Thursday, January 27, 2022

నేటి మంచిమాట. అద్భుత శక్తే మన మనస్సు!

నేటి మంచిమాట.

అద్భుతమైన శక్తి మనలోనే ఉంచుకుని,
మనం ఏదో సాధించాలని ఎక్కడెక్కడో వెతుకుతున్నాము.
ఆ అద్భుత శక్తే మన మనస్సు!

మనకు కావాల్సినంత సుఖసౌభాగ్యాలను మన మనస్సే ఇవ్వగలదనే రహస్యం
మీకు తెలుసా?!
ఆ రహస్యం తెలుసుకుంటే
మనం ఏదైనా కాగలము,
విజేతగా నిలవగలము!

తాము చేయదలచుకున్న పనిపై ఆకర్షణ పెంచుకుని అటువైపే సాగిపోవాలి.
ఉదాహరణకు ఒక అయస్కాంతం తీసుకుని పది రకాల వస్తువుల మధ్య పెట్టినా,
అది కేవలం ఇనుప వస్తువులనే ఆకర్షిస్తుంది.

అదే విధంగా మన జీవితంలో మనం సాధించవలసిన విషయంపై ఆకర్షణ పెంచుకోవాలి.
అది పరస్పర ఆకర్షణకు దారి తీస్తుంది.
మధ్యలో బంగారం, మణులు, మాణిక్యాలున్నా వాటి జోలికి అయస్కాంతం పోనట్టే,
మనం కూడా ముందు
మన లక్ష్యం వైపు దూసుకుపోవాలి.
మధ్యలోని ఆకర్షణలకు లొంగిపోకూడదు!

సూక్ష్మంగా (మానసికంగా) మనం బలీయమైన కోరికతో, సంకల్పంతో చేసే ఆలోచనలు (థాట్స్) అనుభూతి (ఇమాజినేషన్) ఖచ్చితంగా...
మన స్థూలమైన జీవితాన్ని నిర్ణయిస్థాయి. ఫలితం వెలువడేందుకు కాస్త సమయం తీసుకున్నా...
పొరపాటున కూడా సంశయంలోకి వచ్చి బలహీన మరియు ప్రతికూల సంకల్పాలు చేయకుండా జాగ్రత్త వహించాలి!

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment