Tuesday, October 13, 2020

చిరునవ్వు - మన జీవితం..

🍀🌸💖💚🧚‍♂💚💖🌸🍀

🌸 చిరునవ్వు - మన జీవితం.. 🌸

🌸 చిరునవ్వు ప్రతి ఒక్కరికి, ప్రతిఒక్కరిలో సహజమైన స్తితి.. చిరునవ్వులో ఉన్న గొప్పదనం ఏమిటంటే చిరునవ్వుకు చిరునవ్వే సమాధానం అవ్వుతుంది మినహా ఇంకో సమాధానం ఏమన్న ఉంటే అది హృదయ పూర్వక సమాధానం మాత్రమే..
చిరునవ్వు ఉన్నచోట సమృద్ధి సమృద్ధిగా ఉంటుంది అనేది నిర్వివాదాంశం...

🌸 చిరునవ్వు మన జీవితంలో ఎంత ప్రాముఖ్యత వహిస్తుందంటే.. మన మోములో చిరునవ్వు ఉంటే మనల్ని... అంత చిరునవ్వు తో పలకరిస్తారు.. చిరునవ్వుతో సమాధానం ఇస్తారు... చిరునవ్వు తో ఆనందాలను పంచుకుంటారు... అంటే మనిషికి మనిషికి చిరునవ్వు చక్కటి మాధ్యమం.. ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎంత ముస్తాబైన చిరునవ్వే మిగతా అలంకారాలన్నీకి వెలుగునిచ్చే ఆభరణం అంటే అతిశయోక్తి కాదేమో...

🌸 నవ్వు, చిరునవ్వు వల్ల లాభాలు

ఒకసారి నవ్వితే మన మోములో 15000 కండరాలు ఉత్తేజం పొందుతాయి...

నవ్వు ఉన్నచోట భయానికి చోటు కష్టం...

చిరునవ్వుతో ఉన్నవారిని ధైర్యవంతులుగా చూస్తుంది సమాజం..

ఎలాంటి సమస్యైన చిరునవ్వుతో స్వీకరిస్తే సమస్య అవకాశం గా మార్చుకోవచ్చు..

ఉదయం నిద్రలేవగానే మనల్ని మనం చిరునవ్వుతో పలరించుకుంటే రోజంతా ఆనందంగా ఉంటాం...

చాలా మంది గొప్పవారు ఆభరణాల కన్నా చిరునవ్వునే ఆభరణంగా ఉంచుకోవడానికి కారణం చాలా సమస్యలు చిరునవ్వు ఉంటే సమస్యలు దూరంగా వెళ్లిపోవడం అనుభవమవ్వటవల్లే అనేది అసలు కారణం..

చిరునవ్వుతో ఉన్న వ్యక్తి మాటలు అంతా వినడానికి సిద్ధంగా ఉంటారు..

చిరునవ్వు ప్రతి వ్యక్తిలో ఉన్న స్వయం ప్రేమకు నిదర్శనం..

చిరునవ్వు మనం చేసే ప్రతి ప్రయత్నానానికి ఇంధనం..

చిరునవ్వు మనలోని శక్తిని ప్రదర్శించే మహత్తర శక్తి...

చిరునవ్వు ఉన్నవారిలో సమస్యలు సాధించే క్రమంలో అందరిని కలుపుకునే గుణం వారి శక్తి... అనేది అసలు కారణం..

చిరునవ్వుతోనే డాక్టర్స్ సగం రోగం నయం చేస్తారు...

చిరునవ్వు అందరికి శక్తినిస్తుంది అందుకే అది శక్తివంతమైన ఆయుధంగా చూడవచ్చు ఉపయోగించవచ్చు...

చిరునవ్వు మన అంతర్గత శక్తి.. ఆ శక్తి గురించి తెలుసుకుంటే మనకు చాలా సమస్యల నుండి విముక్తి...

🌸 ఇక్కడ చెప్పినవన్నీ మన జీవితంలో చూసేవే ఆచరిస్తే లేదా ఉపయోగిస్తే.. జీవితం ఓ పండగ అనడంలో సందేహం లేదు...

.🌸🌸🌸

🍀🌸💖💚🧚‍♂💚💖🌸🍀

Source - Whatsapp Message

No comments:

Post a Comment