పరిపూర్ణ స్నేహం అమరం
***********************
స్నేహం వరం కాపాడుకో శుభం
***************************
జగమంతా మాయ మిత్రుల వలయం,
హితులు కరువై అంతా అయోమయం,
జల్లెడ పట్టినా కానరారన్నది నిస్సందేహం,
నేడు స్నేహమన్నదాయె ఒక అర్థరహిత పదం.
సమయానికి దిగజారి పోయే సన్నిహితులు,
అవసరాలకు చల్లగ జారిపోయె స్నేహితులు,
నమ్మకానికి బహు దూరమాయె అసలైన మైత్రి,
కలుషితమాయెనే అమూల్య స్నేహం ఓ ధరిత్రి !
విలువలు వేళ్ళ మీద లెక్కించడ మాయె,
విలువైన స్నేహం అవినీతులకు వశమాయె,
ప్రాప్తమున్న దొరకు సన్నిహితుడు తప్పక మరి,
ప్రాణ స్నేహితులున్న పదిలంగా ఉంచుకో మరి.
స్నేహమన్నది అమృతం అందుకే అమరం,
దూరాన్ని జయించి పదిల పరచునెపుడు స్నేహం,
మిత్రులకు హితుడై స్నేహ విలువలనాస్వాదించు,
అర్థవంత జీవిత ప్రాప్తికి సన్నిహిత భావాన్నార్జించు.
అమూల్యమైన స్నేహం,
మాసి పోదది అమరం,
స్నేహంలో ఉట్టిపడు జీవం,
స్పందించు…నీ జన్మ ధన్యం.
స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు.
మీ,
NADIGOTTI CHANDRM
Director
Avani WONDERS
No comments:
Post a Comment