Saturday, October 10, 2020

గెలిచిన వ్యక్తి దగ్గర అనంతమైన ఆనందం వుండవచ్చను కాని.. ఓడిపోయిన వ్యక్తి దగ్గర అంతులేని అనుభవం వుంటుంది ఆ అనుభవం అంకెల్లో చెప్పలేని అవకాశాలను చూపిస్తుంది ..

జీవితం.. ఒక్కొక్కసారి వెక్కిరించినట్టుగా ఉంటుంది.. జీవితం.. ఒక సున్నాలాగా ఉంటుంది.. ఆ వెక్కిరింతకు బదులుగా ఏదైనా చేయాలని ఉంటుంది.. ఆ సున్నాకు ముందు పెద్ద సంఖ్య ఉంటే బాగుండు అనిపిస్తుంది.. కానీ జీవితం ఒక పెద్ద పజిల్.. అది ఏ నిమిషం ఎలా మలుపు తిరుగుతుందో..ఏ మనిషిని ఎలా కబళించి వేస్తుందో తెలియదు..ఎవరిని ఎలా అందలం ఎక్కిస్తుందో అంతకంటే తెలియదు..

ఒక్కొక్కసారి దిగులుగా ఉన్నా..మరొకసారి ఎంతకాలం ఉంటామో తెలియని జీవితానికి ఎందుకు ఇంత వన్నెలు అనిపిస్తుంది..ఏదో సాధించాలనే తపనలో...ఏదీ లేకుండా పోతుంది.. జీవితం.. చాలా చిరాకుగా ఉంది.. నచ్చలేదు..

జనాభా లెక్కల్లో ఉన్నాం..కానీ జనాభా గుర్తించే స్థితిలో లేము..అందరిలో ఒకరిగాఉన్నాం..కానీ ఎవరికీ దొరకనంత స్థితిలో ఉన్నాం..ఎవరికి ఎవరూ సంబంధంలేకుండా.. ఎవరికీ కానంత దూరంలో.. తెలియని స్థితిలో ఉన్నాం..జీవితం.. పరిహసించే ఒక ప్రతిబింబం..జీవితం అంటే ఊపిరేనా..మరింకేదీ కాదా..ఏమో😢జీవితాన్ని.. ఆనందంగా.. ఉన్నదానిలో సంతోషంగా జీవించాలి..

ఓడిపోయినప్పుడు నేను ఓడిపోయాను అని చెప్పడానికి సిగ్గుపడకండి..
ఎందుకంటే గెలిచిన వ్యక్తి దగ్గర అనంతమైన ఆనందం వుండవచ్చను
కాని..
ఓడిపోయిన వ్యక్తి దగ్గర అంతులేని అనుభవం వుంటుంది ఆ అనుభవం అంకెల్లో చెప్పలేని అవకాశాలను చూపిస్తుంది ...
ఆ అనుభవం ఆకాశం అంత ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment