Saturday, June 25, 2022

రమణ బోధ

రమణ బోధ


నీవు తత్వజ్ఞుడవై ప్రాపంచిక వ్యవహారాలలో, గతించిన వస్తువులపట్ల, వ్యక్తులపట్ల ఉదాసీనంగా వుండు.

ప్రాప్తమైన వాటిని సేవించు.
ఎంత వ్యవహారంలో వున్నా ఇష్టాయిష్టాలు లేకుండా ప్రసన్నంగా ఉండు.

నీ మనసుకెపుడు ఇంద్రియ విషయలు రుచించవో నీవు సంసార సాగరాన్ని దాటినవాడవవుతావు.

సంకల్పరహితుడవై ప్రాప్తించిన వ్యవహారాలు నడుపుతూ ఉండు.

సంకల్పాలు ( మనస్సు ) నశిస్తే మోక్షమే, అనందమే, ప్రశాంతతే.

సంకల్పాలూ తప్ప మరొక సంసార దుఃఖమేమిలేదు.

నేనేమి సంకల్పించను అను సంకల్పంతో మనస్సును జయించు.

చూడు ఏమిజరుగుతుందో.

ఆ భగవంతుని చేతిలో ఒక ఇంస్ట్రుమెంటుగా మారు. నీ బాగోగులు అన్ని ఆ భగవంతుడే చూస్తాడు.

సేకరణ

No comments:

Post a Comment