Thursday, January 27, 2022

ఇది ఒక కధ. కాని నిజం మరియు ఆసక్తికరమైనది.

ఇది ఒక కధ.
కాని నిజం మరియు ఆసక్తికరమైనది.

ఒక రోజు ఒక పంచె కట్టుకుని భుజాలమీద శాలువ కప్పుకొని ఉన్న ఒక పెద్ద మనిషి భగవద్గీత పారాయణం చేస్తూ చెన్నై సముద్రపు ఒడ్డున కూర్చుని ఉన్నారు.
అదే సమయంలో ఒక యువకుడు ఆయన దగ్గరగా వచ్చి "ఇంకా మీరు పాత చింతకాయల పచ్చడి లా ఉన్న ఇలాంటి పుస్తకాలు చదువుతున్నారా...! అదీ ఈ నవీన యుగంలో. మనం చంద్రుడు మీదకు వెళ్ళాం. ఇంకా మీలాంటి వారు రామాయణం, మహాభారతం పుస్తకాల దగ్గరే ఆగిపోయారు.

అప్పుడు, ఆ పెద్దమనిషి ఆ యువకుడు ని అడిగారు, " బాబూ.. గీత గురించి నీకు ఏమి తెలుసు "? అని

అప్పుడు, ఆ యువకుడు దానికి సమాధానం చెప్పకుండా ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు, ఏం జరుగుతుంది / వస్తుంది ఈ భగవద్గీత చదివితే. నేను విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్ లో పరిశోధనలు చేస్తున్నాను, నేను ఒక శాస్త్రవేత్త ను.... ఈ భగవద్గీత అంశం ఉపయోగం లేనిది.
ఆ పెద్దమనిషి, ఆ యువకుడి మాటలకు నవ్వుతూండగా.. రెండు పెద్ధ కార్లు అక్కడ కు వచ్చి ఆగాయి. ఒక కారు లో నుండి కొంతమంది Black Commandos దిగారు, రెండవ కారు లోంచి ఒక సైనికుడు దిగాడు. ఆ సైనికుడు దిగీ దిగగానే, వినయంగా సెల్యూట్ కొట్టి, కారు వెనుక తలుపు తెరిచి పెట్టుకున్నాడు. ఆ భగవద్గీత పారాయణం చేస్తూన్న పెద్దమనిషి, మెల్లిగా వెళ్ళి కారులో కూర్చున్నారు.
అప్పుడు ఆ యువకుడు విస్మయం చెంది, ఈయన ఎవరో గొప్ప వ్యక్తి లా ఉన్నారు అనుకుని, కారు దగ్గరకు పరుగెత్తి, ఆ పెద్దమనిషి ని "అయ్యా తమరు ఎవరు" అని అడిగాడు.

ఆ పెద్దమనిషి చాలా ముందుగా, "నేను విక్రమ్ సారాభాయ్ ని" అన్నారు.
ఆ కుర్రవాడు కి 440 వోల్టుల విద్యుత్ఘాతం తగిలినట్టయింది.
ఇంతకీ ఆ యువకుడు ఎవరో తెలుసా?... ఆయనే డాక్టర్ అబ్దుల్ కలాం గారు.

ఆ తర్వాత కలాం గారు భగవద్గీత, రామాయణం, మహా భారతం పుస్తకాలు చదివారు. దాని ఫలితంగా ఆయన, ఇటుపైన మాంసాహారం ముట్టకూడదు, అని ఒట్టు వేసుకున్నారు. ఇదంతా కలాం గారు తమ ఆత్మ కథ లో రాసుకున్నారు. అంతే కాకుండా ఆయన మాట్లాడుతూ రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ పురాణాలు కాదు, శాస్త్రాలు. అంతే కాకుండా ఇవి మన దగ్గర పుట్టడం, భారతీయులకు గర్వకారణం, మరియు గొప్ప వారసత్వ సంపద అని రాశారు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment