Saturday, June 25, 2022

భక్తితో పూజలు చేయటం వల్ల కోరికలు ఫలిస్తాయా ?

💖💖💖
💖💖 "260" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼

"భక్తితో పూజలు చేయటం వల్ల కోరికలు ఫలిస్తాయా ?"


"ఎవరికైనా అనుకున్నవన్నీ జరగవు. ఒకవేళ జరిగినా అవి అనుకున్న సమయంలో జరగవు. కాబట్టి నెరవేరిన వాటినే అనుకుంటే సరిపోతుంది. నాకేం ఫర్వాలేదన్న నిశ్చింతను ఇచ్చేదే నిజమైన భక్తి. చింతను మిగిల్చేది భక్తి కాదు. అది స్వార్థం అవుతుంది. ఏ దేవతార్చనైనా మనని ఈ విశ్వచైతన్యంలో లయం చేసుకొని ఆ ఆనందాన్ని మనకి అందించేందుకే ! పారమార్థిక విషయాన్ని మరిచిపోయి, మన పూజ కేవలం లౌకిక కోర్కెలకే పరిమితమైతే అది ఫలవంతం కాదు. దీనివల్ల మనం పూజించే దైవాన్ని, గురువును కూడా ఏదోకరోజు మన కోరికలు నెరవేరటం లేదని నిందించే దుస్థితి మనకి కల్పిస్తుంది. అందుకే ఏ దైవాన్ని, గురువును ఆశ్రయించినా మనం నిశ్చింతగా ఉండే స్థితి రావాలి. మన అజ్ఞానంతో చింతించే దుస్థితి రాకూడదు !"

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
🌼💖🌼💖🌼
🌼🕉🌼


సేకరణ

No comments:

Post a Comment