Monday, June 20, 2022

నేటి జీవిత సత్యం. లోక వ్యవహారం.

 నేటి జీవిత సత్యం. 

లోక వ్యవహారం. 


జీవనయాత్రలో కొందరే విజయ ధ్వజం ఎగుర వేస్తారు. మిగతావాళ్లు వారిని ఆదర్శంగా తీసుకొని తమ జీవితయాత్రను సాగిస్తారు. ఏదైనా సాధించడానికి ఎవరైనా ఏ చిన్న ప్రయత్నాన్ని చేసినా వెంటనే వారి వెంటపడి విమర్శించేవాళ్లూ తక్కువేమీ కాదు. వాళ్లను చూసి బెంబేలెత్తి, కాడి కింద పడేసి, చేతులు : దులుపుకొని కూర్చునేవాళ్లు ఎన్నటికీ విజయం సాధించలేరు.


లోకం సంక్లిష్టమైనది. ప్రజల్లో రకరకాల వాళ్ళుంటారు. అందర్ని ఎవరూ సంతృప్తి పరచలేరు. కొందరికి ఎవరూ నచ్చరు. విద్యార్థుల్లో ఇటువంటి వాళ్లను మనం గమనించవచ్చు. వారికి ఏ ఉపాధ్యాయుడూ నచ్చడు కార్యాలయాల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు ఏ అధికారి నచ్చడు సంస్థ యజమాని మాత్రం అందరితో సరుకుపోతూ పనిచేయించుకోవాలి?


ఇంటి యజమాని అయినా, సంస్థ యజమాని అయినా లోక వ్యవహారాన్ని ఆకలింపు చేసుకుంటే గాని ముందడుగు వేయలేరు. తాము పనిచేస్తున్న రంగం గురించి సమాచారం బాగా తెలుసుకొని మసలుకోవాలి. 'జగత్తు వార్తమీద నడుస్తూ ఉంటుంది. సమాచారం లేకపోతే లోకం అంధకారంలో మునిగి పోతుంది' అంటుంది భారతం.


మనుషులకు డబ్బు అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పన వసరం లేదు. కేవలం ధనం. వల్ల ప్రయోజనం శూన్యం. చదువు సంధ్య ఉన్నవారు. విచక్షణతో ధనం సద్వినియోగ

సత్ప్రవర్తన వల్ల సత్కీర్తి లభిస్తుంది. ధనంతో ఎన్నో మంచి పనులు చేయవచ్చు.


భారతం చదివితే ఇహపరాల్లో సుఖం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఇహలోకంలో హాయిగా జీవించే మార్గాలను భారతం సూచిస్తుంది. మయ సభ నిర్మాణం తరవాత ధర్మరాజు సభను ఏర్పాటు చేసి మార్కండేయ, శూది మహ రులను ఆహ్వానించి భక్తితో సందర్భంలో నారదుడు వచ్చి,

పూజించి వారి ఆశీర్వాదాలు పొందాడు. ఆ ధర్మరాజుకు నీతులను బోధించాడు.


"పూర్వ రాజులు అనుసరించిన ధర్మమార్గాన్ని అనుసరించాలి. సామర్థ్యం కలిగినవారినే పనుల్లో నియమించాలి. అధికారులు ధర్మాధర్మాలు తెలిసిన వ్యక్తి సలహాలు తీసుకోవాలి. ధనం ఎంత పనైనా చేస్తుంది. డబ్బులు ఇచ్చి మీ అనుచరుల్నే శత్రువులు లొంగదీసుకోవచ్చు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలి. శారీరక వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల సలహా ప్రకారం ఔషధ సేవనం గావించాలి. నిజాయతీపరులైన రక్షకబోటులే ప్రజలను దొంగల బారినుంచి రక్షించగలరు. అంగవైకల్యం కలిగినవారిని అధికారంలో ఉన్నవారే రక్షించాలి. ఉత్తముల గుణాలను సభలో ప్రశంసించాలి. చుట్టాలను రోజూ ప్రేమతో పలకరించాలి. శత్రువులను ఎదిరించేముందే సామ దాన భేదోపాయాలను ముందుగా అనుసరించాలి. ఆదాయంలో నాలుగో భాగం. అవసరమైతే మూడో భాగం, ఇంకా అవసరం అయితే సగం మాత్రమే ఖర్చుపెట్టాలి. అంతరంగికులను రక్షించుకోవాలి. అసత్యం చెప్పడం, మూర్ఖులతో ఆలోచన, కోపం పనులను వాయిదా వేయడం, గుట్టును కాపాడకపోవడం... ఇవన్నీ దోషాలు, కాబట్టి వీటికి దూరంగా ఉండాలి'' అని నారదుడు ధర్మరాజుకు చెప్పినవి- నేటికీ మన అందరికీ అనుసరణీయాలు.


సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment