Sunday, October 11, 2020

"బాహ్యీకరణలు" "ఇబ్బందులు"

🟢 పితామహ పత్రీజీ 03-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 03-09-2020🔸

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

"బాహ్యీకరణలు" "ఇబ్బందులు"

" ఒక ఆలోచన సమత్వం పొందటానికి గాను అనేకానేక భౌతిక విషయాల ప్రభావం అవసరమౌతుంది. విత్తునాటటానికి దాని పంట పొందటానికి ఒక జన్మ లేక అనేక జన్మల అంతరం ఉండవచ్చు కాని ఈ ప్రపంచంలోనికి విడుదల చేయబడిన ప్రతి ఆలోచన యొక్క ఫలితం మనిషి పొంది తీరుతాడు."

"మనిషి బాహ్య ప్రపంచంలోని సమయం మరియు ప్రదేశంతో సంబంధం లేకుండా ఆలోచనలు చేస్తాడు, వాటిని విడుదల కూడా చేస్తాడు. భూమి పైన పరిస్థితులు అనుకూలిస్తేనే ఆలోచనలు భౌతికమైన పనులుగా, వస్తు విషయాలుగా మరియు పరిస్థితులుగా బాహ్య ప్రపంచంలో ప్రకటితం కాగలవు."

" బాహ్యీకరణ జరగటానికి ముందు అనేక ఇబ్బందులను సర్థుబాటు చేసుకోవలసి ఉంటుంది, కొన్నిసార్లు ఈ ఆలోచన యొక్క సర్థుబాటుకు కావలసిన సాధనాలు మరియు తగిన పరిణితి పొందటానికి చాలా సమయం పడుతుంది."

" ఇంకా, శరీర- నేను (the doer) యొక్క సుదీర్ఘమైన గతం ఒకటి ఉంది, దానిలో తను ఇంకా ఏ కారణాల యొక్క సమతుల్యత కోసం వేచి ఉన్నాడో వాటికింకా తనకి పరిహారం దొరకలేదు. ఇంతేకాకుండా, ఇతరుల విరుద్ధమైన ప్రయోజనాల కారణంగా, ఆలోచనలు బాహ్యీకరణను వ్యతిరేకిస్తాయి."

"ఇతరుల ఆలోచనలను పరిగణలోనికి తీసుకున్నప్పుడు, ఒక మనిషి విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు తదనుగుణంగా ఎన్నో రెట్లు గుణించబడతాయి."

" వర్తమానం అనేది గతం నుంచి పట్టి తెచ్చుకున్న వ్యక్తీకరణమే. సంఘటనలు యొక్క అసంఖ్యాక సంచితం పెరిగిపోయినప్పుడు, సమయం మరియు ప్రదేశం కలసి వచ్చినప్పుడు, అవి దృశ్య ప్రపంచం లోనికి విరుచుకు పడతాయి మరియు ఈ సంఘటనలు ఎవరినయితే ప్రభావితం చేస్తాయో వారికి ఆనందం లేదా దుఃఖం కలుగజేస్తాయి."

"ఒక మనిషి గత బాహ్యీకరణలకు, బాహ్యీకరణం ద్వారా మూల్యం చెల్లించేతవరకు అతనికి సంఘటనలు ఎదురుపడుతూనే ఉంటాయి, అతని ఎదుగుదలకు అవసరమైన పాఠాలు నేర్చుకుంటాడు, కొంత మొత్తంలో జ్ఞానాన్ని పొందుతాడు, దాని ద్వారా ఈ సంఘటనలకు కారణమైన ఆలోచనలను శారీరక + మానసిక, మానసిక మరియు జ్ఞానసంబంధమైన స్థితులలో సమత్వ పరచుకుంటాడు."

" మనిషి తన ఆలోచనలను ఉన్నపాటున, తక్షణమే సమత్వ పరుచుకోలేడు ; కొన్ని జన్మలలో కూడా సాధ్యం కాదు. అందుమూలంగా, తను నేర్చుకోవలసి ఉంటుంది; తన జీవిత అనుభవాల ద్వారా మరియు ఇతరుల జీవిత అనుభవాలను పరిశీలించటం ద్వారా కూడా నేర్చుకుంటాడు."

"మనిషికి ఎదురయ్యే భౌతిక సంఘటనలు తన స్వంత ఆలోచనల యొక్క బాహ్యీకరణలు కావచ్చు, కాకపోవచ్చు కాని శారీరక + మానసిక సంఘటనలు (Phychic events), సంతోషం మరియు దుఃఖం కలిగించే భావనలు, తన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన తన స్వంత ఆలోచన యొక్క ఫలితమే."

💖 ఎస్ పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment