Wednesday, July 13, 2022

ఆత్మ బంధువు లారా మనం అందరం దైవ వారసులం.

 ఆత్మ బంధువు లారా మనం అందరం దైవ వారసులం.


కాయం, వాక్కు, మనస్సు తో చేసే కార్యం...

పూజ ,జపం , చింతనం తో చేసే కార్యం ....

కాయం అంటే శరీరం. శరీరంతో చేసే పూజ కన్నా....

వాక్కు అంటే మాట.అంటే నోట్లోనుండి వచ్చే జపం మిన్నా...

చింతనం అంటే విచారణ అంటే ధ్యానం. మనస్సుతో చేసే ధ్యానం ఇంకా ఎంతో మిన్న.


అంటే శరీరంతో చేసే పూజ కన్నా నోటితో చేసే జపం కన్నా మనస్సుతో చేసే ధ్యానం ఎంతో మేలు చేస్తుంది..


మనస్సు బుద్ధితో కలసి ఆత్మతో తాథాప్యం చెంది ధ్యానం( విచారణ)  చేస్తే దేహ భావం పోయి ఆత్మ తత్వం మిగులుతుంది. అదే సాధన....


ఆత్మవైన నీవు పరమాత్మ లో కలవడమే మోక్షం... మొక్ష్మం అంటే విడుదల..... ఏ విడుదల ... దేహాత్మ భావం , అనురాగం, విరాగం నుండి విడుదల.... అదే మోక్షం... ఈ దేహదారి ఎప్పుడైతే నేను ఆత్మను అన్న స్ఫురణతో ఉండడం జరుగుతుందో అప్పుడు పరమాత్మతో లయం జరుగుతుంది... అదే మోక్షం...అదే దైవత్వం......


No comments:

Post a Comment