విజయదశమి శుభాకాంక్షలతో శుభోదయం.
మనిషి మారితే సత్యం తెలుస్తుందని ధర్మము, వస్తువుని తెలుసుకుంటే సత్యం తెలుస్తుందని విజ్ఞాన శాస్త్రము అంటాయి. పరమ సత్యానికి ఎవరి మీద అత్యంత ప్రేమ వుందో, వారికే ఆ సత్యోదయం కలుగుతుంది. సత్యము చెప్పాలి అన్నప్పుడు, ఆ సత్యం, సత్యం చెప్పినవాడి మీదే కాకుండా, వినిన వాడి మీద కూడా ఆధారపడి ఉంటుంది.
నిన్ను నిందించే వాడిని ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకోవాలి. ఎందుకంటే అతను ఎప్పుడూ నీ లోపలి చెత్తను నీకు చూపిస్తూ ఉంటాడని కబీర్ అంటాడు. కానీ మనల్ని మెచ్చుకునే వారే ఎప్పుడూ మనతో ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాము. మిమ్మల్ని ఎవరైనా తిట్టినప్పుడు, అలా తిట్టడం వలన మీ కోపం బయటకి వస్తే, మీరు అతనికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అతను మీకు ఒక అవకాశం ఇచ్చాడు కనుక.
ఇంద్రియాలని వశపరచుకోవాలి అనే ఆలోచన మనకు ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు ఒక సంఘర్షణ, యుద్ధము, పొట్లాటలకు సంబంధించిన ఆలోచనలు మనకి వస్తాయి. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలని అర్ధం చేసుకోవడం. పోరాటం చేసేవాడు ఎప్పటికీ మనసుకు యజమాని అవలేడు.
Source - Whatsapp Message

No comments:
Post a Comment