Tuesday, October 27, 2020

ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగించినట్లే, అవసరం లేని ఆలోచనలను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూనే ఉండాలి ! అదే ధ్యానం

💐ఎప్పటి కప్పుడు తప్పదు 💐

_*జీవనంలో అశాంతికి గురిచేసే విరుద్ధ భావాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చున్నంత సేపూ ఇతర ఆలోచనలు ఆపితే ప్రయోజనం లేదు. జీవనంలో అప్పటికి అవసరం లేని తలపులను, అవసరానికి మించిన ఆలోచనలను గుర్తించి తొలగించుకునేందుకు ధ్యానం ఒక అభ్యాసంగా ఉపయోగపడాలి. చంటి పిల్లలకు భవిష్యత్తులో చేయవలసిన పెళ్ళి గురించి ఆలోచించటం అవసరానికి మించి ఆలోచన. రేపు ఏ కూర చేయాలని రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంటే తీరా వంట చేసే సమయంలో నిద్ర పోవాల్సివస్తుంది. ధ్యానంలో ఆలోచనలు ఆపేది ఎందుకంటే జీవితంలో వాటిని నిరోధించడం నేర్చుకునేందుకే ! వ్యవసాయం చేసేటప్పుడు నిరంతరం పంటను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు కలుపును తొలగిస్తేనే దిగుబడి ఉన్నతంగా వస్తుంది. ప్రారంభంలో కలుపు తీసి, తీరా పంట చేతికొచ్చే వరకు కలుపును పట్టించుకోకుండా ఉంటే దిగుబడి తగ్గిపోతుంది. ధ్యాన ప్రక్రియ కూడా అంతే ! ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగించినట్లే, అవసరం లేని ఆలోచనలను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూనే ఉండాలి ! అదే ధ్యానం !!

👏💐👏💐👏💐👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment