Saturday, July 16, 2022

మంచి మాట..లు(16-07-2022)

 శని వారం --: 16-07-2022 :--

నేటి AVB మంచి మాట. లు


అందరినీ విమర్శించే వారు ఎప్పటికి మనశ్శాంతిగా జీవించలేరు . కానీ అందరినీ సరదాగా పలకరించేవారు వారు నిత్య నూతన ఆనందాలతో జీవిస్తారు .


స్నేహం ప్రేమ అనేవి దీపం లాంటివి వెలిగించడం చాలా సులభం కానీ ఆరిపోకుండా కపడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం .


సమయం , ఆరోగ్యం , బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు అది కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి బంధాన్ని నిలబెట్టుకోవాలి .



ఎగిసిన అల, మిడిసిపడిన తల, నిటారుగా పెరిగిన చెట్టు, ఏనాటికైనా విరగక తప్పదు,, అందుకే జీవితంలో ఎప్పుడైనా సరే అహంకారం, గర్వం తలకెక్కకూడదు,,,,



కాలానికి - కర్మకూ జ్ఞాపకశక్తి ఎక్కువ,, ఎంత కాలం తరువాత అయినా సరే మనిషి చేసిన మంచి, చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు,, అందుకే మనుషులకన్నా, కాలాన్నే ఎక్కువ విశ్వసించు,,,,



జీవితంలో ఏదైనా సరే,, మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు,, కచ్చితంగా మనదే అయితే అది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు,, గుర్తుంచుకోండి,,,,


సేకరణ ✍️మీ ఆత్మీయ బంధువు AVB  సుబ్బారావు 💐🤝


No comments:

Post a Comment