Sunday, June 26, 2022

హిందూత్వాన్ని ప్రాణం ప్రదంగా ఆచరించే ప్రపంచ ప్రముఖులు.

 హిందూత్వాన్ని ప్రాణం ప్రదంగా ఆచరించే ప్రపంచ ప్రముఖులు.                                               1.స్టీవ్ జాబ్స్ : అమెరికా లోని ఆపిల్ అనే ప్రముఖ సెల్ ఫోన్స్ తయారి సంస్థ ప్రతినిధి. ఈయన ప్రతి ఆదివారం శ్రీకృష్ణ దేవాలయానికి 7 కి.మీ. నడిచి వెళ్లి అన్నప్రసాద వరుసలో నుంచొని మరి ఆ భోజనం చేసి తరువాతనే తన పనులు చూసుకుంటాడు.

2.అల్ఫ్రెడ్ ఫోర్డ్ : వీరు అమెరికాలోని ఫోర్డ్ అనే ప్రముఖ కార్ల తయారిసంస్థ ప్రతినిధి. హిందూ ధర్మంలోని మూల విషయాలని గ్రహించి 1974లో హిందూ ధర్మం స్వీకరించి తన పేరును అంబరీష్ దాస్ గా మార్చుకున్నాడు. భారతీయ స్త్రీని వివాహం చేసుకొని హిందూ ధర్మ ఉద్దరణ కోసం నిత్యం పాటు పడే అమెరికా లోని ప్రముఖ వ్యక్తి. 

3.డేవిడ్ ఫ్రాలే : అమెరికా లోని ప్రముఖ రచయిత, ఖగోళ శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, హిందూమత ఉద్దరణ కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి.మన దేశ యోగ, ధ్యానం, ఆయుర్వేదాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వివరించి వాటిపై అనేక పుస్తకాలను రాసిన వ్యక్తి.

4.రాంబో (సిల్వెస్టర్ స్టాలోన్) : తన నట జీవితానికి ముగింపు పలుకుతున్న సమయంలో హిందూ ధర్మం వైపు ఆకర్షితుడు అయ్యాడు. తన కుమారుడు మరణానంతరం అతని అస్తికలను హరిద్వార్ లోని గంగా నదిలో కలిపి మన దేశంలో ప్రముఖ ఆలయాలు దర్శించి ఎక్కువగా హిందూ ఆద్యాత్మిక జీవితం గడుపుతున్న వ్యక్తి.

5. విల్ స్మిత్ : ప్రముఖ హాలివుడ్ నటుడు. హాలివుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే వ్యక్తి. తన నటనా జీవిత మధ్య భాగంలో హిందూ ధర్మం వైపు ఆకర్షితుడై తరచూ మన దేశానికి వస్తూ మన ఆలయాలు సందర్శిస్తూ గంగా నదికి ఇచ్చే హారతిలో కచ్చితంగా పాల్గొంటాడు.

6.జూలియా రాబర్ట్స్ : అమెరికాకు చెందినా ప్రముఖ ఆస్కార్ అవార్డ్ నటి. సినిమాల్లో నటిస్తూ క్రమంగా హిందూ ధర్మంపై ఆకర్షితురాలై తాను పూర్తి హిందూ స్త్రీగా ప్రకటించింది. తను పెంచే పిల్లలకు హిందూ దేవుళ్ళ పేర్లు పెట్టి యోగా, ధ్యానం లను సాధన చేస్తూ మన ధర్మంపై పరిశోధన చేస్తున్నది.

7.హ్యుగ్ జాక్మాన్ : ప్రముఖ హాలివుడ్ నటుడు. X మాన్ సినిమాల నటుడు. హిందూ ధర్మం పై అభిమానం పెంచుకొని మన ఉపనిషత్తులు, భగవద్గీత, ఇతర హిందూధర్మ గ్రంధాలను అధ్యయనం చేస్తున్న వ్యక్తి.

8.జెర్రి గార్సియా : అమెరికాకు చెందినా ప్రముఖ గాయకుడు, గిటారిస్ట్, తన ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా అనేక వేదికలపై ప్రదర్సనలు ఇచ్చాడు. వీరు కుడా మన ధర్మాన్ని ఆచరిస్తూ వీరి మరణం తరువాత అస్తికల బూడిదను మన గంగా నదిలో కలపమని కోరుకున్నారు. 

9.నివేదిత : ప్రముఖ ఐరిష్ మహిళ, హిందూ ధర్మం పై ఆసక్తి పెంచుకొని స్వామీ వివేక నంద శిష్యురాలుగా చేరి తన జీవితం అంతా మన ధర్మప్రచారం కోసం మన దేశ పౌరసత్వం స్వీకరించి మరణించే వరకు వివిధ కార్యక్రమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసింది.

10. రిచర్డ్ ఎల్.ధామ్సన్ : అమెరికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, తత్వవేత్త, గణితశాస్త్ర ప్రముఖుడు. వీరు కుడా మన హిందూ ధర్మం స్వీకరించి  తన పేరును సదాపుత్ర దాసు అని మార్చుకున్నాడు. యోగ ధ్యానం, భగవద్గీత లను సాధన చేసి ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నాడు.


---సేకరణ 

No comments:

Post a Comment