💖💖 "279" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
"దైవం, జ్ఞాని, గురువు సమానులేనా ? సాధనకు రూపనామాల తేడా ఏమిటి !?"
"మనంచేసే సాధన మన భావితరాలకు సరూపంతో అందిస్తేనే అది నిలుస్తుంది. కాబట్టి రూపనామాల విషయంలో సందేహం అక్కర్లేదు. భగవంతునికి రూపం లేదని చెపుతున్న మతాలు కూడా ఏదో ఒక స్థలాన్నో, నిర్మాణాన్నో ఆశ్రయిస్తున్నాయే గానీ గాలిలో ప్రార్థనలు ఎవరూ చేయటంలేదు. దైవం, జ్ఞాని, గురువు దేహపరంగా సమానులు కాకపోవచ్చు కానీ కనిపించని శక్తిగా వారంతా సమానులే. మహానుభావులు దేహానికి పరిమితం కాని విశ్వచైతన్య మూర్తులు కనుకనే వారిని తలుసుకుంటున్నాం. మనం నిజంగా ప్రార్థించేది దేహం కలిగినవారిని అయితే మన ఇంటి పక్క వారిని ప్రార్థించవచ్చు కదా ! మనరక్షణ మన చేతిలోనే ఉంటే దైవాన్ని ఎందుకు ప్రార్థిస్తాం. రోడ్డు ప్రమాదాలను ఎందుకు జరగనిస్తాం. మామూలుగా నాలుగడుగులు వేస్తేనే కాళ్ళనొప్పులు కలిగే వ్యక్తికి తిరుపతి కొండ ఎక్కితే ఏ బాధ ఎందుకు ఉండటం లేదు ? ఆధ్యాత్మిక ప్రయాణంలో మన అనుభవాలే మనకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని, బలాన్ని ఇస్తాయి. కేవలం విన్నదీ, చదివిందీ మనను ముందుకు సాగనివ్వదు "!
"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"
🌼💖🌼💖🌼
🌼🕉🌼
సేకరణ
No comments:
Post a Comment