Saturday, October 10, 2020

ప్రశ్న: “లంఖణం పరమౌషధం” అంటారు ..

🙏ప్రశ్న: “లంఖణం పరమౌషధం” అంటారు .. ”🙏

🌷 పత్రీజీ :

‘లంఖణం’ అంటే నిరాహారంగా ఉండడం .. లంఖణాలు మూడురకాలు :

1. “శారీరక లంఖణం”
2. “వాచిక లంఖణం”
3. “మానసిక లంఖణం”

శారీరక లంఖణం కన్నా “వాచిక లంఖణం” శక్తివంతమైనది మరి ఆరోగ్యదాయకమైనది;

దీనికన్నా శక్తివంతమైనది మరి విశేష ఆరోగ్యదాయకమైనది “మానసిక లంఖణం” .. అంటే “ధ్యానం”.

కాబట్టి లంఖణాన్ని కేవలం భౌతిక దేహానికి మాత్రమే పరిమితం చెయ్యకుండా ‘మౌనం’ ద్వారా మాటలనూ .. ‘ధ్యానం’ ద్వారా మనస్సునూ .. శూన్యపరచుకుంటూ అభ్యాసం చెయ్యాలి.
అప్పుడే మరి ఆ లంఖణం “పరమౌషధం” అవుతుంది.

💐💐💐💐💐💐💐💐

Source - Whatsapp Message

No comments:

Post a Comment