. *సృష్టి - ఈ సృష్టిలో మనం*
****************************
అందమంటే స్త్రీలదే.
ఆనందమంటే మగాళ్ళదే.
ఎందుకో యీ ప్రకృతిలోన
ఇదే యీ మానవుల వైఖరి.
నవ్వడం అహో స్త్రీలదే.
నవ్వించడం యీ మగాళ్ళదే.
నవ్వుల తీరూ పూల మాదిరి.
మెరిసి మురిసే వైభవమ్మది.
ఇంటి అందం స్త్రీల వలనే.
ఇంటి పోషణ మగాళ్ళ వలనే.
ఇల్లు మంచిగ ఉన్నయపుడే
మనసు కెపుడూ తృప్తి ప్రాప్తీ.
స్త్రీల పురుషుల ఒకరినొకరీ
ప్రేమ వలనెగ ప్రణయ సీమ.
ఈ ప్రణయమూ చిగురింత వలనే
ఇల్లు అగునొక స్వర్గ సీమ.
స్త్రీలు పురుషులు ప్రేమ మైకమున
ఏకమైతెనె పిల్లల పుట్టుక సందడి.
ఆ పిల్లల లాలన ఆలన స్త్రీలదే.
వారి పాలన మరి మగాళ్ళదే.
ఇదే గద యీ సృష్టి సీమలొ
తరతరాలుగ సాగు తీరూ.
ఆగక ఈగీ ఏగు బ్రతుకుకు
మెతుకు గతుకుల బ్రతుకు తెరువులు.
మనము ఆగిన సృష్టి ఆగదు.
ఏనాడు ఆగని కాలభ్రమణము
నందు నడిచెడి జీవులమ్మహొ !
ఎపుడొ చచ్చీ మాయ మగుదుము.
పుట్టి బ్రతికీ చచ్చి పోయే
బ్రతుకులే మనవెపుడు సృష్టిలొ.
ఎన్ని రకముల జీవులిక్కడట
పుణ్య పాపపు కృత్యములతో.
దీని కంతయు మూలమేదొ ఎవరొ
తెలియదెవరికి ఇసుమంతయైనను
ఎంత కాలమొ యీ సృష్టి నడకలు
కొనసాగుతూ యిల ఉండునో గద.
ఇదే సృష్టీ
మన పైన దృష్టీ
పెట్టి నడిచెడి
పరంపర యిది.
********************
రచన :--- రుద్ర మాణిక్యం.(✍️కవి రత్న)
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా)
************************************
No comments:
Post a Comment