ఆత్మను మించిన పరమాత్ముడు లేడు
➖➖
ఆత్మను మించి పరమాత్ముడు లేడని యుగయుగాలుగా మరియు ఎందరో ఋషులు, మునులు, యోగులు, గురువులు చెప్పినా కూడా ఆ ఆ మార్గంలో ప్రయాణించకుండా సమస్యల పరిష్కారం కొఱకు రకరకాల మార్గాలలో ప్రయాణిస్తూ సమస్యకు పరిష్కారం దొరకక ఆందోళనలో జీవిస్తున్నారు మానవులందరూ!
పరమాత్మ స్వరూపమైన ఆత్మను చేరుకోవాలంటే అంతరాత్మను చూడాలనుకుంటే ఎవరికి వారు లోనికి అనగా అంతర్ ప్రపంచంలోకి సరయిన ధ్యానం ద్వారా మాత్రమే ప్రయాణించినప్పుడు అంతరాత్మ దర్శనం కలుగుతుంది.
అప్పుడు ఆత్మ శక్తి ద్వారా జన్మజన్మల చెడు కర్మలు దగ్ధం అవుతాయి...
అపుడు సమస్యలు అన్నీ మటుమాయమై, మాటే మంత్రంగా అద్భుతమైన ఆలోచనలద్వారా సహ సృష్టి కర్తలుగా ఎదిగి పోతారు.
ఈ సత్యాన్ని ఎవరికి వారు అనుభవ పూర్వకంగా సాధన ద్వారా మాత్రమే తెలు సు కుంటారు
No comments:
Post a Comment