Saturday, October 10, 2020

జీవితం... సార్థకత... రెండూ అత్యంత సంక్లిష్టమైన పదాలు.

జీవితం... సార్థకత... రెండూ అత్యంత సంక్లిష్టమైన పదాలు.

జీవితం.... నాలుగు కాళ్ళతొ నడిచి... నాలుగు కట్టెలతో నలుగురు మనుషులు మోసేవరకు ప్రయాణించేది.

ఈ ప్రయాణంలో.... జీవితానికి సార్థకత అనే పదాన్ని జోడించడం మన ప్రయాణపు ఆఖరి మజిలీ.

ఆ సార్థకతకి నిర్వచనం మనం చేసే పనులే నిర్ణయిస్తాయి.
రేపు పోతామో,లేదో,
ఈ రోజు బ్రతుకున్నాం..
ఆనందంగా ఉండు..
సాయం చేసే వీలుంటే చెయ్యి,
సాయం కావాలంటే అడుగు,
ఉన్నంతలో తిని.ఉన్నతంగా ఉండు,
మాట మంచిగా చేసుకో,
మనసుని శుభ్రంగా ఉంచుకో!
బ్రతుకు,బ్రతికించు,హాయిగా జీవించు!
గందరగోళంగా పరిగెత్తడం కన్నా,
నమ్మకంగా నడవడం మంచిది..
ఎందరినో కేవలం అనుసరించడం కన్నా,
అందరి నుండి ఎంతోకొంత నేర్చుకోవడం మంచిది!

లోకం మెప్పు కోసం బతికే వారికి మేకప్ అవసరం కానీ,
తనకు నచ్చినట్టు తాను బతికే వారికి మేకప్ తో పనిలేదు...
అందుకే, లోకం కూడా వారిని వింతగా చూస్తుంది.!
బలవంతుడు అంటే శరీర సౌష్టవం కాదు,
మానసికంగా బలం ఉన్నవారే బలవంతులు...
భయం భద్రతను ఇవ్వదు బలహీన పరుస్తుంది..
విలువ లేని మనిషి వద్ద నిలవకండి.!
విలువ కలిగిన మనిషిని వదలకండి.!!👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment