'ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్'కు నాలుగు మార్గాలు...
సంతోషం అనేది మానసిక శాంతిగా పేర్కొం ర దలైలామా, భారతదేశంలో నివాసం ఏర్పర చుకున్న ఈ టిబెటన్ బౌద్ధ గురువు 'ద ఆర్ట్ ఆఫ్ 'హ్యాపీనెస్' అనే పుస్తకాన్ని రచించారు. పరిపూర్ణ నడిపిస్తుంది. సంతోషానికి ఆయన సూచించే నాలుగు మార్గాలివి..
• లేబుల్స్ తీసేయాలి: మనుషులందరూ ఒక్కటే. పక్కవారి కన్నా మనం భిన్నం అని భావించకూడదు. నన్ను నేను బౌద్ధుడిగానో, దలైలామాగానో, నోబెల్ పురస్కార గ్రహీతగానో తలచను. వీటిలో ఏది అనుకున్నా బందీగా మారిపోతాను. అందుకే వీటన్నింటినీ వదిలేసి ఈ భూమి మీదున్న కోటాను కోట్ల మందిలో నేనూ ఒకడిననే ఎరుకతో ఉంటాను.
• ఆశను కోల్పోవద్దు: మానవుడి జీవిత లక్ష్యమే ఆనందం. భవిష్యత్తులో ఏమవుతుందనే విషయం ఎవరికీ తెలియదు. నేడు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, అంతా బాగా జరుగుతుందనే విశ్వాసమే మనల్ని ముందుకు:
• భౌతికానందానికి మించి...: పువ్వును చూడగానే మనసు మురిసిపోతుంది. సంగీతం: వినగానే గాల్లో తేలిపోతాం... కాసేపటికి ఆ విషయాన్నే మరచిపోతాం. ఇలా వస్తువుల వల్ల వచ్చే ఆనందం తాత్కాలికం, ధ్యానంతో సాధించే ఆనందం శాశ్వతం,
• కృతజ్ఞత, దయతో..: ఉదయం నిద్ర లేవగానే విలువైన మానవ జీవితాన్ని వృథా చేయకూడదని తీర్మానించుకోవాలి. నలుగురికి ఉపయోగకరమైన పనులు చేస్తూ, అందరితో కరుణతో మెలగాలి. కృతజ్ఞత, దయ ఉండాలి..
No comments:
Post a Comment