Sunday, October 25, 2020

ఒకరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఎంతో దుఃఖం తో నిండివున్న ఒక భక్తుడు

😭ఒకరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఎంతో దుఃఖం తో
నిండివున్న ఒక భక్తుడు

🏚️ తన ఇంట్లోతనకు ఎంతో ఇష్టమైన దైవ రూపం తో చిత్రించి ఉన్న క్యాలెండర్ నీ తదేకంగా చూస్తు నిద్రలోకి జారుకున్నాడు

😣అప్పుడు ఆ భక్తుడికి నిద్రలో ఒక కల వచ్చింది ఆ కలలో

🔱తనకు ఎంతో ఇష్టమైన తను రోజు పూజించే దైవం ఎంతో దిగాలుగా కూర్చొని కనిపిస్తాడు

😣అప్పుడు ఆ భక్తుడు తన కళ్ళ ముందు కూర్చున్న ఆ దైవానికి నమస్కారం చేసి

స్వామి నేనంటే ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తున్న కాబట్టి
దిగులుగా ఉన్నాను మరి మీరు
దైవం కదా మరి మీరు ఎందుకు
దిగులుగా ఉన్నారు స్వామి అని ప్రశ్నిస్తాడు

🔱దానికి బదులుగా ఆ దైవం ఇలా అంటాడు
నా భక్తుడు కష్టాల్లో ఉంటే నేనెలా సంతోషంగా ఉండగలను అందుకే దిగులు
గా ఉన్నాను అంటాడు

😣అప్పుడు ఆ భక్తుడు ఎవరు స్వామి ఆ భక్తుడు అని ప్రశ్నిస్తాడు

🔱అప్పుడు ఆ దైవం ఇంకెవరో కాదు నాయన నువ్వే అని అంటాడు

😣అప్పుడు ఆ భక్తుడు ఎంతో సంతోషించి ఆ ఆనందం తో నేన అని అంటాడు

🔱ఆవును నువ్వే నువ్వు కష్టాల్లో ఉన్నావని నిన్ను చూసి వెల్దాం అని వచ్చాను అంటాడు

😣అయితే మీరు దైవం కదా
మీ దగ్గర ఎంతో శక్తి ఉంది కదా ఆ శక్తి తో మీరు నాకు వచ్చిన కష్టాలను తిర్చేస్తే అప్పుడు నాకు కష్టాలు ఉండవు మీకు ఈ దిగులు ఉండదు కదా స్వామి అంటాడు

🔱అప్పుడు ఆ దైవం ఇంకెక్కడి శక్తి నాయన మిమ్మల్ని సృష్టించి నప్పుడే నా శక్తినంతా కర్మ సిద్ధాంతానికి ఇచ్చేశాను ఇప్పుడు నాదగ్గర బూడిద కూడ లేదు
ఇప్పుడు నీ విషయంలో ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను
అంటాడు

😣అప్పుడు భక్తుడు నోట్లో నీళ్ళు మింగుతూ అదేంటి స్వామి అలా అంటున్నారు మీరు ఉన్నారనే కదా నా కష్టాలను తిరుస్తారనే కదా నేను నాకున్న సమయం లో పావొంతు సమయాన్నీ మీకు
దేవాలయాల కడుతు మీ దేవాలయాల చుట్టు తిరుగుతూ మీ విగ్రహరాలకు
అభిషేకం చేసి పసుపు కుంకుమ తో పూలతో అలంకరణ చేసి మీకు కొబ్బరికాయలు కొట్టి మీకు హారతి పళ్ళం పట్టి గంటలు గంటలు మీ నామ స్మరణ చేసి మీ హుండీలో నా సగం జీతం వేసింది ఇప్పుడు మీరే ఇలా అంటే ఎలా స్వామి అన్ని మరచి పోయారా ఎంటి అని అడుగుతాడు

🔱అప్పుడు ఆ దైవం అందుకే కదా నాయన నేనిక్కడకు వచ్చాను

అయినా నువ్వు కూడా నీ భక్తితో ఆనంద పడుతున్నానని చూస్తు ఊరుకున్నా అయిన నువ్వు నాకు సమర్పించింది ఏమున్నది నువ్వు సమర్పించిన
ఆ వస్తువులన్నీ నేను సృష్టినవే కదా అంటే నవే కదా ఇంకేంటి
అంటాడు

😣దానికి భక్తుడు సరే స్వామి అందరి లాగే అందర్నీ చూసి నేనుకూడ చేశాను ఇప్పుడు మీరే ఎదో ఒకటి చేసి నన్ను గట్టెంకిచాలి అంటాడు

🔱అప్పుడు దైవం చెప్పాను కధయ్య నేనేమీ చేయలేనని

😣అప్పుడు భక్తుడు అయితే నా కష్టాలు తీరే పరిష్కారమే లేదా అంటాడు

🔱దానికి దైవం ఎందుకు లేదు కచ్చితంగా నీ కష్టాలు తీరే పరిష్కారం ఉన్నది అదే ధర్మ మార్గం అంటాడు

😣అప్పుడు భక్తుడు ధర్మ మార్గం అంటే ఏమిటి స్వామి అంటాడు

🔱దానికి దైవం సత్యాన్ని తెలుసుకొని సదా సత్యాన్ని మరచి పోకుండా జీవించడమే ధర్మ మార్గం

😣అప్పుడు భక్తుడు అయితే నేను ఇన్ని రోజులు జీవించిన మార్గం ధర్మ మార్గం కదా స్వామి అంటాడు

🔱అప్పుడు దైవం ఇలా నీకు సత్యమే తెలియదు ఇంకా ధర్మం ఏమి తెలుస్తుంది ముందు సత్యాన్ని తెలుసుకో ధర్మం అదే అర్థం అవుతుంది అంటాడు

😣అయితే నేను సత్యాన్ని తెలుసు కోవడం ఎలా స్వామి అంటాడు

🔱దానికి దైవం.. నువ్వు ముందు నీ మనస్సుని నిర్మలం చేసుకో దానికి మార్గం ధ్యానం
ఎప్పుడైతే నీవు ధ్యాన సాధన చేయడం ప్రారం భిస్తావో

అప్పుడు నీ చెంచలమైన మనస్సు నిర్మల మౌతుంది
ఎప్పుడైతే మనస్సు నిర్మల మౌ తుందో నీలోని బుద్ధి వికసిస్తుంది ఆ వికసించిన బుద్ధితో నీ శరీరం తో పాటు ఉన్న ఆత్మను గుర్తించ గలుగు తావు అప్పుడు నువ్వు గుర్తించిన ఆత్మయే నువ్వు అని
శరీరంతో కేవలం కలసి ఉన్నావని నీకు అర్థం అవుతుంది

😣అప్పుడు భక్తుడు నేను ఆత్మ అని తెలుసు కుంటే ఏమౌతుంది స్వామి అంటాడు

🔱అప్పుడు దైవం నువ్వు ఆత్మ అని తెలుసుకున్నాక
నీ ఒక్కడివే ఆత్మ కాదని ఇక్కడున్న ప్రతి మనుషులతో పాటు భూమి మీద నివసిస్తున్న
ప్రతి జీవి ఆత్మయే అని తెలుస్తుంది తరువాత తరువాత ఈ అత్మలన్ని కూడ ఆ పరమాత్మ
నుండి వచ్చిన పరమాత్మ బిందువు లు అని అర్థం అవుతుంది ఆ తరువాత నీలోనే అందరినీ అందరిలోనూ నిన్ను చేసుకొని
నీవే ఆ పరమాత్మ అహం బ్రహ్మాస్మి వని తెలుసు కుంటావు
ఈ విషయ ఆధారం తోనే కర్మ సిద్ధాంతం రూపొందించ బడింది నీవు ఎవరికి ఏమి ఇచ్చినా తిరిగి అది నీ దగ్గరకు వస్తుంది ఎందుకంటే అందరిలో నీవే ఉన్నావు కనుక
ఈ విషయాన్ని నీవు తెలుసుకున్న తెలుసుకోక పోయిన ఈ కర్మ సిద్దాంతం పనిచేస్తూనే ఉంటుంది
అని చెప్పి దైవం ధ్యానం లోకి వెళ్లిపోతాడు

😣అప్పుడు భక్తుడు కొంత సేపటి తరువాత
ధ్యానం నుంచి లేచిన దైవం తో
ఏమిటి స్వామి తమరు కూడ ధ్యానం చేస్తారా అని అడుగుతాడు

🔱అప్పుడు దైవం ధ్యానం చేయడానికి నేనేంటి నేవెంటి అందరం చేయవలసిందే ధ్యానం లో దొరికే ఆ బ్రహ్మానందం ఇంకెక్కడ దొరకదయ్య అయిన అన్ని మీకే వదిలేసాను కదా ఇంకా నాకు పనేమున్నది నిత్యం ధ్యానం లో ఉంటూ సాక్షిగా ఉండడం తప్ప అని చెప్పి మౌనం గా ఉండిపోతాడు

😌అప్పుడు భక్తుడు కొంత సమయానికి నిద్రనుండి లేచి ధ్యాన సాధన చేయడం ప్రారంభిస్తాడు ధ్యాన సాధన ద్వారా సత్యం తెలుసుకొని
ధర్మ మార్గం లో ఉంటూ హాయిగా జీవిస్తాడు
😁🌈🌹🦚💘💐

Source - Whatsapp Message

No comments:

Post a Comment