Wednesday, July 13, 2022

దురాశ అంతటా ఎందుకు ఉంది?దురాశ ఎక్కడ నుంచి పుట్టుకు వస్తుంది? దురాశను అధిగమించటం ఎలా?

🔺 పత్రీజీ సమాధానాలు 🔺

🌹 చాప్టర్ -- 5 :--- ఆధ్యాత్మిక శాస్త్రం 🌹

🍁 ప్రశ్న :--- దురాశ అంతటా ఎందుకు ఉంది?



🍀 పత్రీజీ :--- యజమానికీ మరి ఉద్యోగులకూ మద్య పరస్పర దురాశ, పని చేసే చోట కార్య నిర్వాహకులకూ, సిబ్బందికీ మధ్య పరస్పర దురాశ ఉన్నట్లుగానే ప్రతి వాళ్ళలోనూ దురాశ ఉంది. అంతటా నిండి వుంది. ఇది పని చేసే చోటు మాత్రమే కాకుండా కుటుంబంలోనూ, ప్రభుత్వంలోనూ, అంతర్జాతీయ స్థాయి సంస్థలలోనూ దురాశ ఉంది. ప్రాథమిక స్థాయిలో దురాశను ఆధ్యాత్మికత చక్కగా పరిష్కరిస్తుంది. దురాశ నుంచి అందరూ బయటపడాలి.



🍁 ప్రశ్న :--- దురాశ ఎక్కడ నుంచి పుట్టుకు వస్తుంది?



🍀 పత్రీజీ :--- ధ్యానం తెలియకపోవటం వల్ల దురాశ ఉంది. ఒక మొక్కను బీడు భూమిలో నాటితే, అంతంత మాత్రంగానే ఎదుగుతుంది. అదే మాగాణి నేలలో నాటితే ఏపుగా పెరుగుతుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా దురాశా పరులతోనే నిండి ఉన్నాయి. కనుక మనం వాళ్ళందరికీ ధ్యానం నేర్పించాలి. ఆత్మ జ్ఞానం బోధించాలి. అప్పుడే వాళ్ళు మారుతారు. సర్దుకుపోవటం వేరు, రాజీపడటం వేరు, మనం మన నియమాలతో రాజీపడం. అధ్వాన్న పరిస్థితుల మధ్య కూడా సర్దుకుంటూ వస్తాం.



🍁 ప్రశ్న :--- దురాశను అధిగమించటం ఎలా?



🍀 పత్రీజీ :--- ధ్యానం తెలియకపోవటం వల్ల దురాశ వస్తుంది. క్రమం తప్పని ధ్యాన సాధన వల్ల దురాశ తొలగిపోతుంది. మరి అందుకోసమే మనం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ ను స్థాపించటం జరిగింది. తద్వారా ప్రతి ఒక్కరికీ ధ్యానాన్ని నేర్పించి, దురాశను పోగొట్టుకోవటానికి మనమంతా మానవాళికి సహాయ పడతాం.



🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



🌷 పత్రీజీ సమాధానాలు పుస్తకం మరియు ఇతర పత్రీజీ పుస్తకాల సెట్ కావాల్సిన వాళ్ళు 9032596493 కి what's app msg చేయగలరు.



సేకరణ

No comments:

Post a Comment