Saturday, June 25, 2022

🍁దుర్గుణాలు🍁

🍁దుర్గుణాలు🍁

✍️ మురళీ మోహన్

🌹గులాబీ మొక్కకి పువ్వుల కంటే ముళ్లే ఎక్కువ ఉంటాయి.మామిడి చెట్టుకి పళ్ళ కంటే ఆకులు ఎక్కువ ఉంటాయి.కానీ మనం ముళ్ళని చూసి మూళ్ళ చెట్టు అనడంలేదు.ఆకులు చూసి ఆకుల చెట్టు అనడంలేదు...

ఒకదానితో అందం చూశాం,అందుకే రోజా మొక్క అంటున్నాం...మరొకదానితో తియ్యదనాన్ని చూశాం,అందుకే మామిడి చెట్టు అంటున్నాం...

సంవత్సరం అంతా ఆకులతో కొమ్మలతో నిండిపోయి కేవలం 2మాసాలు మాత్రమే పళ్ళని ఇచ్చే చెట్టుకి ఎంతో విలువనిచ్చి కాపాడుతున్నాం.

అలాగే ప్రతి వ్యక్తిలో ఎన్నో దుర్గుణాలు ఉండవచ్చు.కానీ ఆ వ్యక్తిలో ఏవో మంచి లక్షణాలు ఉండక మానవు. గుర్తించండి...చెడ్డ లక్షణాలను ఖండించండి...మనిషిని కాదు...

ఏవో దుర్గుణాలు ఉన్నాయని మనిషినే ఖండిస్తూ పోతే ఏకాకిగానే ఉండాల్సి వస్తుంది.

సేకరణ

No comments:

Post a Comment