🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️
🌸కర్మ సిద్ధాంతము🌸
🌹కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే।
భగవద్గీత- సాంఖ్య యోగము
భావము : కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు.
భారతీయ ఆధ్యాత్మికత రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. కర్మ, పునర్జన్మ. రెండూ ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధము కలిగి ఉంటాయి. కర్మ సిద్ధాంతము అనేది భారతీయులలోని ముఖ్య నమ్మకం. హిందూమతం, బౌద్ధమతం, సిక్కుమతం, మరియు జైనమతం ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి.
కర్మ (సంస్కృతం: कर्म - "act, action, performance") అంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసిన పని. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది.
కర్మ సిద్దాంతము ప్రకారము పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని తీసుకోవచ్చు. గతజన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మనిచేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు.
కర్మ సిద్దాంతాన్ని నాస్తికులు, భౌతికవాదులు నమ్మరు. అబ్రహమిక్ మతాల (క్రైస్తవ మతం, ఇస్లాం మతం) ప్రకారం మనిషి చేసే ప్రతి చర్య భగవంతుని సంకల్పాలే. భగవంతుడే వారి చేత చేయించాడని వారి నమ్మకం. విధిరాతనే వారు కర్మగా భావిస్తారు. కానీ హిందూ మతం ప్రకారం మనుషులు మంచి, చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు, కాని వాటి ప్రతి ఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది. అంటే మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయం (fate) గా పొరబడతారు.
ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతముగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితము. తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో నిజం లేదు. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు. పునర్జన్మల పై నమ్మకం, స్వర్గప్రాప్తి, నరకభీతి లాంటివి కూడా కర్మవాదం కిందకి వస్తాయి. ఉదాహరణకు నేను గత జన్మలో ఏదో పాపం చెయ్యడం వల్లే ఇప్పుడు ఈ స్థితికి దిగజారాను అని కొందరు అంటుంటారు.
త్రివిధ కర్మలు
👉🏻సంచిత కర్మలు : పూర్వ జన్మలో చేసినవి
👉🏻ప్రారబ్ధ కర్మలు : ఈ జన్మలో చేసేవి
👉🏻ఆగామి కర్మలు : ముందు జన్మలలో చేసేవి
సంచితం (భూతకాలానికి సంబంధించినది), ప్రారబ్ధం (వర్తమానానికి సంబంధించినది), ఆగామి (భవిష్యత్తునకు సంబంధించినది) ఈ మూడింటిని త్రివిధ కర్మలు అంటారు.
మరొక విధమైన త్రివిధ కర్మలు
👉🏻 నిత్యం : ప్రతిరోజూ చెయ్యాల్సినవి
👉🏻 నైమిత్తికం : అప్పుడప్పుడు చేసేవి
👉🏻 కామ్యం : ఫలితాన్ని ఆశించి చేసేవి
నిత్యం (ప్రతినిత్యం ఆచరించవలసినవి. ఉదా: సంధ్యావందనం), నైమిత్తికం (ప్రత్యే సందర్భాలలో ఆచరించవలసినవి. ఉదా: శ్రాద్ధ కర్మలు), కామ్యం (ఒక ప్రత్యేక ఫలితాన్ని ఆశించి చేసేవి. ఉదా: పుత్రకామేష్టి) ఈ మూడింటినీ కూడా త్రివిధ కర్మలనే అంటారు.
👏👏👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment