Friday, June 17, 2022

తప్పును సున్నితంగా సరిచేయాలి తప్ప ఎవ్వరినీ ఎగతాళి చేయకూడదు.

  ఒక లెక్కల టీచరు బోర్డుమీద 9 వ గుణింతం ఇలా వ్రాసింది.  

9×1=7

9×2=18

9×3=27

9×4=36

9×5=45

9×6=54

9×7=63

9×8=72

9×9=81

9×10=90

  ఇది వ్రాసిన టీచరును చూసి పిల్లలందరూ నవ్వసాగారు.....టీచరు పిల్లల్ని  

  ఎందుకు నవ్వుతున్నారని అడిగారు. అప్పుడు పిల్లలు ఇలా అన్నారు.  

  " టీచర్ ! మీరు 9x1=7 అని వ్రాసారు....అది తప్పుకదా! "  

  టీచరు నవ్వుతూ ఇలా చెప్పింది.  

  " నిజమే అది తప్పే!.... కానీ నేను కావాలనే అలా వ్రాసాను. దానికి ఒక కారణం  

  ఉంది. నేను ఆ ఒక్కటి తప్పుగా వ్రాసానని మీరు నవ్వుతున్నారు కదా!  

  మిగిలినవన్నీ కరెక్టుగా వ్రాసాను కదా! మిగిలినవన్నీ కరెక్టుగా వ్రాసాను  

  అని మీరు నన్ను మెచ్చుకోలేదుగా! ఒక్కటి తప్పుగా వ్రాసినందుకు  

  ఎగతాళి చేస్తున్నారు కదా! ఇదే జీవితం.  

 మీరు ఎన్ని మంచిపనులు చేసినా గుర్తించని జనాలు మీరు ఒక చిన్న 

 తప్పు చేయగానే ఎగతాళి చేస్తారు.   మంచిని మాత్రమే చేయాలని  

  అనుకోవడం ముఖ్యమైతే   తప్పు చేయకుండా మంచిని చేయాలనుకోవడం  

  అంతకంటే ముఖ్యం.....అర్థం   అయిందా పిల్లలూ! మీరు   ఎప్పుడు 

 ఎవ్వరినీ చూసి ఎగతాళి   చేయకూడదు.మంచిని చేస్తున్నప్పుడు 

 ఏదైనా పొరపాటు జరిగితే ఆ తప్పును వారి దృష్టికి మర్యాదగా 

 తీసుకునివెళ్ళాలే తప్ప ఎగతాళి చేయకూడదు  ...సరేనా! "

 ఎదుటివారిని ఎగతాళి చేసే ముందు మనమేంటో ఆలో చించుకోవాలి. 

 తప్పును సున్నితంగా సరిచేయాలి తప్ప ఎవ్వరినీ ఎగతాళి చేయకూడదు. 


ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏

No comments:

Post a Comment