Sunday, October 11, 2020

మన జీవితాన్ని ప్రేమిద్దాం...జీవితం అంటేనే అనుభూతుల కూర్పు... రోజువారి అనుభూతుల కొరకు చేసే ప్రయత్నం... ఆ అనుభూతులూ ఎలాంటివైన..

మన జీవితాన్ని ప్రేమిద్దాం... 🌸

🌸 జీవితం అంటేనే అనుభూతుల కూర్పు... రోజువారి అనుభూతుల కొరకు చేసే ప్రయత్నం... ఆ అనుభూతులూ ఎలాంటివైన..
స్వీకరించటం చేస్తూనే ఉంటున్నాం... ఈ భూమిపై జీవిస్తున్నా ప్రతి జీవి చేసే పని అదే... అంటే అనుభూతులను పోగేసే కార్యక్రమంలో ఎదుగుదల కోసం ప్రయత్నం చేసినా చేయకున్న రోజు గడిచేసరికి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే... అనుభూతుల బ్యాంక్ లో ఎన్ని జమాచేసుకున్నాం.. అనేది అర్ధమౌతుంది.. ఇదే పునాది..

🌸 జీవితంలో రోజు అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం.. కొన్ని పూర్తి చేస్తాం.. కొన్ని సరిచేసుకుంటాం.. కొన్ని వాయిదా వేస్తాం.. ఇలా జరిగితే జీవితం ఒక ప్రయోగాశాల అవుతుంది... కానీ జరిగేది ఇదే ఒప్పుకోవడం అనగానే వంకలు వెదుకుతాం.. అనుభూతి అంటే ఒక తేనే చుక్కకోసం తేనెటీగలు చేసే ప్రయత్నం అవి ఏ రోజు ప్రయత్నం ఆపవు... అలాగే మనము.. ఇదంతా ఎందుకు చేర్చిస్తున్నాం అంటే మానవ జీవితం అంత అద్భుతమైనది... ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుంటే మన జీవితం గురించి మనం ఎందుకు ఆరాటపడుతున్నాం అర్థమవ్వడం కోసం మాత్రమే..
తేనెటీగలకు తేనెను స్వీకరించటం వచ్చు.. భూమి మీద ఉన్న ప్రతి చెట్టు,మొక్క..
వృక్ష జాతి మొత్తం పూలు పూస్తాయి వాటిల్లో తేనె ఉంటుంది... తేనె ఉంటుంది కాబట్టి తేనెటీగలు ఉన్నాయా..
తేనెటీగలు ఉన్నాయి కాబట్టి వాటి ఆహారం కోసం వృక్షాజాతి సృష్టించినారా...

🌸 ఇదంతా ప్రకృతి నియమమం కావచ్చు లేదా మనకోసం ఏర్పాటు చేయబడ్డ పాఠశాల కావచ్చు... ఇక్కడ ప్రతి ఒక్కరు చేస్తున్న పని మాత్రం ఒక్కటే అనుభవాల లేదా అనుభూతుల సేకరణ..
అంత ప్రతి జీవి చేస్తున్న పని అదే... ఇక మన జీవితాన్నీ ఎందుకు ప్రేమించాలి..? అనేదే అసలు ప్రశ్న.. దీనికి అందరిదగ్గర సమాధానాలు ఉంటాయి... కారణం ఈ భూమి మీద ఎవరి ప్రశ్నపత్రం వారిదే అ0దుకే వారి వారి సమాధానాలు వారికి ఉంటాయి... కానీ అందరినుంచి వచ్చే సమాధానాలు ఒక దానిలో ఇమిడిపోతాయి అదే ఎదుగుదల కోసం... ఎదుగుదల కోసం కాకపోతే ఇంకేమి లేదు... ఎదుగుదలకు ప్రేమకు సంబంధం ఏమిటి...??

🌸 ఎదుగుదల కోసం కాకపోతే ఇంకా దేనికి అనేది
భౌతికం... మరి ఆధ్యాత్మిక0 ఏమిటి...? మనల్ని మనం తెలుసుకోవడమా...? మనం వచ్చిన పని తెలుసుకోవడమా..? ఇవన్నీ కూడా మనల్ని పోరాటం లేదా తెలుసుకునే ఆరాటం వైపు తీసుకెళతాయి... అంటే జ్వలించటం... కానీ మనం చేసే పనిని తేనెటీగ లాగా అంకితభావంతో చేస్తే... చేసే పనిని ప్రేమిస్తూ చేస్తే... తేనె పట్టు తయారవుతుంది... ప్రేమించడం మొదలు పెడితే అక్కడ ఆరాటం, పోరాటం ఉండవు ఉండేది ప్రేమోక్కటే..

🌸 ప్రేమ నుండే అన్ని పుట్టుకొచ్చాయి... ప్రేమలోనే ఒదిపోతాయి.. మనల్ని నిలిపేది నడిపేది ప్రేమ మాత్రమే... విశ్వజనీనమైన ప్రేమలో ఎన్ని రకాలైన ప్రేమలు ఉన్న అందులో ఇమిడిపోతాయి అనేది వాస్తవం.. అంటే ఒకో పువ్వులో ఒకో రకమైన పరిమళం ఉన్నప్పటికీ తేనె మాత్రం అదే..
ప్రతి జీవిలో ఒకో లక్ష్యం ఉన్నప్పటికీ చేరేదీ,మారేది పూర్ణాత్మగా ఎదగడం కోససమే... అంటే మనం తేనెటీగ ఉంటే మనకు రాణిఈగ పూర్ణాత్మ...
మానవునిగా ఉంటే మన స్వయం మనల్ని పూర్ణాత్మగా మార్చే శక్తి అనుకుందామా...?
ఇదంతా మన ఎదుగుదలలో భాగమే... ఇదంతా ప్రకృతి మనకిచ్చిన సరళమైన దారి..
దారిలో మాజిలీలు ఇంకో పోస్ట్ లో...

Thank you...🌸🌸🌸

🍀🌸💖💚

Source - Whatsapp Message

No comments:

Post a Comment