Saturday, October 10, 2020

జీవాత్మ ఒక దీపం

జీవాత్మ ఒక దీపం*
దీపంలో పూర్తిగా కిరోసిన్‌ నింపి వత్తిని సరిచేసి, గ్లాసు పెట్టి ఒక సురక్షితయైన స్థానంలో ఉంచి దాన్ని వెలిగించినచో అది వెలుగు నివ్వడం ప్రారంభిస్తుంది. కొంత సేపటికి వెలుగు తగ్గిపోతుంది. కిరోసిన్‌ తగ్గిపోయి, ఇంకొంత సేపటికి గ్లాస్‌ పూర్తిగా నల్లబడిపోతుంది. ఈ స్థితిలో దీపం వెలుగుతుందా లేదా అనేది తెలియదు. ఈ నలుపు ఎక్కడ నుండి వచ్చిందనేది ప్రశ్న. బయట నుండైతే రాలేదు కదా! ఇది ఆ వత్తి యొక్క నలుపు కాలి కాలి కిరోసిన్‌ తగ్గి వత్తి వెలుగు తగ్గిపోయింది. ఇదే పరిస్థితి జీవాత్మది కూడా. శరీరమనే తొడుగును ధరించి ఆత్మ ఈ కర్మక్షేత్రంలో మొట్టమొదట పాత్ర అభినయంచడం ప్రారంభించినపుడు సదా ప్రధానస్థితిలో ఉండేది ఆత్మ అనే బ్యాటరీ పూర్తి శక్తివంతంగా ఉండేది. బయట వాతావరణం కాంతితో నిండుగా ఉండేది.
ఆత్మ ప్రకాశంతో ఈ నలువైపులా వ్యాపించిన కాంతి, మనసు, దృష్టి, వాక్కు మరి కర్మల ద్వారా ఇతరులకు చేరుతూ ఉంటుంది. కాని వెలుగుతూ వెలుగుతూ దీపంలోని వత్తి, తన పొగ ద్వారానే తన చుట్టూ వాతావరణాన్ని నల్లగా చేస్తున్నట్లు కర్మలు చేస్తూ చేస్తూ మానవాత్మ నెమ్మదిగా శక్తిని కోల్పోతుంది. బలహీనమైన ఆత్మ తన శరీరం, సంబంధాలు, పదార్థాలపై ఆసక్తి చూపుతుంది. ఈ ఆసక్తి కామ, క్రోధాల వంటి ఇతర వికారాలకు జన్మనిస్తుంది. ఇలా కలియుగంలో అంతిమ జన్మకు చేరుకుంటూ ఆత్మ ప్రకాశం నశించి వాతావరణం పతితమై, శక్తి అనే నూనె పూర్తిగా ఇంకిపోతుంది. ఆత్మ యొక్క ఈ శిధిలావస్థకు భగవంతుడు కాని. ఏ ఇతర ఆత్మలు కాని బాధ్యులు కారు. పాత్రను అభినయిస్తూ ఆత్మ అంతిమ జన్మలో అలసట నిరాశ్ర పరాధీనతల్లో బంధింపబడుతుంది.
ఈ హీన స్థితి నుండి ఆత్మలను ఉద్ధరించేందుకు తండ్రియైన పరమాత్మ అవతరించ వలసి వస్తుంది. ఆయన సాకార శరీరాన్ని ఆధారం చేసుకొని సాకార సృష్టిలో తల్లి, తండ్రి, శిక్షకుడు, సద్గురువ్ఞ మొదలైన సర్వ సంబంధాల పాత్రను అభినయిస్తారు. జ్ఞానం రాజయోగమనే శక్తులతో ఆత్మ అలసటను తొలగించి మరల రాబోయే కల్పంతో పాత్ర నభినయించేందుకు తాజాగా తయారు చేస్తారు. ప్రస్తుత సమయం అదే భాగ్యవంతమైనది. స్వయంగా భగవంతుడు జ్ఞానమనే నేతినిపోసి జ్యోతిని ప్రజ్వలింప జేస్తున్నారు.
🌹🌹🌹🌹🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment