Wednesday, June 29, 2022

మనసు మాటల ముత్యాలు

🌹🙏🏻శుభోదయం🌹🙏🏻

మనసు మాటల ముత్యాలు

🌹 విలువైన మాటలు చెప్పే వాళ్ళు
దొరకడం మన అదృష్టం..
కానీ
అవి విలువైన మాటలు అని
తెలుసుకోలేక పోవడం మన దురదృష్టం...!

🌹 ప్రశ్నలతో ఈ సమాజం ప్రతి క్షణం నిన్ను వేధిస్తుంటే...!
ధైర్యంగా బ్రతికి చూపించి...
ఇదే నా సమాధానం.. అని చెప్పడమే జీవితం...!

🌹 గడ్డిపోచలు మాత్రమే నీటిపై
తేలియాడుతుంటాయి
ముత్యాలు కావాలంటే నీటి
లోపలికి మునగక తప్పదు.

🌹 ఏదైనా నీవు చేయగలను
అనుకుంటే చేయగలవు,
చేయలేను అనుకుంటే చేయలేవు.
నమ్మకంలోని నాణ్యతే నీకు
నాణ్యమైన జీవితాన్ని ఇస్తుంది.

🌹 పోరాడితే పోయేదేమీ లేదు
గెలిస్తే విజయం వరిస్తుంది
లేకుంటే అనుభవం వస్తుంది.
ఆ అనుభవం రేపటి నీ విజయానికి దారి
చూపుతుంది.

🌹 ఆలోచించే విధానము
జ్ఞాపకము ఉంచుకునే శక్తి
మాట్లాడే పద్ధతి మరియు
విజ్ఞానాన్ని నేర్చుకునే కోరిక
వీటన్నిటినీ నిరంతరము మెరుగుపరచుకుంటూ
నడిచేవారు తాము తలపెట్టిన పనిని అత్యంత
సమర్ధతతో నిర్వహించగలుగుతారు.

సేకరణ

No comments:

Post a Comment