Wednesday, July 6, 2022

మరి జీవితం అంటే ఏమిటి ?

జీవితం అంటే సంసారంలో మునగడం కాదు
జీవితం అంటే వ్యవసాయం చేయడమాకాదు
జీవితమంటే డబ్బులు సంపాదించడమాకాదూ
జీవితమంటే ఉద్యోగం చేయడమా కాదు
జీవితమంటే సుఖాలు అనుభవించడమా కాదు
ఇది జీవితం కాదు జీవితంలో ఒక భాగం మాత్రమే

మరి జీవితం అంటే ఏమిటి ?

హింసకు దూరంగా ఉండడం
వ్యసనాలకు దూరంగా ఉండడం
సత్యాన్ని ఆచరించడం
ధర్మాన్ని ఆచరించడం
అంతరాత్మకు లోబడి జీవించడం
పరోపకారం చేయడం
దైవాన్ని గుర్తించడం
సత్యాన్వేషణ చేయడం
శాస్త్రాన్ని అనుసరించడం
జీవులను ప్రేమించడం
ప్రకృతిని కాపాడడన
ధర్మబద్ధంగా జీవించడం
పురుషార్థాలను అనుసరించడం
నమ్మకాన్ని నిలబెట్టుకోవడం
వాస్తవానికి విలువ ఇవ్వడం
స్వధర్మాన్ని ఆచరించడం
ధ్యానం చేయడం
ఆదర్శ జీవితం గడపడం
.

సేకరణ

No comments:

Post a Comment