"శ్రీరమణీయం"
"అవసరాలు, కోరికలు ఇవి రెండూ కర్మలకు కారణంగా భావించవచ్చా ?"
మనం ఉదయం లేచింది మొదలు దినచర్య అంతా అనేక కర్మలతో ముడిపడివుంది. అవి ఎవరికైనా తప్పేవికావు. ప్రతిపనికి విధిగా జ్ఞాపకం అవసరం. జ్ఞాపకాలు, పనుల కలయికే జీవనం. మనకి రెండు రకాల జ్ఞాపకాలున్నాయి. అవి దేహపరమైనవి, మానసిక పరమైనవి. దేహపరమైన జ్ఞాపకాలు అంటే జీవన అవసరాలు. మానసిక జ్ఞాపకాలు అంటే సుఖ, దుఃఖ భావనలు. ఈ మనో జ్ఞాపకాలే మనని అశాంతికి గురిచేసేవి. ప్రతిపని మనం సుఖసంతోషాలతోనే ముగియాలని కోరుకుంటున్నాం. ఇదే ఒక జ్ఞాపకంగా ఉంది. జ్ఞాపకంలో అనుభవించిన సుఖసంతోషాలతో పోల్చుకొని ప్రస్తుతం కలిగిన సంతోషాన్ని పొందలేక పోతున్నాం. అందువల్లే కలిగిన సంతోషాన్ని అనుభవించలేక పోతున్నాం. అంటే మనసు సుఖసంతోషాలతోపాటు అవే రకమైన గత అనుభవాలు కూడా కోరుకుంటుంది. అది సాధ్యం కాకపోవటంతో దుఃఖపడుతుంది. మామిడి చెట్టు నాటిన ఐదేండ్ల తర్వాత ఫలాలను ఇస్తుంది. ఇక్కడ చైతన్యశక్తి చేసుకున్న ఏర్పాటులోనే ఫలం ఉంది. ఫలం కోసం మరో కొత్త ఏర్పాటురాదు. ఇది గుర్తించలేకే అశాంతి. జీవనంలో 'ఇది అవసరం' అని ప్రత్యేకంగా చెప్పే అంశం ఏదీలేదు ! ఎందుకంటే అవసరం దోషం కాదు. 'అతి'యే దోషం !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
సేకరణ

No comments:
Post a Comment