Saturday, October 10, 2020

శాశ్వత సుఖం

శాశ్వత సుఖం
ఈ ప్రపంచంలో జీవించడానికి ఒక పరిధి అవసరం ...! కానీ సాధనలో పరిధిలేకుండా జీవించమంటారు ... ఎందుకు???
నేను జీవించటానికి దేనితో పనిలేదని అనుకునేవాడు సుఖిస్తాడు.
ఎందుకంటే నా జీవితానికి ఎంతకావాలి ? ఏమికావాలి ? అనుకుంటున్నామంటేనే పరిధిని నిర్ణయిస్తున్నామని అర్థం.
ఆ పరిధే ముక్తిని దూరం చేస్తుంది.
మన ఇంటికి ప్లాన్ వేయించుకుని ఎంతో కర్తృత్వంతో ఊగిపోతాం.
కానీ అప్పటికే ఊరి వెలుపల ఉన్న ఏరు, కొండకు ఎవరు ప్లాన్ వేశారో ఆలోచిస్తే అర్థమవుతుంది.
విచారణమార్గంలో మన నిమిత్తం ఏమిటో అర్థమైతే పరిధికి అతీతమైన శాంతి వస్తుంది.
సముద్రం చేరిన నదికి ప్రవాహం, ప్రత్యేక ఉనికి ఉండనట్లే, మనసు స్వరూపం తెలిసిన తరువాత ఏ గుణానికి ఇక విలువ ఉండదు.
ఈ ప్రపంచం నాకు ఏమీ ఇచ్చింది ? అన్న ప్రశ్నకు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు ఇలా చెప్పారు..
"ఇల్లు, డబ్బు పేరుతో కొంత సుఖం, కావలసినంత దుఃఖం వస్తాయి.
ఆ కొద్ది సుఖానికి ఆశపడి ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటున్నాం.
ఆ కొద్ది సుఖాన్ని వద్దనుకుంటే ఏ కష్టంతో పనిలేని శాశ్వత సుఖం మనతోనే ఉంటుంది !"

🌸శుభమస్తు🌸
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment