Thursday, January 27, 2022

మానవుడు కూడా ప్రకృతి ధర్మాన్ని విడువ రాదు...

" త్యాగేనైకే అమృతత్వ మానశుః "

త్యాగం అంటే ధన త్యాగం, వస్తు త్యాగం కాదు, త్యాగము అనేది ప్రకృతి ధర్మము...
దేహానికి, అన్నీ త్యజించడం ధర్మము, జలమును, భుజించిన ఆహారమును, పీల్చి న గాలిని వదలటం వలనే దేహం ఆరోగ్యం గా ఉంటుంది.
ఈ ప్రకృతి లో గడ్డి పోచకూడా తన కోసం జన్మించదు, వృక్షాలు తమ కోసమై ఫలాలను తయారు చేసుకోవటం లేదు...
సూర్యచంద్రులు తమ కోసమై వెలుగు నందించటంలేదు...
ప్రకృతి అంతా త్యాగమే అంతర్లీనంగా నిండి ఉంది...

మానవుడు కూడా ప్రకృతి ధర్మాన్ని విడువ రాదు...
దుర్గుణ త్యాగమే సరియైన త్యాగము...
ధన త్యాగము మాత్రమే కాదు, కామ క్రోధ మద మాత్సర్యాలను వదిలితే దివ్యత్వాన్నిపొందగలుగుతారు...

నీకు ఏది ప్రీతి కరమైనదో దానినే ఇతరులకు అందివ్వాలి,
ఇతరులు యే విధంగా గౌరవిస్తే నీకు ఆనందమో, నీవు వారిని ఆవిధంగా గౌరవించాలి,
ఇతరులు ఏది చేస్తే తప్పని భావిస్తావో అది నువ్వు ఎప్పుడు చేయకుండా ఉండాలి...

సేకరణ

No comments:

Post a Comment