Wednesday, June 22, 2022

శాంతి, సుఖం, సంతోషం దూరం కావటానికి ప్రధాన కారణాలు ఏమిటి ?

💖💖 "257" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖


"శాంతి, సుఖం, సంతోషం దూరం కావటానికి ప్రధాన కారణాలు ఏమిటి ?"


"మనో ప్రవృత్తే కారణం. ఆలోచనాశక్తి అనేక విషయాలతో చిందరవందర కావటమే మనోవిక్షేపం. ఈ విక్షేపం వల్లనే శాంతి, సుఖం, సంతోషం దూరమవుతున్నాయి. మనలో ప్రేమ లోపించటమే ఈ దుస్థితికి కారణం. మనసు ప్రవృత్తే మన ఆలోచనలకు కారణం. ప్రవృత్తి అంటే మనసు పోకడలు. మన జీవన విధానమే ఇందుకు కారణం. దాన్ని మార్చుకోవటం ద్వారా ఈ యుద్ధంలో జయించవచ్చు. అప్పుడే దూరం అవుతున్న సుఖశాంతులు పొందగలుగుతాం. ప్రేమ అంటే ఒక వస్తువుపై ఇష్టం కాదు. సత్యాన్ని స్వీకరించటమే నిజమైన ప్రేమ. మనం తలపెట్టుకున్న పనులు కావటంలేదని నిత్యం అశాంతికి లోనవుతున్నాం. అసలు ఆ తలపులే (ఆలోచనలు) తగ్గించుకుంటే శాంతి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుందని తెలుసుకోలేక పోతున్నాం. మనకి ఎన్ని ఆలోచనలు ఉంటే అంత దుఃఖం తప్పదు "!

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
🌼💖🌼💖🌼

సేకరణ

No comments:

Post a Comment