Friday, July 8, 2022

🎻🌹🙏సరస్వతీ దేవి చేతి లో వీణ ఎందుకు ఉంటుంది ?..!!

🎻🌹🙏సరస్వతీ దేవి చేతి లో వీణ ఎందుకు ఉంటుంది ?..!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿లోకం లో  ఎన్నో రకాల సంగీత వాయిద్యాలు ఉండగా సరస్వతీ దేవి చేతి లో వీణ ఎందుకు ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?

🌸సరస్వతీ అమ్మ వారు చేతి లో కచ్ఛపి  అనే వీణ ఉంటుంది.
ఆ దేవి తెల్లని వర్ణం కలది.

🌿చాలా సాత్విక రూపిణి గా తెల్లని పద్మం పై కానీ తెల్లని హంస పైన కానీ కూర్చుని ఉన్నది గా వర్ణింపబడినది.

🌸తెల్లని హంస పైన ఎందుకు ఉన్నది లేక తెల్లని తామర లో ఎందుకు ఉన్నది?
ఆమె తెల్లగా ఉండడం దేనిని సూచిస్తుంది అనే విషయాలు తరువాత తెలుసుకుందాం.

🌿సరస్వతీ దేవి జ్ఞానానికి, సంగీతానికి, కళలకు, వివేకానికి అధిష్ఠాన దేవత కదా.

🌸మరి మన శరీరం లో వివేక, జ్ఞానాల యొక్క స్థానం ఏది?

🌿అది మన మెదడు ఇంకా వెన్నుపాము కదా.

🌸ఇప్పుడు మీరు వీణ ను గమనించండి.
మెదడు ఉండే పుఱ్ఱె కు వెన్ను పామును అమర్చినట్టు ఉంటుంది.


🌿అంటే ఆ వీణ యొక్క బుర్ర మన పుఱ్ఱె  అన్నమాటక్
మిగతా భాగం మన వెన్నుపాము.

🌸అక్కడితో అయిపోలేదు.
వీణ చివర మీరు సరిగ్గా గమనిస్తే ఒక జంతువు ముఖం కనిపిస్తుంది.

దాని పేరు యాళి.
అది ఒక పౌరాణిక మృగం.

🌸అది మన వెన్నుపాము కు చివర ఉండే చక్రం లో ఉన్న కుండలినీ శక్తిని సూచిస్తుంది.

🌿మానవ శరీరం లోని చక్రాలు తోకను నోటితో కరుచుకుని ఉన్న కుండలిని మానవ శరీరం లో వెన్నుపాము మీద గా  ఏడు చక్రాలు ఉంటాయి.

🌹అందులో అన్నిటి కన్నా కింద మూలాధారం  అనే చక్రం ఉంటుంది.

🌸అందులో మనిషి లోని కుండలిని శక్తి  ఒక నల్లని పాములా తన తోక ను తానే నోటి తో కరిచి పట్టుకుని ఉంటుంది.

🌿ఈ వీణ లో యాళి ఆ కుండలిని శక్తి కి ప్రతిరూపం అన్నమాట.

🌸అంటే వీణ పట్టుకోవడం ద్వారా అమ్మవారు ఎవరైతే తనకు స్వచ్ఛమైన మనసు తో తమని తాము ఆమె కి దాసోహం ( నేను నీకు దాసుడను ) అని అంటారో

🌿వాళ్ళ బుద్ధి అనే వీణ ను మంచివి, గొప్పవి ఐన ఆలోచనలు అనబడే సుస్వరాలు పలికేలా మీటుతుంది అని అర్థం....🚩🌞🙏🌹🎻

🌹శుభమస్తు🌹

🙏సర్వే జనా సుఖినోభవం🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

సేకరణ

No comments:

Post a Comment