Thursday, October 15, 2020

గురువులు ఎక్కడో ఉన్నారా ? మన మధ్యే ఉన్నారా ? మరి ఎలా కనిపిస్తారు ?

🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹
గురువులు ఎక్కడో ఉన్నారా ?
మన మధ్యే ఉన్నారా .
మరి ఎలా కనిపిస్తారు ?

సత్య శోధన కోసం
నువ్వు చేసే శోధన చూసి ......
ఎరుక కోసం ఎదురు చూసిన నిదుర మరచిన
నిశి రాత్రులు చూసి....
తత్వం కోసం తపిస్తున్న తపన చూసి .....
మామూలు మనిషిగా తరలి వస్తాడు .....
నిజ తత్వాన్ని చెపుతాడు ....

వాస్తవమనే వసంతాన్ని మోసుకు వస్తాడు ..
జన్మ జన్మల నుండి .....
అజ్నానమ్ అనే తుప్పు పొరలతో
మూసిన మనసు కిటికీ తెరుస్తాడు ......
కిటికీ ఆవల ఉన్న .......
దేదీప్య మానంగా
కోటి దివ్వెల వెలుగులా
ప్రకాశిస్తున్న.....
నిన్ను నీకూ పరించయం చేస్తాడు ...
ఒక్కసారి
నిన్ను నీవు తెలుసుకున్నాక ..

నువ్వు నేను వేరుకాదు ...
నేనే నువ్వు ...
నువ్వే నేను అంటూ ...
జ్నానాగ్నితో అజ్నానాన్ని తగులబెట్టి ......
శిక్షణ తో విచక్షణ కు మెరుగులు పెట్టి

నీలో ఉన్న విశ్వం ....
విశ్వంలో ఉన్న నువ్వు .......
సత్యం శాస్వితమ్ అని ....
నేను అనే అహం తొడుగును తొలగించి ...
జగత్ మిధ్య నువ్వు సత్యం అని జోల పాడి .
జన్మల చెర నుండి విముక్తి నిస్తాడు
ముక్తికి మార్గం ఇదే నంటూ మరలి పోతాడు .......

నీవు ఎవరో తెలుసుకోడానికి ప్రయత్నించు తపించు తపన పడు...ఆ గురువు నీ కోసం తప్పక వస్తాడు నీకు మార్గం చూపడానికి నీ జీవితం ఏంటి చెప్పడానికి..దైవ సత్యం ఎన్నో అనుభవాలు నిజాలు చూస్తారు.

గురువులకు నస్కారాలు...
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment