Friday, July 8, 2022

మంచి మాట..లు(08-07-2022)

శుక్రవారం :-08-07-2022
ఈ రోజు AVB మంచి మాట..లు

మనిషికి ఉన్నా రెండు చెవులు ఒకే శబ్దం వినగలుగుతాయి.. రెండు కళ్ళు ఒకే దృశ్యం చూడకలుగుతాయి.. కానీ ఉన్నా ఒక్క నాలుక మాత్రం రెండు విధాలుగా మాట్లాడుతుంది..మరి నాలుకలు కూడా రెండు ఉంటే.. పరిస్థితి

నమ్మకం.. ప్రాణం.. ఈ రెండు పొతే తిరిగి రావు... నమ్మిన వారిని మోసం చేయకు.. మోసం చేసిన వారిని నమ్మకు

నిరాశవాది తనకు వచ్చిన ప్రతి అవకాశంలో ఉన్నా ఇబ్బంది గురించి ఆలోచిస్తాడు..కానీ ఆశవాది తనకు ఎదురైనా ఇబ్బందులల్లో కూడా అవకాశం వెతుకుతాడు

ఒక విషయం గురించి తెలియటం ముఖ్యం కాదు.. దానిని సరైన చోట ఉపయోగించటం ముఖ్యం...
కోరుకోవటం ఒకటే ముఖ్యం కాదు.. దాని గురించి పనిచేయటం కూడా చేయాలి

జీవితంలో సెక్యూరిటీ అనేది ఒక అపోహ మాత్రమే.. జీవితం అంటేనే ఒక సాహసం.. సాహసం చేయకపోతే ఏది మిగలదు.. ముందుకు పోలేవు.. ముందుకు పోవాలంటే సాహసం చేయాల్సిందే.. చిన్న పిల్లడు కింద పడి లేవకుంటే నడవలేడు

ప్రేమ ఉన్మాదంగా మారితే.. అనర్థం జరుగుతుంది....
ప్రేమ అడుక్కుంటేనో.. లాక్కుంటేనో కలిగేది కాదు

సేకరణ ✍️AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment