Tuesday, October 13, 2020

సనత్కుమారుని బోధలు

భాగవతము
శ్రీగురుభ్యోనమ
🕉🌞🌏🌙🌟🚩

సనత్కుమారుని బోధలు

ఒక పని చేస్తున్నప్పుడు ప్రారంభములో ఎంత శ్రద్ధ ఉంటుందో రోజూ అలాగే పది, ఇరువది, ముప్పది సంవత్సరాలు గూడా చేయుచుండినచో దానిని శ్రద్ధ అందురు. శ్రద్ధ వలన నీలో ఉన్న ప్రజ్ఞకు ఒక స్పూర్తి, ఒక ప్రమాణము ఉంటుంది. శ్రద్ధ లేకపోతే గ్రహించే బలము గూడా తగ్గుతుంది. కూర్చోవడములో, నడవడములో, పలకరించడములో, వస్త్రధారణలో శ్రద్ధ అవసరము.


ఎపుడూ ఒకే రకమైన శ్రద్ధ ఉంటే కళ పెరుగుతుంది. మనిషిలో శ్రద్ధను బట్టి వికాసము ఉంటుంది. శ్రద్ధను బట్టి పరిసరాలలో ఉన్న తత్త్వమును గ్రహించడములో మన అర్హత పెరుగుతుంది.


శ్రద్ధ తన స్వరూపమే అనియు, దానిని జీవుడెంతగా ఆరాధించునో అతడు అంతగా తన స్థితి చెందుననియు భగవద్గీత లో కృష్ణుడు చెప్పెను.

🕉🌞🌏🌙🌟🚩

ఆచార్య సద్భావన

తనను చూసి తానే జాలిపడటం అనారోగ్యకరం. అది ఆనందాన్ని పొందనీయక నిరోధిస్తుంది. ఆధ్యాత్మిక చైతన్యపు జాగృతి వలన కలిగిన ఆనంద మాధుర్యాన్ని చవి చూసిన వారిని ఎటువంటి కష్టాలు, కన్నీళ్ళు, దురదృష్టాలు, వైపరీత్యాలు కదపలేవు. భగవంతుని మరిచిపోవడమే గొప్ప ఆపద, తాను దివ్యత్వపు వారసుడినని విస్మరించడమే పెద్ద దురదృష్టం. మేధస్సు కానీ, లెక్కలు కట్టే బుద్ధిగానీ భగవంతుని పట్టుకోలేదు. భక్తి విశ్వాసాలతో నిండి ఉన్న హృదయం, స్వార్థ చింతన లేని హృదయమే తాను భగవంతుని చేత సదా పరి రక్షించబడుతున్నాననే సంగతిని గ్రహిస్తుంది.


అందుకై మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.

శ్రీమన్నారాయణా!

మా జీవితాల్ని అణకువగా, శుద్ధంగా తీర్చిదిద్దుకునేలా అనుగ్రహించుము, మీ సత్య వీక్షణం అందుండి ప్రసరించి నలుదిశలా వ్యాపించనిమ్ము, శాశ్వతమైన మీ ఉనికికి మా హృదయాలను జోడించనిమ్ము, మీ యొక్క విశ్వవ్యాప్త భావజాలంతో మా ఆలోచనలను జోడించనిమ్ము, మీ ఇచ్ఛానుసారముగా మమ్మల్ని ప్రవర్తించనిమ్ము, మమ్మల్ని మీ ఉపకరణంగా మలచి కార్యాచరణాన్ని గావించుకొనుము.

"సర్వేజనా సుఖినోభవంతు"

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

🕉🌞🌏🌙🌟🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment