Thursday, July 7, 2022

నాలోని గుణదోషాలను సరిదిద్దికునే విధానం ఏమిటి ?

💖💖 "272" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖

"నాలోని గుణదోషాలను సరిదిద్దికునే విధానం ఏమిటి ?"


"అందుకు ముందుగా అహంకారాన్ని వివేకంతో దాటాలి. గుణదోషాలను మనో విశ్లేషణ ద్వారా మార్చుకోగలం గానీ తాయత్తులు, విభూదులతో మార్చుకోవాలనుకోవటం వివేకంకాదు ! తన కూతురికి అత్తగారు లేకుండా ఉంటే బాగుంటుందని కోరుకునే తల్లి తన కోడలు మాత్రం తన మాట వినాలనుకుంటుంది. ఎవరి బలం అధికంగా ఉంటే వారి అహంకారం గెలవాలని చూస్తారు. బుద్ధికి ఆడ, మగ అని లేదు. మనసుకు వివేకం, విశ్లేషణ, సత్యదృష్టి ఉంటే ప్రతివ్యక్తి మనకు జీవితాన్ని నేర్పే గురువే అవుతాడు. జీవితంలోని అన్ని కోణాలను సన్మార్గంలోకి మార్చటం నిజమైన ఆధ్యాత్మికత అవుతుంది. అది మాత్రమే నిజమైన శాంతిని మనకి అందిస్తుంది. కేవలం పూజించే సమయంలోనే మనసును నిగ్రహించుకోవాలనుకోవటం అవివేకం. మన జీవితమంతా వివేకదృష్టితో ఉంటే తప్ప దైవాన్ని దర్శించటం కష్టం !"

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}


సేకరణ

No comments:

Post a Comment