Wednesday, June 29, 2022

మంచి మాట..లు(27-06-2022)

సోమవారం :-27-06-2022
ఈ రోజు AVB మంచి మాట..లు

ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం పాము శిల అయితే పాలు పోస్తాం ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం
ఎలుక
రాతిది వినాయకుడి ముందు ఉంటే పూజిస్తాం

తల్లి తండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి నమస్కారం చేస్తాం...,ప్రాణాలతో ఉంటే వుద్దాశ్రమం లో వది లేస్తాం చని పోయిన వాడికి భూజాన్ని అందిస్తాం బతికి ఉన్న వాడికి చేయూత నివ్వం.

రాయిలో
దైవత్వం ఉందని తెలుసుకున్నాం , మనషి లో మానవత్వాన్ని గుర్తించలేక పోతున్నాం...
జీవం లేని వాటిపై ప్రేమ ఎందుకు ప్రాణం తో ఉంటే ద్వేషం ఎందుకు
ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు గాని,దయచేసి ఎవరికీ కీడు చేయకండి ఎందుకంటే వారి మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది 🤝..

మిత్రమా !
బోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చకోకు...

ఈ క్షణమే నీది..నీవు ఏదైనా. ఎవరికైనా
మంచి చేయాలన్నా ఈ క్షణమే నీది..,,,,నీవు ఏమి చేసినా మంచిదైనా.. చెడు అయినా.. మంచి చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.... చెడు చేస్తే మనసు ఆందోళన పడుతుంది .
నిన్న నీది కాదు.. గడిచిపోయింది కాబట్టి.. రేపు నీది కాదు..ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ క్షణమే నీది !

మనతో ఏ
బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు

నీవు ఎంత మంది
హృదయాలను గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు మనకంటే మంచివారు ఇంకెవ్వరూ ఉండరు .

నీవు ఎప్పుడూ
బాధ పడుతుంటే నీకు బ్రతుకు భయపెడుతుంది అదే నీవు ప్రతీ క్షణం నవ్వుతూ ఉంటే ఆనందం తల వంచుతుంది.మీ ముందు

.నీవు
నిర్ణయం తీసుకున్నాక ఆ దారి ఎలా ఉన్నా గమ్యం* చేరాల్సిందే... నిర్ణయం తీసుకునేముందే.. ఒకటికి రొండు సార్లు ఆలోచించుకోవాలి
సేకరణ ✍️AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment