులపై ద్వేషం పెంచుకోకు. ఈ మనుషులు స్వార్థపరులు, అవకాశవాదులూ అనుకోకు. అవసరానికే నీ దగ్గరకు వస్తారు అనుకోకు. కొన్ని వందల కోట్ల మందిలో ఒకరిద్దర్ని చూసి మొత్తం మనుష్య జాతిని స్వార్థపరులుగా అనుకుని నీకు నువ్వు గిరిగీసుకుని ఎవరితో మాట్లాడకుండా phoneలో గేమ్స్ ఆడుకుంటూ కూర్చోవడం అస్సలు కరెక్టే కాదు. మన జీవితం మొత్తం ఈ మనుషుల మధ్యనే బ్రతకాలి. మనుషుల పట్ల నీ దృక్పధం మార్చుకో.
8. తరచూ మనుషులతో మాట్లాడు, నవ్వు, అన్కండిషనల్గా అవతలి వ్యక్తిలో నీకు ఏదైనా నచ్చితే అప్రిషియేట్ చేయి, నువ్వు కోల్పోయేదేదీ లేదు. ఇంకా గౌరవించబడతావు.
Source - Whatsapp Message

No comments:
Post a Comment