Saturday, July 16, 2022

మనసులో ప్రార్థిస్తే వినేశక్తి ఎక్కడిది ? అనుగ్రహం ఎలా లభిస్తుంది !?

        💖💖 *"281"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖


*"మనసులో ప్రార్థిస్తే వినేశక్తి ఎక్కడిది ? అనుగ్రహం ఎలా లభిస్తుంది !?"*

**************************


*"ప్రార్థిస్తే వినేశక్తి విశ్వమనసుకు ఉంది. తన్మయత్వంతో క్షణకాలంపాటు మనకిష్టమైన ఏ రూపంలో తలుచుకున్నా విశ్వమనసుగా ఉన్న శక్తే మనను అనుగ్రహిస్తుంది. నిత్యము, నిరతము విశ్వమంతా నిండి ఉండేది జ్ఞానం. అది మన మనసు ద్వారా వ్యక్తమైతే 'భక్తి' అవుతుంది. దైవానికి రూపం లేదనే విశ్వాసం కొందరిది. అయితే వారు కూడా రూపం అనే ఒక్క గుణం మినహా మిగిలిన అన్ని గుణాలను దైవానికి ఆపాదిస్తూనే ఉన్నారు. ఏ మతంవారైనా దైవాన్ని వరాలు కోరటం, పిలిస్తే పలకటం, రక్షించటం వంటి అనేక గుణాలతో కొలుస్తున్నవారే ! అందరికీ అందుబాటులో ఉండేలా మనం రూపం అనే గుణాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. దైవానికి రూపం లేదని తెలిసే వరకు మనం ఏదోక రూపంలో దైవాన్ని పూజించటం వలన లాభమే గానీ నష్టం లేదు. దైవాన్ని మనకిష్టమైన ఏ రూపంలో ఎంచుకున్నా కొలిచేది మాత్రం అందులోని అదృశ్యశక్తినే అయినప్పుడు రూపం వలన వచ్చిన నష్టం ఏముంది ! భగవంతుడు మన హృదయంలో ఉన్నాడన్న అనుభవం కలిగేవరకు రూపధ్యానం, నామజపం అవసరం. భగవంతుని విషయంలో రూపం, నామం, శక్తి వేర్వేరుగాలేవు. ఏ వస్తువునుండీ రూపాన్ని వేరు చేయలేము !!*

          🌼💖🌼💖🌼

                🌼🕉🌼

      

No comments:

Post a Comment