*:::::::అసూయ గురించి::::::::*
అసూయ ఒంటరిగా వుండదు. ఇది ఏ ఏ అంశాలతో కూడి వుంటుంది అంటే.
1) అసూయ సామర్థ్యంతో కలిసి ఇతరులతో సామర్ధ్యం విషయంలో పోల్చకోవడం ద్వారా అసూయ పుడుతుంది.
2)నా సొంతం అనే భావం నుండి అసూయ పుడుతుంది .
అసూయ నాగరికులలోనే ఎక్కువ గా వున్నది. నాగరికులకు సొంతం అనే భావన ఎక్కువ. సొంతాల విషయాలలో వున్న హెచ్చు తగ్గుల వలన అసూయ పుడుతుంది.
3)తాను ప్రేమించిన వారిపై ప్రేమ తో పాటు నాసొంతం అనే భావన వుంటుంది . అప్పుడు వారు ఇతరులకు ప్రేమను పంచ నివ్వరు. అలా ప్రేమ పెంచు కొనే వారి పై అసూయ .
4) అసూయ లో ఏదో పోగొట్టుకున్న భావన వుంటుంది. ఏది సోంతమో అది పోగొట్టుకున్న భావన.
5)అసూయ మానవ సహజ నైజం కాదు. అసంతృప్తి నుండి ,అవగాహన లోపం చేత పరిస్థితులు ప్రేరేపిస్తే పుట్టినది .
6) ధ్యాని అసూయ నుండి తేలికగా బయట పడగలడు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment