Tuesday, October 27, 2020

నిత్యజీవితంలో ధ్యానం

🌧️ నిత్యజీవితంలో ధ్యానం🌧️
🔺 ధ్యానం అన్నది చేసి ముగించేది కాదు.
మీ జీవితంలో అనుక్షణం జీవించేది.
నడకలో నిద్రలో కూర్చున్నప్పుడు మాట్లాడేటప్పుడు వింటున్నప్పుడు అదొక రకమైన వాతావరణంతో అల్లుకుని వుండేది. విశ్రాంతి పొందిన వ్యక్తి అందులో ఉంటాడు.
గతాన్ని వదిలి పెడుతున్న వ్యక్తి ధ్యానంలో మిగులుతాడు.
అతను నిర్ణయాలను బట్టి నడుచుకో డు.
ఆ నిర్ణయాలే మీ మూఢవిశ్వాసాలు, నీ కలలు, మీ భయాలు తక్కినవన్నీ అవే.
సంక్షిప్తంగా నువ్వు అక్కడ ఉంటావు.
🔺 మీరు సంతోషంగా ఉండడాన్ని ఎంచుకోలేదు కాబట్టి మీకు ధ్యానం అవసరం.
మీరు సంతోషంగా ఉండడానికి ఎంచుకుంటే మీకు ఎలాంటి ధ్యానం అవసరం లేదు. ధ్యానం ఔషధ ప్రాయం.
మీ ఆరోగ్యానికి ఔషదం అవసరం.
బుద్ధులకు ధ్యానం అవసరం లేదు.
ఒకసారి మీరు ఆనందాన్ని ఎంచుకోవడం ప్రారంభిస్తే సంతోషంగా ఉండాలని మీరు తీర్మానించుకుంటే అప్పుడు ఎలాంటి ధ్యానం అవసరం లేదు.
అప్పుడు ధ్యానం దానంతట అదే వస్తుంది. సంతోషంగా ఉండడానికి సంబంధించిన పని ధ్యానం.
ధ్యానం సంతోషంగా ఉన్న వ్యక్తిని నీడలా అనుసరిస్తుంది.
అతను ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అతను ధ్యానంలో ఉంటాడు. ఓషో
🔺🌧️🔺🌧️🔺🌧️🔺🌧️🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment