Wednesday, June 29, 2022

పరమేశ్వరా శరణు..శరణు...✍️

🍁పెరిగే వయసు
తరిగే ఆయువు
జీవులకి ఎన్నో చెబుతాయి

కొందరికి
జీవిత కాలానికి తగిన
పాఠాలు
గుణపాఠాలు

మరికొందరికి
పెరిగిన
తరిగిన
బంధాలు
అనుబంధాలు

ఇంకొందరికి
తీర్చుకోవలసిన
పంచుకోవలసిన
బరువులు
బాధ్యతలు

ఎందరికో
వదులుకోవలసిన
తీర్చుకోవాలనుకున్న
కోరికలు
ఆశలు

నాకు మాత్రమే
తెలుస్తున్నది
నీ ఒడిలో సేద తీరే సమయం
దగ్గరవుతున్నదని
ఆర్తితో పెల్లుబికే కన్నీటితో
నీ పాదాలను నిరంతరం కడిగే
అవకాశం చేరువవుతున్నదని
జనన మరణాల చక్రములో
పరిభ్రమిస్తున్న జీవునికి
మాయ తొలగి
నీలో ఐక్యం అయ్యే శుభతరుణం
వస్తున్నదనీ

⚜️💦పరమేశ్వరా శరణు..శరణు...✍️

సేకరణ

No comments:

Post a Comment